Home /News /andhra-pradesh /

AP POLITICS TDP CHIEF CHANDRABABU NAIDU CHANGE HIS STRATEGY ON POLITICAL ALLIANCE NGS

Chandrababu: పొత్తుపై చంద్రబాబు పునరాలోచనకు కారణం అదేనా? టీడీపీది విశ్వాసమా..? అతి విశ్వాసమా..?

చంద్రబాబు,లోకేశ్ (ఫైల్ ఫోటో)

చంద్రబాబు,లోకేశ్ (ఫైల్ ఫోటో)

Chandrababu Naidu: తమది వన్ సైడ్ లవ్ అన్నారు..? అధికారంలోకి రావాలి అంటే త్యాగాలు తప్పవన్నారు.. పొత్తులకు ఆహ్వానం పంపారు.. కానీ ఇదంతా మహానాడుకు ముందు..? కానీ ఇప్పుడు వార్ వన్ సైడ్ అంటున్నారా..? ఎక్కడా పొత్తు ప్రస్తావనే లేదు.. అంటే పొత్తులు అవసరం లేదని చంద్రబాబు ఫిక్స్ అయ్యారా..? ఆయనది విశ్వాసమా..? లేక అతి విశ్వాసమా..? గెలుపుపై నమ్మకం పెరగడానికి కారణం ఏంటి..?

ఇంకా చదవండి ...
  Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ (Andhra Prades)  రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీలు అన్నీ అప్పుడే ఎన్నికల మూడ్ లో ఉన్నాయి. ఎవరికి వారు గెలుపుపై తమ లెక్కలను సిద్ధం చేస్తున్నారు. అయితే టీడీపీ (TPN) అధినేత చంద్రబాబు  నాయుడు (Chandrababu Naidu)   లెక్కలు పూర్తిగా మారినట్టు కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు అధికార వైసీపీని గద్దె దించాలి అంటే.. పొత్తులు తప్పని సరి అంటూ చెబుతూ వచ్చారు.. అయితే తమది వన్ సైడ్ లవ్ అంటూ.. పవన్ కు కన్ను గీటారు.. తీరా ఆ ప్రపోజల్ నచ్చిన పవన్ సైతం పొత్తుకు సిద్ధం అనే సంకేతాలు ఇచ్చారు.. కానీ ఇంతలో ఏమైందో ఏమో కాని.. చంద్రబాబు నాయుడు ఇప్పుడు వార్ వన్ సైడ్ అంటున్నారు. పొత్తులు గిత్తులు లేవు అంటున్నారు. దీంతో జనసేన అధినేత పవన్ (Janasena Chief Pawan kalyan) సైతం తన స్టాండ్ మార్చుకున్నట్టు కనిపిస్తున్నారు.

  2004 ఎన్నికల తరువాత రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని అంతా భావించారు. 2009 ఎన్నికల తరువాత ఇక పార్టీయే కనుమరుగైందని విశ్లేషించారు. కానీ 2014లో రాష్ట్ర విభజన, రాజకీయ శూన్యత ఆయనకు కలిసి వచ్చింది. ప్రజలు చంద్రబాబు సేవలను గుర్తించి మరోసారి అధికారమిచ్చారు. 2019 ఎన్నికల్లో మళ్లీ దారుణమైన స్థితిలో విపక్షంలో కూర్చోబెట్టారు. 175 స్థానాలకుగాను.. కేవలం 23 స్థానాల్లోనే టీడీపీ గెలుపొందింది. దీంతో పార్టీ శ్రేణుల్లో కూడా నైరాశ్యం నెలకొంది. అధికార పక్షం దూకుడు ముందు నాయకులు, కార్యకర్తలు నిలవలేకపోయారు. వరుసగా వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఉనికి చాటుకునే ప్రయత్నం చేయలేకపోయారు. కానీ ఇప్పుడు రెట్టించిన ఉత్సాహం.. అధికార పార్టీని భయపెట్టే స్థాయికి నాయకులను సిద్దం చేయగలిగారు.  ప్రభుత్వంపై వ్యతిరేకత..
  మూడేళ్ల వైసీపీ పాలన తరువాత పరిస్థితిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వం పై చాలా వర్గాల్లో వ్యతిరేకత పెరుగుతోంది. అది ప్రస్తుతానికి చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఆ వ్యతిరేక ఓటును క్యాష్ చేసుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఆదరించిన ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగ వర్గాలు సైతం దూరమయ్యాయి. దీంతో చంద్రబాబు యాక్టివ్ అయ్యారు. పార్టీ శ్రేణులను యాక్టివ్ చేశారు. ప్రజా వ్యతిరేక వైఖరిపై నిరసనలు, ఆందోళనలు ముమ్మరం చేశారు. పన్నులు, చార్జీల పెంపుపై బాదుడే బాదుడు వంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనికి ప్రజాదరణ విశేషంగా కనిపిస్తోంది. మరోవైపు మూడేళ్ల తరువాత నిర్వహించిన మహానాడుకు కనీవినీ ఎరుగని రీతిలో జనం తరలివచ్చారు. అటు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పర్యటనలకు జనం తరలిరావడం, పార్టీకి దూరమైన వర్గాలు దగ్గరకు చేరుతుండడంతో వచ్చే ఎన్నికల్లో గెలుపుపై శ్రేణుల్లో ధీమా వచ్చింది. అటు చంద్రబాబు కూడా తన వయసును లెక్క చేయకుండా వచ్చే ఎన్నికలను చావోరేవోగా తేల్చుకోవాలని చూస్తున్నారు.

  ఇదీ చదవండి : దసరా పొలిటికల్ బరిలో పవన్.. బస్సు యాత్రకు అసలు కారణం అదేనా? ప్రజలకు ఏం చెప్పనున్నారు?

  మహానాడు సూపర సక్సెస్.. జిల్లా పర్యటనల్లో ప్రజలు బ్రహ్మరథం పడుతుండడ.. ఇటు ప్రభుత్వంపై వ్యతిరేక వర్గాలు పెరుగుతుండడంతో చంద్రబాబులో విశ్వాసం పెరుగుతోంది. అందుకే వయసును లెక్క చేయకుండా మరింత దూకుడు పెంచారు. ఈ సమయంలో అందివచ్చిన ఏ అవకాశాన్ని చంద్రబాబు విడిచిపెట్టడం లేదు. అటు ప్రజల మధ్యకు వెళుతునే వచ్చే వ్యూహాలకు పదును పెడుతున్నారు. పొత్తుల తేనె తుట్టను కదిపి అధికార పార్టీలో కలవరం రేపారు. అటు జనసేన, కలిసి వస్తే బీజేపీతో కలిసి నడిచేందుకు తొలుత నిర్ణయించుకున్నారు. కానీ తాజా పరిణామాలతో పొత్తుల అంశాన్ని తాత్కాలికంగా పక్కన పడేశారు. పార్టీ కార్యక్రమాలకు వస్తున్న ప్రజాదరణ చూసి చంద్రబాబు వ్యూహాన్ని మార్చారని రాజకీయ విశ్లషకులు అంటున్నారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు