Chandrababu: ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh) రాజకీయాల్ల్లో ఇప్పుడు చర్చంతా పొత్తుల చుట్టే తిరుగుతోంది. అన్ని పార్టీలు ఈ పొత్తుల గురించి చర్చించుకుంటున్నాయి.. ఏ ఇద్దరి రాజకీయ నాయకులు కలిసినా.. పొత్తులపైనే మాట్లాడుకుంటున్నారు. మరి ఏపీలో పొత్తులు ఉంటాయా ఉండవా..? 2024 ఎన్నికలకు ఏఏ పార్టీలు పొత్తులు పెట్టుకుంటాయి... అన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇటీవల బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా జిల్లాల పర్యటనల్లో ఉన్న చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) .. వైసీపీ (YCP) అరాచక పాలనను అంతం చేయడానికి అన్ని పార్టీలు కలలిసి రావాలి అన్నారు.. దానికి నాయకత్వం తాను వహిస్తాను అన్నారు. అలాగే అవసరమైతే త్యాగానికి కూడా సిద్ధమే అన్నారు. దీంతో చంద్రబాబే పొత్తులు కోరుకుంటున్నారంటూ చర్చ మొదలైంది. ఆ వెంటనే బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) స్పందిస్తూ.. చంద్రబాబు త్యాగాలు చాలాసార్లు చూశామన్నారు. అయితే కుటుంబ, అవీనితి పార్టీలతో పొత్తు పెట్టుకునే అవసరం బీజేపీకి లేదు అంటూ కౌంటర్ ఇచ్చారు.. సోము వీర్రాజు స్పందించిన కాసేపటికే జనసేన అధినేత పవన్ కీలక వ్యాఖ్యలు (Pawank Kalyan) చేశారు.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదు అంటే.. అన్ని పార్టీలు కలిసి పోటీ చేయాలి అన్నారు. ఒక వేల విడివిడిగా పోటీ చేసి.. పొరపాటున వైసీపీ (YCP) గెలిస్తే.. ప్రజలు తీవ్రంగా నష్టటపోతారని అభిప్రాయపడ్డారు. పొత్తుల కోసం చర్చలు అవసరం అంటూ చంద్రబాబుకు సంకేతాలు పంపారు. దీంతో టీడీపీ (TDP)-జనసేన (Janasena) పొత్తు ఫిక్స్ అయ్యిందని.. ఇక బీజేపీ లెక్కే తేలాలి అంటూ అందరూ అభిప్రాయపడుతున్న వేళ.. చంద్రబాబు కొత్త మాట చెప్పారు..
పొత్తులపై చంద్రబాబు కొత్త పాట అందుకున్నారు. తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని అంటున్నారు. తన వ్యాఖ్యలను పొత్తులపై మాట్లాడినట్లు వక్రీకరించారని తెలిపారు. కాకినాడలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని పేర్కొన్నారు. వైసీపీది డైవర్షన్ పాలిటిక్స్ అని మండిపడ్డారు. వైసీపీ ఇలాంటి డైవర్షన్ రాజకీయాలే చేస్తుందని విమర్శించారు. తన బలహీనతను అధిగమించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపించారు. 2024 ఎన్నికల్లో ఓడిపోతే.. ఇక వైసీపీ ఉండదని జగన్ భయం పడుతున్నారని తెలిపారు. భయంతో అందరి కాళ్లు పట్టుకున్న నేత జగన్ అని ఎద్దేవా చేశారు.
జగన్ సింహం కాదని.. పిల్లి అంటూ ఎద్దేవ చేశారు. 2024లో ఓడిపోతే వైసీపీ ఉండదని జగన్ కు అర్థమైందని చెప్పారు. 2024 ఎన్నికల్లే వైసీపీకి చివరి ఎన్నికలు అన్నారు. ప్రభుత్వాన్ని ఓడించేందుకు ప్రజలంతా కలిసి రావాలని పిలుపిచ్చారు. ప్రజలంతా కలిసికట్టుగా పని చేయాలన్నారు. అయితే చంద్రబాబు ఇలా మాట మార్చడానికి వేరే కారణం ఉంది అంటున్నారు. చంద్రబాబే పొత్తు పొత్తు అని ఆరాట పడితే.. జనసన, బీజేపీ లాంటి పార్టీలు సీట్లు విషయంలో భారీ డిమాండ్లు పెట్టే ప్రమాదం ఉందని.. అదే జరిగితే పార్టీకి తీవ్రం నష్టం తప్పదని భావించి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఇదీ చదవండి: టీడీపీ-జనసేన కలిస్తే ఏపీలో లెక్కలు ఇవే.. వైసీపీ ఓటమి తప్పదంటున్న రెబల్ ఎంపీ
పవన్ కళ్యాణ్ కూడా పొత్తు అవసరం అనే ఉద్దేశంతో ఉన్నారని.. అలాంటప్పుడు జనసేన నుంచి ప్రతిపాదన వస్తే.. సీట్ల విషయంలో కండిషన్ పెట్టే అవకాశం వస్తుందని చంద్రబాబు లెక్కలేసి ఉండొచ్చు.. అలాగే ఏపీ బీజేపీ నేతలు వ్యాఖ్యలు కూడా చంద్రబాబు నిర్ణయానికి కారణం కావొచ్చు.. బీజేపీ కి కూడా ఏపీలో సీట్లు గెలవడం అవసరం.. అలా జరగాలి అంటే.. వారి పొత్తు కోసం ముందుకు వస్తారని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. అందుకే చంద్రబాబు ఇప్పుడు ఇలా యూటర్న్ తీసుకుని ఉంటారని అభిప్రాయపడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, TDP