Home /News /andhra-pradesh /

AP POLITICS TDP CHIEF CHANDRABABU NAIDU SLAMS AP GOVERNMENT ON MUNICIPAL SCHOOLS NGS

Chandrababu Naidu: మున్సిపల్ స్కూళ్ల విలీన నిర్ణయనం వెనుక భారీ కుట్ర.. టీచర్ల పోరాటానికి మద్దతు

చంద్రబాబు (ఫైల్)

చంద్రబాబు (ఫైల్)

Chandrababu Naidu: ఏపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు చంద్రబాబు నాయుడు.. మున్సిపల్ స్కూళ్ల విలీనం వెనుక భారీ కుట్రే దాగి ఉంది అన్నారు. వేల కోట్ల ఆస్తికోసం.. నాలుగున్నర లక్షల విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెడతారా అని చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు.

ఇంకా చదవండి ...
    Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) తీరుపై తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrabau Naidu) సంచలన ఆరోపణలు చేశారు. విద్యా శాఖలోకి మున్సిపల్ స్కూళ్ల విలీనం వెనుక ప్రభుత్వ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వ్యాప్తంగా 2,115 పురపాలక పాఠశాలలకు చెందిన వేల కోట్ల ఆస్తుల కోసమే ఈ విలీన ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) తన స్వార్థం కోసం నాలుగున్నర లక్షల విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ స్కూళ్ల విలీన నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ అంశంపై టీచర్లు చేస్తున్న పోరాటానికి తాను పార్టీ తరపున పూర్తి మద్దతు ఇస్తున్నానని ప్రకటించారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ స్కూళ్లు పేద, బడుగు వర్గాల విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఎంతో కీలకంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రైవేటు స్కూళ్ల నుంచి కూడా మున్సిపల్ స్కూళ్లకు అడ్మిషన్లు వస్తున్నాయని.. కొన్ని పురపాలక పాఠశాలల్లో సీట్లు లేక నో అడ్మిషన్ బోర్డులు పెట్టిన పరిస్థితి ఈ ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు.

    ఏపీలో నిన్నటి వరకు ఎయిడెడ్ స్కూళ్లను టార్గెట్ చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు మున్సిపల్ స్కూళ్ల ఆస్తులపై కన్నేసిందని విమర్శించారు. ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న మున్సిపల్ స్కూళ్ల విలీన నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని లేదంటే ప్రజాగ్రహం ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ప్రస్తుతం ప్రభుత్వ ప్రతిపాదనలు హైకోర్టు ఉమ్మడి సర్వీస్ రూల్స్‌కు విరుద్ధంగా ఉన్నాయని మండిపడ్డారు. దీనిపై పోరాటం చేయడానికి టీడీపీ సిద్ధంగా ఉందన్నారు.. అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తామన్నారు.



    ఇప్పటికే పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వం వైఫల్యం చెందిందంటూ చంద్రబాబు ఆరోపించారు. పదో తరగతి పరీక్షా ఫలితాల అంశం పైన టీడీపీ ప్రభుత్వం మధ్య మాటల యుద్దం సాగింది. ఏపీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యంత తక్కువ శాతం పాసవ్వడం ప్రభుత్వ వైఫల్యమే అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కేవలం మంత్రి రాని కారణంగా ఫలితాలను వాయిదా వేయడం ఏంటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అలాగే అప్రకటిత విద్యుత్ కోతలు సైతం విద్యార్థులపై ప్రభావం చూపించిందని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ అసమర్థతకు పదో తరగతి విద్యార్థులను బలి చేయడం దారుణమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    ఇదీ చదవండి : సీఎం జగన్ కు బిగ్ షాక్.. నారా లోకేష్ ను కలిసిన వైసీపీ కీలక నేత

    తాజాగా జనసేన అధినేత పవన్ సైతం వారికి గ్రేసు మార్కులు ఇవ్వాలని డిమాండ్ చేసారు. ప్రభుత్వం మాత్రం ఎక్కడా పొరపాటు జరగలేదని చెబుతోంది. పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులే పేపర్లు దిద్దారని చెప్పుకొస్తోంది. ఇక, ఇప్పుడు మున్సిపల్ పాఠశాలల విలీనం వ్యవహారం పైన విమర్శలు మొదలయ్యాయి. దీంతో..ఇప్పుడు ప్రభుత్వం ఈ విషయంలో ఏం చేయనుందో చూడాల్సి ఉంది.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Chandrababu Naidu, TDP

    తదుపరి వార్తలు