Chandrababu Challenge: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో జీవో 1పై రాజకీయ దుమారం ఆగడం లేదు. దీనిపై అధికార వైసీపీ (YCP), ప్రధాన ప్రతిక్షం తెలుగు దేశం (Telugu Desam) మధ్యం మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. తాజాగా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పర్యటన సందర్భంగా పోలీసులు తోపులాటలో గాయపడి చికిత్స పొందుతున్న.. తెలుగు దేశం పార్టీ కార్యకర్తలను ఆసుపత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) పైన ప్రభుత్వం పైన అలాగే డీజీపీ పైనా మరోసారి తీవ్ర విమర్శలు. రాజధాని అమరావతిలో తన ఇంటి మీద దాడి చేశారని.. అలాగే తన ఇంటి గేట్లకు తాడు కట్టారని పాత విషయాలను గుర్తు చేశారు. ఇప్పుడు తన సొంత నియోజకవర్గ కుప్పంలో పోలీసుల ద్వారా దాడులు చేయించడం చాలా దారుణమన్నారు
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన తండ్రి రాజారెడ్డి కూడా ఇంత అరాచకాలు చేయలేదు అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సైకో పాలన జరుగుతోంది అని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఈ సందర్భంగా మంత్రి పెద్ది రెడ్డి రామ చంద్రరెడ్డిని సవాల్ చేశారు.
అంతకుముందు చంద్రబాబు నాయుడుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేసారు. సాంయంత్రం సోమలలో ఏర్పాటు చేసినా మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. చంద్రబాబు వార్డు మెంబర్ లా దిగజారి మాట్లాడుతున్నారని, తనను చంద్రబాబు పుడింగి అంటున్నారని, అసలు పుడింగికి అర్థం ఏంటో తెలుసా అని పెద్దిరెడ్డి ప్రశ్నించారు.
ఇదీ చదవండి : అదే నిజమైతే టీడీపీ , జనసేన నేతలు ఏపీలో తిరగగలరా..? మంత్రి రోజా షాకింగ్ కామెంట్స్
కుప్పంలో ఘోరంగా ఒడిపోయినా చంద్రబాబు పుంగనూరుకు వచ్చి.. తనను ఏదో చేస్తానని బెదిరిస్తున్నారని.. ఆయన బెదిరింపులకు ఇక్కడ ఎవరూ భయడపడరు అన్నారు. జగన్ ఆధ్వర్యంలో స్థానిక సంస్థలు, సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో ఓడించి మూడు చెరువుల నీళ్లు తాగించాంమని పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు.. పుంగనూరులో తన కథ తేలుస్తాను అని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, చంద్రబాబు కాదు, వాళ్ళ తాతలు దిగొచ్చినా వాళ్ళ తరం కూడా కాదన్నారు.
ఇదీ చదవండి: సొంత వారిని కలవాలంటే జగన్ పర్మిషన్ కావాలా..? ఇదేం పైశాచిక ఆనందం.. జగన్ పై చంద్రబాబు ఫైర్
చంద్రబాబు అనుకుని ఉంటే నేను జిల్లాలో తిరేగేవాన్ని కాదని చెప్పడం వింటే నవ్వు వస్తొంది అన్నారు. 14 సంవత్సరాలు ఆయన కంటే ఆధిక్యంలో తాను కాంగ్రెస్ పార్టీకు మద్దతు ఇచ్చినట్లు చెప్పారు.. 14 సంవత్సరాలు అధికారంలో ఉన్న చంద్రబాబు చేసేదేంటి.. మీ కంటే తానే ఎక్కువ చేసానన్నారు.. చిత్తూరు జిల్లాలో తన కంటే ఎక్కువ అసెంబ్లీ స్థానాలు సాధించగలవా అంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబుకి సవాల్ విసిరారు.. కాలేజ్ రోజుల నుండి చంద్రబాబుకి జీవిత కాలం పట్టింది తనపై ఆధిక్యత సాదించడానికి అని విమర్శించిన పెద్దిరెడ్డి, ఇందిరమ్మ పేరుతో చంద్రబాబు శాసనసభ్యుడు అయ్యాడన్నారు.. రామారావు కుమార్తెను పెళ్లి చేసుకొని కుప్పంలో ఉన్న అభ్యర్థిని రాజీనామా చేయించి కుప్పంలో గెలిచావన్నారు.. రామారావు అల్లుడు కాకపోయింటే నువ్వు శాసన సభ్యడు అయ్యుంటావా అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి : ఏపీలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఏర్పాట్లు.. జాతీయ ప్రధాన కార్యదర్శి ఎవరంటే..?
రామారావు పేరు అండగా ఉంది కాబట్టి రాజకీయాల్లో రాగలిగారని చంద్రబాబు పై సెటైర్లు వేశారు. తనతో పోల్చుకునేందుకు చంద్రబాబుకు అర్హత లేదన్నారు. తాను 1993 నుంచి పాల వ్యాపారంలో ఉన్నానని, చంద్రబాబు మాదిరిగా పార్ట్నర్స్ కు మోసం చేసి వేల కోట్లు సంపాదించ లేదన్నారు.. తాను దౌర్జన్యం చేసి పాలు తీసుకుంటుంటే ఇన్ని సంవత్సరాలు వ్యాపారం చేయగలనా అని ఆయన ప్రశ్నించారు.
ఇదీ చదవండి: ఎన్నికల మూడ్ లో వైసీపీ శ్రేణులు.. సోషల్ మీడియాలో దూకుడు
అబద్దాలు చెప్పడానికి చంద్రబాబు సిగ్గు లేదా అని ప్రశ్నించారు. జిల్లాలో అందరికి చంద్రబాబు బతుకు ఏంటో తెలుసునని, తన బట్టలు ఉడదేస్తా అని మాట్లాడుతున్నావు, సిగ్గు లేదా చంద్రబాబు అని నిలదీశారు. జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నీ బట్టలు ఎప్పుడో ఊడి పోయాయన్నారు.. కుప్పంలో చంద్రబాబు బతుకు తెల్లవారి పోయిందన్నారు. అలాగే 2024లో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఫైనల్ గా కుప్పంలో చంద్రబాబు బట్టలు ఊడిపోతాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, Chandrababu Naidu, Peddireddy Ramachandra Reddy