హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

TDP: పొత్తులతో సంబంధం లేకుండానే సీట్లపై క్లారిటీ? అందరి చూపు ఆ యువ నేతపైనే..?

TDP: పొత్తులతో సంబంధం లేకుండానే సీట్లపై క్లారిటీ? అందరి చూపు ఆ యువ నేతపైనే..?

సీట్లపై నేతలకు చంద్రబాబు క్లారిటీ

సీట్లపై నేతలకు చంద్రబాబు క్లారిటీ

Telugu Desam: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం పొత్తులపైనే చర్చ జరుగుతోంది. అధికార వైసీపీ సింగిల్ గానే ఎన్నికలకు వెళ్లాలని ఫిక్స్ అయ్యింది. ఇక టీడీపీ-జనసేన కలిసి వెళ్తాయనే ప్రచారం ఒకటి.. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వెళ్తాయని మరో ప్రచారం ఉంది. ఆ పొత్తుల సంగతి ఎలా ఉన్నా.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొందరి నేతలకు సీట్లపై క్లారిటీ ఇచ్చేశారా?

ఇంకా చదవండి ...

  P Anand Mohan, Visakhapatnam, News18

  Telugu Desam: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. అన్ని పార్టీలు ఇప్పటికే గెలుపు ఓటములపై లెక్కలు వేసుకుంటూ.. ప్రత్యర్థి పార్టీలకు ధీటుగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఇదే సమయంలో విపక్షాల పొత్తులపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఓ వైపు పొత్తులు ఉంటాయని ఓ వర్గం చెబుతుంటే.. తాజా పరిస్థితి చూస్తుంటే.. పొత్తులపై టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) .. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇద్దరి స్వరంలోనూ మార్పు కనిపిస్తోంది. ఇటీవల జనసేన అధినేత అయితే మూడు ఆప్షన్లు కూడా ఓపెన్ గానే ఇచ్చారు. ఆ ఆప్షన్లే తెలుగు దేశం నేతలకు ఆగ్రహం తెప్పిస్తోంది.. పవన్ ఆప్షన్లకు తలొగ్గితే.. చాలా త్యాగాలు చేయాలని.. పార్టీ కూడా పూర్తిగా తగ్గి ఉండాల్సి వస్తుందని.. ఇది మొదటికే మోసం వస్తుందని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. దీనికితోడు మహానాడు సక్సెస్.. ఆ తరువాత చంద్రబాబు నాయుడు జిల్లా టూర్లకు వచ్చిన స్పందన చూస్తే.. పవన్ కోసం చేతులు కట్టుకుని నిలబడడం కంటే ఒంటరిగా ఎన్నికల్లోకి వెళ్లడమే బెటరని.. ప్రజల్లో టీడీపికి ఆదరణ ఉందని  కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. అధినేత మాత్రం పొత్తులపై పెదవి మెదపడం లేదు. మరోవైపు కీలక నియోజకవర్గాల్లో పొత్తులతో సంబంధ లేకుండా.. కేటాయింపులు చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం వైజాగ్ టూర్ లో నేతలకు ఎవరి నియోజకవర్గం ఏంటి అన్నదానిపై అధినేత క్లారిటీ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది.

  టీడీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. విశాఖ జిల్లా (Visakha District) కీలక మార్పులు చేసినట్టు టాక్. రాబోయే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకే అంటూ పార్టీ 40 ఏళ్ల వేడుకల్లో చంద్రబాబు ప్రకటించారు. అటు లోకేష్ కూడా ఈసారి యువతకే ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందన్నారు. అదే మాటకు కట్టుబడి సీట్ల కేటాయింపు జరుగుతున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల ద్వారా అసెంబ్లీకి పెద్ద ఎత్తున యువకులను పంపాలనేది టీడీపీ ప్లాన్. అందుకే ఈ సారి ఎంపీ రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu)  కూడా నరసన్నపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు రెడీ చేశారని తెలుస్తోంది. ఆయనతో పాటు బాలయ్య చిన్న అల్లుడు శ్రీ భరత్ (Srii Barath) ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్నదానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

  గత ఎన్నికల సమయంలో రాజకీయ రంగ ప్రవేశం చేసిన బాలకృష్ణ చిన్నల్లుడు, గీతం కాలేజీ ఛైర్మన్ భరత్ విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడారు. అయితే అప్పట్లో జనసేన తరపున జేడీ పోటీలో లేకుంటే గెలిచేవారని తెలుగు దేశం నేతలు అభిప్రాయపడ్డారు. అయితే ఈ సారి ఎంపీగా కాకుండా.. అసెంబ్లీకి భరత్ ను పంపాలని అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అయిన కూడా అదే ఉద్దేశంతో ఉన్నారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిన సబ్బంహరి.. కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో ఆయన స్థానాన్ని భరత్ తో భర్తీ చేస్తారని తెలుస్తోంది.

  ఇదీ చదవండి : సాక్షాత్తూ బ్రహ్మ ప్రతిష్టించిన శివలింగం.. ఎక్కడ ఉంది.. ప్రత్యేకతలు ఏంటో తెలుసా? ఉందంటే..?

  ఆయనకు భీమిలి టికెట్ ఇస్తే పక్కాగా గెలుస్తారని లెక్కలు వేసుకుంటున్నారు. మరోవైపు గీతం కాలేజీపై వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగడంతో.. ఈ వ్యవహారాన్ని భరత్ సీరియస్‌గా తీసుకున్నారు. అందుకే తాను ఈసారి ఎంపీగా బదులుగా... భీమిలి నుంచి బరిలోకి దిగాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం ఇప్పటికే విశాఖ జిల్లా కీలక నేత గంటా శ్రీనివాసరావతో చర్చించినట్లు తెలుస్తోంది. గంటా విశాఖ ఉత్తర నియోజకవర్గం బదులుగా గాజువాక నుంచి పోటీ చేయాలని... గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసులు ఈ సారి విశాఖ ఎంపీగా బరిలోకి దిగాలని... భరత్ భీమిలి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, TDP, Visakhapatnam

  ఉత్తమ కథలు