హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Chandrababu Naidu: ప్రధాని మోదీని వారితో పోల్చిన చంద్రబాబు.. పొత్తుకు సంకేతమేనా..?

Chandrababu Naidu: ప్రధాని మోదీని వారితో పోల్చిన చంద్రబాబు.. పొత్తుకు సంకేతమేనా..?

ప్రధాని మోదీపై చంద్రబాబుపై పొగడ్తలు

ప్రధాని మోదీపై చంద్రబాబుపై పొగడ్తలు

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ లో పొత్తుల దిశగా ఒక్కో అడుగు ముందుకు పడుతోంది.. ముఖ్యంగా బీజీపీతో కలిసే వెళ్లాలని టీడీపీ ఫిక్స్ అయ్యిందా.. తాజాగా స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకల్లో చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తే.. అవే సంకేతాలు అందుతున్నాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Guntur, India

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ముందస్తు ఎన్నికలు తప్పవని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగా రాజకీయ వ్యూహాల్లో దూకుడు పెంచుతున్నాయి. ముఖ్యంగా తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) .. ఈ దిశగా మరో అడుగు ముందుకేసే ప్రయత్నం చేస్తున్నారు. పొత్తులపై విషయంలో త్వరగా క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాని మోదీ (Prime Minster Modi) దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే.. అంతా అనుకున్నట్టే జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఆ దిశగా ముమ్మర ప్రయత్నాలే చేస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు (Independence Day Celebrations) ఘనంగా జరుగుతున్నాయి. రాజకీయ పార్టీలు, వాటి అధినేతలు జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇదే క్రమంలో ఏపీలో విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరులో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు భారీ ర్యాలీగా బయలుదేరి మరీ వచ్చారు. ఉండవల్లిలోని నివాసం నుంచి గుంటూరు వరకు భారీ ర్యాలీగా వెళ్లి.. పాల్గొన్నారు. ఈ పతాకావిష్కరణ తరువాత చంద్రబాబు కార్యకర్తల్నిఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీపై.. ఆయన విజన్ పై పొగడ్తలు కురిపంచారు. అది కూడా ఆ నాటి దిగ్గజ నేతల సరసన మోదీకి స్థానం కల్పించారు. 400 ఏళ్ల క్రితం నాగరికతలో భారత దేశం ఎంతో ముందు ఉందన్నారు. అప్పట్లోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత దేశం ఉందన్నారు. వలస పాలనలో భారత దేశం తరువాత తీవ్రంగా నష్టపోయిందన్నారు. ఆకలి బాధలు, కరువు కాటకాలతో దేశం అల్లాడిందని, నెహ్రూ, పీవీ, వాజ్ పేయి, మోదీ వంటి వారు దేశాన్ని నడిపించారని చంద్రబాబు తెలిపారు.

అయితే ప్రధాని మోదీని చంద్రబాబు అలా పొగడడం వెనుక వేరే రీజన్ ఉందని ప్రచారం జరుగుతోంది. మొన్నటి ఎన్నికల ముందు వరకు మోదీని ఓ రేంజ్ లో తిట్టిన చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు దిగ్గజ నాయకులు సరసన చేర్చడం వెనుక.. రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయని భావిస్తున్న చంద్రబాబు నాయుడు.. బీజేపీతో పొత్తు కోవాలని.. కుదరని పక్షంలో.. రాజకీయంగా అండగా నిలవాలని మోదీని కోరే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇదీ చదవండి : ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. ఒకే వేదికపై సీఎం జగన్-చంద్రబాబు-పవన్.. ఏం జరగనుంది?

ఇందులో భాగంగానే ఇటీవల ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు కాసేపు ప్రధానితో మాట్లాడారు.. ఆ సందర్భంగా చాలా విషయాలు మాట్లాడాలని చంద్రబాబు చెప్పడం.. త్వరలోనే మోదీ కలుద్దామని చెప్పడం జరిగింది. దీంతో ఈ నెల ఆఖరు లేదా సెప్టెంబర్ తొలి వారంతో ప్రధాని అపాయింట్ మెంట్ అడిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధాని ఓకే అంట ముందుగా పొత్తుల అంశము.. రాజకీయంగా వైసీపీని ఓడించాల్సిన అవసరం తదితర అంశాలపైనే చర్చించే అవకాశం ఉంది. ఒకవేళ జగన్ తో వైరం పెట్టుకునే పరిస్థితి లేదని మోదీ అంటే.. పొత్తు లేకపోయిన.. రాజకీయంగా అండగా ఉండాలని.. ఎన్నికల సమయంలో న్యూట్రల్ గా అయినా ఉండి సహకరించాలని చంద్రబాబు కోరే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఇదీ చదవండి : స్టెప్పులతో అదరగొట్టిన మంత్రి రోజా.. తన హిట్ సినిమా పాట రావడంతో హుషారు? ఎక్కడో తెలుసా?

మోదీకి దగ్గర అవ్వడమే ప్రస్తుతం చంద్రబాబు ముందు ఉన్న టార్గెట్ అని.. అందుకే ఈ జెండా పండుగ వేడుకలో మోదీపై పొగడ్తలు కురిపించారని సమాచారం. ఇంకా ఆయన ఏమన్నారంటే దేశం స్వాతంత్ర్యం రాక ముందు, వచ్చిన తరవాత అనేది చూడాలి...అలాగే సంస్కరణలకు ముందు సంస్కరణ తరువాత అని చూడాలన్నారు. నాడు జాతి కష్టాల్లో ఉందని భావించి ఎన్టీఆర్ సినిమాల్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చారని చంద్రబాబు గుర్తుచేశారు. ఇప్పటికీ నేషన్ ఫస్ట్ అని ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ జెండా ప్రతి ఇంటిపై ఎగరాలని, ప్రతి ఒక్కరి మదిలో జెండా ఉండాలని చంద్రబాబు కోరారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, Independence Day 2022, Pm modi

ఉత్తమ కథలు