హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Chandrababu Naidu: రోడ్డుపైనే బైఠాయించిన చంద్రబాబు.. కుప్పం వేదికగా సంచలన ప్రకటన

Chandrababu Naidu: రోడ్డుపైనే బైఠాయించిన చంద్రబాబు.. కుప్పం వేదికగా సంచలన ప్రకటన

రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు

రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు

Chandrabbau Naidu: కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు నిరసనకు దిగారు. నేరుగా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. అన్న క్యాంటీన్ పై దాడి చేయడం ఏంటని ప్రభుత్వం తీరును నిరసనిస్తూ ధర్నాకు దిగారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Kuppam, India

Chandrababu Naidu: తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) రోడ్డుపైనే బైఠాయించారు.. వైసీపీ నేతలు (YCP Leaders), పోలీసుల తీరుకు నిరసనగా ఇలా ఆయనే స్వయంగా ధర్నా చేశారు. ఎందుకంటే.. కుప్పం (Kuppam) లో చంద్రబాబు నాయుడు రెండు రోజు పర్యటన లో భాగంగా అన్న క్యాంటీన్ (Anna Canteen) ను ప్రారంభించాల్సి ఉంది.  అక్కడకు చేరుకున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు కొందరు అన్న క్యాంటీన్ ను ధ్వంసం చేశారు. అక్కడ ఉన్న టీడీపీ (TDP) ప్లెక్సీలను చించేశారు.. అక్కడితోనే వారి ఆవేశం చల్లార లేదు.. నేరుగా టీడీపీ కార్యకర్తలపై దాడికి దిగారు.. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంది (Tension in Kuppam).. అయితే పోలీసులు అక్కడే ఉన్నా.. వైసీపీ నేతలను అడ్డుకోకుండా.. టీడీపీ వాళ్లను అడ్డుకోవడంపై ఆ శ్రేణులు మండిపడుతున్నారు. విషయం తెలియడంతో హుటాహుటిన చంద్రబాబు అన్న క్యాంటీన్ ప్రదేశానికి బయలు దేరారు. ఆయన్ను కూడా పోలీసులు అడ్డుకోవడంతో ఇలా.. అక్కడే బైఠాయించిన చంద్రబాబు నిరసన చేపట్టారు.


కుప్పం చరిత్రలోనే నేడు చీకటి రోజు అని మండిపడ్డారు. ఈ సంరద్భంగా సంచలన ప్రకటన చేశారు. నేటి నుంచి వైసీపీ ప్రభుత్వంపై ధర్మపోరాటానికి దిగుతున్నట్టు ప్రకటించారు. అది కూడా కుప్పం నుంచే ప్రారంభిస్తున్నాను అన్నారు. ఒక ఎమ్మెల్యే సొంత నియోజకవర్గంలో తిరుగుతుంటే ఇన్ని ఆటంకాలు కలిగిస్తారా.. మాజీ ముఖ్యమంత్రిని.. పార్టీకి అధినేతను అని కూడా ఆలోచించకుండా ఇలా తనపై దాడికి దిగుతారా అని ప్రశ్నించారు.అసలు మనం ప్రజా స్వామ్యంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోంది అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఇంత గొడవ జరుగుతోందని తెలిసినా.. మిస్టర్ ఎస్పీ ఎక్కడ ఉన్నావ్ అంటూ  నిలదీశారు.  రాష్ట్రానికి అతలాకుతలం చేయాలని వైసీపీ ప్రభుత్వం కంకణం కట్టుకుందా అని ప్రశ్నించారు. కుప్పుంలో  ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి చూశారా అని ప్రజలను ఆయన నిలదీశారు.ఇదీ చదవండి : కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత.. అన్న క్యాంటీన్ ధ్వంసం.. స్కూళ్లు బంద్


పోలీసులను గుండాలను పంపించడం కాదు.. ధైర్యం ఉంటే జగన్ మోహన్ రెడ్డి కూడా ఇక్కడకు రావాలి అంటూ ఛాలెంజ్ చేశారు. ఖబడ్దార్ మిస్టర్ జగన్ మోహన్ రెడ్డి అంటూ తీవ్రంగా హెచ్చరించారు. నేను బతికి ఉన్నంత వరకు కుప్పంలో మీరు ఏమీ చేయలేరని ఛాలెంజ్ చేశారు. కుప్పానికి ఈ చోటా మోటాలు కాదు.. నేరుగా జగన్ మోహన్ రెడ్డే రావాలి అని సవాల్ చేశారు. పేదలకు కడుపు నింపే అన్న క్యాంటీన్ ను ధ్వంసం చేసి.. రాక్షస ఆనందం పొందుతారా అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బాదుడే బాదుడు కార్యక్రమానికి వచ్చిన స్పందన చూసి తట్టుకోలేకే ఇలాంటి విధ్వంసానికి దిగుతున్నారంటూ చంద్రబాబు మండిపడ్డారు.

First published:

Tags: Andhra Pradesh, Chandrababu Naidu, Kuppam, TDP

ఉత్తమ కథలు