Home /News /andhra-pradesh /

AP POLITICS TDP CHIEF CHANDRABABU NAIDU FOCUSED ON ONLY 10 YCP LEADERS WHY TARGETED PERSONALLY NGS

Target YCP Leaders: టీడీపీ ప్రధాన టార్గెట్ ఆ పదిమంది లీడర్లేనా..? అంత పర్సనల్ ఎందుకయ్యారు ..? కారణం ఏంటి..?

చంద్రబాబు (ఫైల్)

చంద్రబాబు (ఫైల్)

Target YCP Leaders: తెలుగు దేశం పార్టీ వచ్చే ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్టీ నిలబడాలి అంటే తప్పక నెగ్గాల్సిన పరస్థితి ఉంది. అయితే రాష్ట్రమంతా ఓ ఎత్తైతే..? ఆ పది స్థానాలపై టీడీపీ అధిష్టానం ఫోకస్ చేసింది. మిగిలిన చోట్ల పరిస్థితులు ఎలా ఉన్నా.. ఆ పది స్థానాల్లో తప్పక గెలవాలని టార్గెట్ ఫిక్స్ చేసుకుంది. ఆ దిశగా అడుగులు వేస ప్రయత్నం చేస్తోంది.

ఇంకా చదవండి ...
    Target YCP Leaders: సాధారణంగా ఎక్కడైనా రాజకీయ పార్టీల మధ్య వైరం ఉంటుంది. రెండు పార్టీలు గెలుపు కోసం ఢీ అంట ఢీ అంటాయి. ప్రజా ప్రతినిధులు మాత్రం అంతా ఒక్కటే అనే భావనలో ఉంటారు.. అందుకే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరు అనే నానుడి ఉంది. అయితే ఏపీలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. రాజకీయ పార్టీల మధ్య వైరం.. ఇఫ్పుడు వ్యక్తిగత శత్రుత్వంగా మారింది. చాలామంది రాజకీయ నాయకులు ప్రత్యర్థి పార్టీలకు పర్సనల్ టార్గెట్ అవుతున్నారు. అందుకు కారణం ఎంత తిడితే అంత ఫాలోయింగ్‌ అన్నట్టుగా నేతలు తయారయ్యారు. పొలిటికల్‌ విమర్శలు సాధారణమే అయినా.. ఈ మధ్య అధికార ప్రతిపక్ష నేతలు వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రధానంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లను టార్గెట్‌ చేస్తున్నారు వైసీపీ మంత్రులు. గతంలో మంత్రులుగా పనిచేసిన వారితోపాటు ఇప్పుడు మంత్రులుగా ఉన్నవారు సైతం చంద్రబాబు, లోకేష్‌లపై ఒంటికాలిపై లేచిన సందర్భాలు అనేకం. ఘాటు విమర్శలు చేస్తున్నారు. అందుక ఆయ నేతలను టీడీపీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుందట. వచ్చే ఎన్నికల్లో అలాంటి వైసీపీ నేతలను ఓ చూపు చూడాల్సిందేనని టార్గెట్‌ ఫిక్స్‌ చేసుకుందట. అందుకే రాష్ట్రంలో మిగిలిన నియోజకవర్గాలన్నీ ఓ ఎత్తు.. ఆ పది నియోజకవర్గాలు ఇంకో ఎత్తు అన్నట్టు చర్చ జరుగుతోంది.

