Home /News /andhra-pradesh /

AP POLITICS TDP CHIEF CHANDRABABU NAIDU SLAMS CM JAGAN AND FINANCIAL STATUS OF ANDHRA PRADESH NGS

CM CONVEY: ఏపీ సర్కార్ కు షాక్.. సీఎంకు కన్వాయ్ కష్టాలు.. రాష్ట్రానికి అవమానం అన్న చంద్రబాబు

కుప్పంలో చంద్రబాబు

కుప్పంలో చంద్రబాబు

CM CONVEY: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి మరో వాస్తవం వెలుగులోకి వచ్చింది.. సీఎం జగన్ పర్యటనకు కన్వాయ్ కూడా దొరకని పరిస్థితి నెలకొంది. మూడేళ్లుగా ప్రభుత్వం అసలు కాన్వాయ్ ల కోసం బకాయిలు చెల్లించడం లేదా..? కాన్వాయ్ లేకుంటే సీఎం పర్యటనలు ఎలా..?

ఇంకా చదవండి ...
    CM CONVEY: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఆర్థిక పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతోంది. ఓ వైపు వరుస సంక్షేమ పథకాలను (Welfare schemes) సీఎం జగన్ (CM Jagan) విడుదల చేస్తూనే ఉన్నారు. ఇదే సమయంలో ఉద్యోగులకు సమయానికి జీతాలు (Employees Salaries) కూడా పడడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో మరో వాస్తవం వెలుగులోకి వచ్చింది. ఇటీవల ప్రకాశం జిల్లా (Prakasam District)లో సీఎం జగన్ కాన్వాయ్ లో వాహనం కావాలంటూ ఆర్టీవో సిబ్బంది తిరుపతి (Tirupati) వెళ్లే కుటుంబం నుంచి వాహనం లాకున్న వైనం పెను దుమారం రేపింది. దీనిపై రాజకీయంగా రచ్చ అవ్వడంతో.. ప్రభుత్వం సస్పెన్షన్లకు దిగింది. దీంతో ఇప్పుడు సర్కార్ కు మరో షాక్ తగిలింది. సీఎం జగన్ కాన్వాయ్ కోసం గత మూడేళ్లుగా చేసిన ఖర్చుకు సంబంధించి పాత బిల్లులు క్లియర్ చేయాలంటూ రవాణాశాఖ (Transport Department) అధికారులు తాజాగా ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఇందులో వారు సీఎంతో పాటు వీఐపీల కాన్వాయ్ ల కోసం.. ఈ మూడేళ్లలో 17.5 ఖర్చు పెట్టినట్లు చూపారు. ఈ మొత్తాల్ని తక్షణం చెల్లించాలని రవాణాశాఖ ప్రభుత్వాన్ని కోరింది. దీంతో ఈ బకాయిల వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారి తీస్తోంది.

    ఏపీ సర్కార్‌పై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu).. 3 ఏళ్లుగా కాన్వాయ్ డబ్బులు ప్రభుత్వం బాకీ పడడం రాష్ట్రానికి తీరని అవమానమన్నారు. స్వయాన సీఎం కాన్వాయ్ కోసం కార్లు పెట్టిన వారికి ప్రభుత్వం 17 కోట్ల రూపాయలకు పైగా బాకీ పడడం సిగ్గుచేటన్నారు. వ్యవస్థల పతనానికి ఇది ప్రత్యక్ష నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకుల వైఫల్యం అధికారులను, ఉద్యోగులను కూడా ఒత్తిడిలోకి నెట్టేస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యవస్థల పతనం తీవ్ర ఆందోళన కలిగిస్తుందన్నారు. సీఎం కాన్వాయికు కార్లు పెట్టిన వారికి బిల్లులు చెల్లింపులు చేయకపోవడం రాష్ట్ర దుస్థితికి ఉదాహరణగా ఆయన అభిప్రాయపడుతున్నారు.

    ఇదీ చదవండి : ఒకటి ఆదానీ ఫ్యామిలీకి.. మరొకటి మెగా ప్రొడ్యూసర్ కు.. ఒక్క సీటుపైనే సందిగ్ధం.. విజయసాయి సంగతి ఏంటి..?

    కనీసం సీఎం కాన్వాయ్‌కు కార్లు కూడా పెట్టుకోలేని స్థితిలో రాష్ట్రం ఉందంటే పరిపాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ మొత్తం అంశాన్ని ఒక శాఖలో పెండింగ్ బిల్లుల అంశంగా మాత్రమే చూడకూడదని అన్నారు. రాష్ట్ర ఆర్థిక నిర్వహణకు, వ్యవస్థల ధ్వంసానికి ఉదహరణ గా చూడాలి అన్నారు. ఇలాంటి ఘటనలు రాష్ట్ర బ్రాండ్‌ను దారుణంగా దెబ్బ తీయవా అని ప్రశ్నించారు. మూడేళ్లుగా బిల్లులు చెల్లింపులు జరపకపోతే అధికారులు ఎలా కార్లు ఏర్పాట్లు చేస్తారని నిలదీశారు. బిల్లులు రాకపోతే యజమానులు పడే బాధలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. అసలు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అప్పులు ఎంత.. పెండింగులో ఉన్న బిల్లులు ఎంత అనే అంశం పై వైట్ పేపర్ వేసి వాస్తవాలు వెల్లడించగలరా అని చంద్రబాబు డిమాండ్ చేశారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Chandrababu Naidu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు