జంగారెడ్డిగూడెం మిస్టరీ మరణాల (Jangareddygudem Mystery Deaths) వివాదం చుట్టూ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు తిరుగుతున్నాయి. పట్టణంలో మూడు రోజుల్లో 18 మంది మృతిచెందడంపై రాజకీయాలు వేడెక్కాయి.
జంగారెడ్డిగూడెం మిస్టరీ మరణాల (Jangareddygudem Mystery Deaths) వివాదం చుట్టూ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు తిరుగుతున్నాయి. పట్టణంలో మూడు రోజుల్లో 18 మంది మృతిచెందడంపై రాజకీయాలు వేడెక్కాయి. కల్తీ సారా వల్లే వీళ్లంతా మృతి చెందారని.. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ (TDP) ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఆందోళనకు దిగారు. దీనికి మంత్రులు కౌంటర్ ఇవ్వగా.. సీఎం జగన్ (AP CM YS Jagan) అసెంబ్లీలో ప్రకటన చేస్తూ.. అవన్నీ సహజమరణాలేనన్నారు. టీడీపీ కావాలనే అసత్య ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఐతే టీడీపీ అధినేత చంద్రబాబు.. జంగారెడ్డిగూడెంలో పర్యటించి మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా వైసీపీ సర్కార్ పై మండిపడ్డ ఆయన.. సీఎం జగన్ పై ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో కల్తీ మద్యం మాఫియా వెనుక సీఎం ఉన్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేస్తామన్న వైసీపీ ప్రభుత్వం.. మద్యం, నాటుసారాను ఏరులై పారిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ నేతలే కల్తీసారాను విక్రయిస్తున్రని.. పక్కరాష్ట్రాల నుంచి మద్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారని ఆయన అన్నారు. ఏపీలో మద్యం తయారీ నుంచి అమ్మకాల వరకూ అన్నీ సీఎం జగనేచేసత్న్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కల్తీసారాను పూర్తిగా అరికట్టేవరకు పోరాడతామని చంద్రబాబు స్పష్టం చేశారు.
కల్తీ మద్యం కారణంగా పట్టణంలో మొత్తం 26 మంది మృతి చెందారని.. ఒక్కొక్క కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు తాము కూడా అండగా ఉంటామన్న ఆయన.. ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున సాయం చేస్తామని తెలిపారు.
కల్తీ సారాతో 26 మంది చనిపోతే సిగ్గులేకుండా మరణాలను దాచిపెడుతున్నారని.. తమ దగ్గర అన్ని వివరాలు ఉన్నాయని చంద్రబాబు స్పష్టం చేశారు. తాను ప్రజారాజకీయాలే చేస్తాననన్న ఆయన.. వివేకా హత్య లో తనపై నిందలు వేశారని అబద్ధాలు చెప్పారని విమర్శించారు. సొంత బ్రాండ్లు తేవడమే మద్యపాన నిషేధమా? అని ప్రశ్నించారు. మద్యం రెట్లు పెంచడం వల్ల తాగేవాళ్లు తగ్గలేదు ... చనిపోయే వాళ్ళ సంఖ్య పెరిగిందన్నారు. కమిషన్లు కోసమే వైన్ షాప్స్ లో ఆన్లైన్ చెల్లింపులు పెట్టడం లేదని ఆరోపించారు.
నన్ను విమర్శించే హక్కు వైసీపీ పెంపుడు కుక్కలకు లేదని., ఒక్క ముక్క వేస్తే మొరిగే కుక్కలు ఆ నేతలంటూ చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ లేకపోతే చనిపోయిన కుటుంబాల వైపు ప్రభుత్వం చూసేది కాదని.., నాటు సారా వాళ్ళను వదిలేది లేదని హెచ్చరించారు. ఎల్జీ పాలిమర్స్ తప్పు వల్ల జనం చనిపోతే ప్రభుత్వం పరిహారం ఇచ్చిందని.. మరి ఇవి జగన్ చేసిన హత్యలైతే పరిహారం ఎందుకివ్వరన్నారు. టీడీపీ అధికారం లోకి వచ్చిన తరువాత ప్రతి కుటుంబానికి 25 లక్షల సాయం చేస్తామని ప్రకటించారు. తమ పాలనలో పోలీసుల ప్రతిష్టపెంచితే.. వైసీపీ హాయంలో మంత్రులు పోలీసుల చొక్కాలు పట్టుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.