    ఫస్ట్ ప్లేస్ ఆయనదే..
    టీడీపీ టార్గెట్‌లో టాప్‌ ప్లేస్‌లో మాజీ మంత్రి కొడాలి నాని ఉన్నారట. ఆ తర్వాత ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. ఈ ఇద్దరి విషయంలో టీడీపీలోనే కాకుండా.. ప్రధానంగా ఆ సామాజికవర్గం నుంచి కూడా గట్టిగానే వ్యతిరేకత వ్యక్తం అవుతోందని సమాచారం. వీరిద్దరినీ అస్సలు వదలొద్దు. ఓడించడానికి గట్టిగానే ప్రయత్నిద్దామని కసరత్తు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల్లో ఇప్పటికే ఆపరేషన్‌ మొదలైనట్టు చెబుతున్నారు. చంద్రబాబు కూడా త్వరలో గుడివాడలో పర్యటిస్తారట. గత ఎన్నికల తర్వాత చంద్రబాబు, లోకేష్‌లను విమర్శించడానికి కొడాలి నాని నాటు భాషను ఉపయోగించారు. ఇక వల్లభనేని వంశీ అయితే సైలెంట్‌గా వేయాల్సిన డైలాగులు వేసి నందమూరి, నారా కుటుంబాలు మీడియా ముందుకు వచ్చేలా చేశారు. అందుకే వీరిద్దరిపై టీడీపీతోపాటు సామాజికవర్గం కూడా గట్టిగా ఫోకస్‌ పెట్టినట్టు టాక్.



    తెలుగు దశం టార్గెట్‌లో ఉన్న నేతల్లో పేర్ని నాని, అంబటి రాంబాబు, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, ఆర్కే రోజా, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, కురసాల కన్నబాబు, జోగి రమేష్‌, నారాయణస్వామి తదితరులు కూడా ఉన్నారని టాక్ . మరికొందరు పేర్లపై చర్చ జరిగినా.. ఈ పది మందిపై తెలుగు తమ్ముళ్లు చాలా కసిగా ఉన్నట్టు చర్చ జరుగుతోంది. మూడేళ్లుగా వీళ్లంతా పనిగట్టుకుని చంద్రబాబు, లోకేష్‌లను లక్ష్యంగా చేసుకున్నారని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. చంద్రబాబు వయస్సు, అనుభవానికి కూడా మర్యాద ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం.. అన్నింటికి మించి భువనేశ్వరిని ఉద్దేశించి చేసిన కామెంట్స్‌పై టీడీపీ కేడర్‌ పగతో ఉంది. వీరిని ఎలాగైనా ఓడించాలనే కసితో ఉన్నట్టు సమాచారం.

    ఇదీ చదవండి : దసరా పొలిటికల్ బరిలో పవన్.. బస్సు యాత్రకు అసలు కారణం అదేనా? ప్రజలకు ఏం చెప్పనున్నారు?

    చంద్రబాబును టార్గెట్‌ చేస్తే మంత్రి పదవులు పదిలం అనుకున్నవాళ్లు మాజీలు అయ్యారని.. ఇక వారిని మాజీ ఎమ్మెల్యేలుగా చేయడమే తమ పని అంటున్నారట టీడీపీ నేతలు. అందుకే ఈసారి ఆ పది మందిని అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చేయాలని ప్రతినబూనారట. ప్రత్యర్థిని ఓడించడానికి ఏ పార్టీయైనా ప్రయత్నిస్తూనే ఉంటుంది. కానీ.. ఈసారి టార్గెట్‌ ఫిక్స్‌ చేసిన నియోజకవర్గాల్లో ముందు నుంచీ ప్రత్యేక దృష్టి పెడుతున్నారట. ఇంతకుముందు చూసీ చూడనట్టు వదిలేసిన చోట్ల ఈసారి పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారట. జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు తన టూర్‌లో ఈ పది నియోజకవర్గాలు తప్పకుండా ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారట. మొదటి విడత పర్యటనలో మంత్రి అమర్నాథ్‌ నియోజకవర్గాన్ని టచ్‌ చేసిన చంద్రబాబు ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే రెండో విడత టూర్‌లో గుడివాడ వెళ్లబోతున్నారట. ఇందుకోసం నియోజకవర్గాల ఇంఛార్జ్‌లకు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తూ ప్రత్యర్థిపై పైచెయ్యి సాధించేందుకు పావులు కదుపుతోందట టీడీపీ.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, TDP

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు