Home /News /andhra-pradesh /

AP POLITICS TDP CHIEF CHANDRABABU NAIDU SLAMS ON AP GOVERNMENT AND WROTE A LETTER TO DGP NGS

ChandraBabu: వేధింపులు మంచిది కాదు.. డీజీపీ చంద్రబాబు ఘాటు లేఖ.. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్

కేంద్రానికి  చంద్రబాబు ఘాటు లేఖ

కేంద్రానికి చంద్రబాబు ఘాటు లేఖ

Chandra Babu: ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం తీరుపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ నేతలు, పోలీసుల విషయంలో న్యాయ పోరాటం కూడా చేస్తున్నాయి విపక్షాలు.. ముఖ్యంగా అక్రమ కేసులపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఘాటుగా డీజీపీకి మరో లేఖ రాశారు చంద్రబాబు నాయుడు.

ఇంకా చదవండి ...
    Chandra Babu: ఆంధ్రప్రదేశ్  (Andhra Pradesh) లో ప్రభుత్వం తీరుపై విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ముఖ్యంగా అక్రమ కేసుల విషయం అన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. ప్రశ్నిస్తే అక్రమ కేసులతో వేధించడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికే దీనిపై పలు రకాలుగా విపక్షాలు ఆందోళనలు చేపట్టాయి. అయినా కేసులు కొనసాగుతుండడంతో టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై సీఐడీ వేధింపులు సరికాదని డీజీపీ కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌రెడ్డి (DGP Kasireddy Venkata Rajendranath Reddy) కి చంద్రబాబు లేఖ రాశారు. ఈ సందర్భంగా గార్లపాటి వెంకటేశ్వరరావు, మోకర్ల సాంబశివరావులను అక్రమంగా అదుపులోకి తీసుకుని సీఐడీ పోలీసులు (CID Police) వేధించారని లేఖలో ఆరోపించారు. నిజంగా తప్పు చేశారని భావిస్తే.. చట్ట పరంగా చర్యలు తీసుకోవాలి కాని.. ఇలా అర్ధరాత్రి గోడలు దూకి తలుపులు పగలగొట్టి నోటీసుల పేరుతో వేధింపులకు గురిచేయడం సరైన పద్ధతి కాదని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో ఆడవాళ్లు ఉన్న సమయంలో అక్రమంగా ఇంట్లోకి చొరబడి కుటుంబసభ్యులను భయబ్రాంతులకు గురి చేయడం దారుణమంటూ మండిపడ్డారు. అక్రమంగా కస్టడీలోకి తీసుకుని సీఐడీ పోలీసులు తీవ్రంగా వేధించారని, గంటల తరబడి స్టేషన్‍లో బట్టలు లేకుండా కూర్చోబెట్టి దాడికి పాల్పడం దారుణమని చంద్రబాబు లేఖలో డీజీపీ దృష్టికి తీసుకువెళ్లారు.

    కేవలం స్థానిక వైసీపీ నేతల ఆదశాల కారణంగానే ఇలా సీఐడీ పోలీసులు ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చశారు. సీఐడీ అధికారుల విచారణ గదిలో ఎటువంటి సీసీ కెమెరాలు లేవని.. అరెస్టు చేసే సమయంలో, విచారణ సమయంలో సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా సీఐడీ పోలీసులు వ్యవహస్తుంటే.. ఉన్నతాధికారులు ఎందుకు హెచ్చరించడం లేదని లేఖలో ప్రశ్నించారు. కొందరు కళంతకితమైన అధికారుల సహకారంతో ప్రతిపక్షాలను ప్రభుత్వం రాజకీయ వేధింపులకు గురి చేస్తోందన్నారు.



    ముఖ్యంగా టీడీపీ శ్రేణులపై బెదిరింపు చర్యలకు దిగుతున్నారని.. కేవలం అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నారనే కారణమో.. లేక టీడీపీ కి ఓటు వేస్తారనే భయమో కానీ.. అక్రమంగా అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టాల్సిన అవసరం సీఐడీ అధికారులకు ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు.

    ఇదీ చదవండి : గ్రామ, వార్డు వాలంటీర్లకు సీఎం జగన్ గుడ్ న్యూస్.. వారి కోసం ప్రత్యేకంగా అకౌంట్లో డబ్బులు.. ఎందుకో తెలుసా?

    నేరపూరితమైన కుట్రలకు పాల్పడిన సీఐడీ అధికారులపై చర్యలు తీసుకుని బాధితులకు అండగా నిలబడాలని డీజీపీకి రాసిన లేఖలో చంద్రబాబు కోరారు. కేవలం వైసీపీ నేతల ఆదేశాలతో నేరపూరితమైన కుట్రలకు పాల్పడిన సీఐడీ అధికారులపై చర్యలు తీసుకోవాలని, బాధితులకు అండగా నిలబడాలని డీజీపీని కోరారు. సీఐడీ అధికారులు వెంకటేష్, సాంబశివరావు ఇళ్లవద్ద అర్థరాత్రిపూట చేసిన దౌర్జన్యాలకు సంబంధించిన వీడియోలను లేఖకు జతచేసి కూడా పంపించారు చంద్రబాబు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, TDP

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు