హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Chandrababu: ఆ ఇంఛార్జ్ లపై కన్నెర్ర.. అభ్యర్థులను మార్చాలా అంటూ వార్నింగ్.. లిస్ట్ ఫైనల్ అయ్యిందా?

Chandrababu: ఆ ఇంఛార్జ్ లపై కన్నెర్ర.. అభ్యర్థులను మార్చాలా అంటూ వార్నింగ్.. లిస్ట్ ఫైనల్ అయ్యిందా?

చంద్రబాబు సంచలన నిర్ణయం

చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu: ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ హీట్ పెరిగింది. అన్ని పార్టీలు ఎన్నికలపై ఫోకస్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు అధినేతలు. తాజాగా చంద్రబాబు నాయుడు 59 మంది ఇంఛార్జులతో భేటీ అయ్యారు.. అందులో కొందరికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఏమన్నారంటే..?

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Guntur, India

  Chandrababu: ఆర్ యు రెడీ.. అంటూ చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నేరుగా ప్రశ్నించారు.. ఇష్టం లేదా..? కష్టంగా ఉందా..? నమ్మకం కోల్పోయారా..? ఎవరి సహకారం దొరకడం లేదా.. మీ సమస్య ఏంటి.. అయితే తప్పుకోండి.. ప్రత్యామ్నాయం చూసుకుంటాను అంటూ ఇంఛార్జులపై తెలుగు దేశం (Telugu Desam) అధినేత సీరియస్ అయ్యారు. ఇది స్వీట్ వార్నింగ్ కాదు.. సీరియస్ వార్నింగ్ అంటూ కన్నెర్ర చేశారు. ఎవరి జాతకాలు ఏంటి అన్నది తన దగ్గర రిపోర్ట్ రెడీగా ఉందన్నారు. ఈ సారి ఎలాంటి మొహమాటాలకు తావులేదన్నారు. గెలుపు గుర్రాలే తనకు కావాలి అంటూ మొహంపైనే చెప్పేశారు. తాజాగా పార్టీ కార్యాలయంలో 59 మంది ఇంఛార్జులతో ఆయన ముఖా ముఖి సమావేశం నిర్వహించారు. గత కొన్ని రోజుల నుంచి ఆయన ఇలా రివ్యూ మీటింగ్ లు నిర్వహిస్తూ.. క్షేత్ర స్థాయి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

  మొదట వారు చెప్పిన మాటలన్నీ వింటున్నారు.. ఆ తరువాత తన దగ్గర ఉన్న రిపోర్ట్ ను బయటపెడుతు.. ఇదీ మీ జాతకం అని కడిగి పారేస్తున్నారు.. తాను తెప్పించుకున్న ఇంటర్నల్ రిపోర్ట్స్ ఆధారంగా బాగా పనిచేస్తున్న నియోజకవర్గ ఇంచార్జ్ లను మాత్రం అభినందిస్తూ.. వచ్చే ఎన్నికల్లో మీరే అభ్యర్థులు అని ప్రకటించేస్తున్నారు.

  తనకు అందిని రిపోర్టు ప్రకారం సమర్థవంతంగా లేని వారిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మీరు ఎన్నికలు సిద్దంగా ఉన్నారా? లేక ప్రత్యామ్నాయం చూసుకోమంటారా అంటూ నిలదీస్తున్నారు. ఇప్పటి వరకు ఏం చేశారు అన్ని కూడా వివరిస్తున్నారు. మెంబర్ షిప్ డ్రైవ్ మొలుకొని.. బాదుడే బాదుడు వరకు అన్ని అంశాలపై రివ్యూ చేస్తున్నారు. నేతల పనితీరుపై తన వద్ద ఉన్న సమాచారాన్ని రివ్యూలలో బయటకు తీసి సమీక్షలు నిర్వహిస్తున్నారు.

  ఇదీ చదవండి : ఏపీలో మొదలైన నవరాత్రి శోభ.. అమ్మవారికి అష్టాదశ శక్తిపీఠాల నుంచి సారె.. చూస్తే వావ్ అంటారు

  సమగ్రమైన, లోతైన నివేదికలతో నేతలను ప్రశ్నిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణతో పాటు స్థానిక సమస్యలపై, ప్రత్యర్థి నేతలపై పోరాటాల విషయంలో కూడా ఇంచార్జ్ లతో రివ్యూ చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గాలేని వారు పనితీరు మార్చులకోవాలని స్పష్టం చేశారు. ఇంచార్జ్ గా ఉన్నవారు నియోజకవర్గంలో అందరినీ కలుపుకుని వెళ్లాలని. ఏకపక్షంగా ఉంటే ఉపేక్షించేది లేదని కూడా చెపుతున్నారు.

  ఇదీ చదవండి : టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ దూరం..! కారణం అదేనా?

  గతంలో ఏ ప్రభుత్వంపై లేనంత వ్యతిరేకత జగన్ ప్రభుత్వంపై ఉందని.. ఇలాంటప్పుడు ఇంట్లో కూర్చుంటామంటే కుదరదని నేతలకు తేల్చి చెబుతున్నారు. ఈ సమీక్షలను నేతలంతా సీరియస్ గా తీసుకుని పనితీరు మెరుగుపరుచుకోవాలని.. అంతిమంగా పనితీరే ప్రామాణికం అని గుర్తుపెట్టుకోవాలని సూచిస్తున్నారు. గత నెలలో ప్రారంభమైన ఈ రివ్యూలలో ఇప్పటివరకు 59 నియోజకవర్గాల్లో ముగిశాయి. ఈ రోజు రాజమండ్రి సిటీ, పెద్దాపురం, రాజాం నియోజవర్గాల ఇంచార్జ్ లు ఆదిరెడ్డి భవాని, చినరాజప్ప, కోండ్రు మురళిలతో సమీక్ష చేశారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, AP Politics, Chandrababu Naidu, TDP

  ఉత్తమ కథలు