హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Viveka Murder Case: బాబాయ్ కేసు తెలంగాణకు.. కొడుకు చంచల్ గూడా జైలుకు.. జగన్ సర్కార్ పై టీడీపీ సెటైర్లు

Viveka Murder Case: బాబాయ్ కేసు తెలంగాణకు.. కొడుకు చంచల్ గూడా జైలుకు.. జగన్ సర్కార్ పై టీడీపీ సెటైర్లు

జగన్ పై చంద్రబాబు సెటైర్లు

జగన్ పై చంద్రబాబు సెటైర్లు

Viveka Murder Case: వివికే మర్డర్ కేసు బదిలీపై మళ్లీ రాజకీయం రచ్చ రచ్చ అవుతోంది. వివేకా హత్యకేసు విచారణ తెలంగాణకు బదిలీపై టీడీపీ నేతలు స్పందించి.. జగన్ సర్కార్ పై సెటైర్లు వేస్తున్నారు. సీఎం జగన్ ఇప్పుడు తలెక్కడ పెట్టుకుంటారని చంద్రబాబు ప్రశ్నిస్తే.. లోకేష్ అయితే బాబాయ్ కేసు తెలంగాణకు.. కొడుకు చంచల్ గూడా జైలుకు అంటూ సెటైర్లు వేస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Viveka Murder Case: ఆంధ్రప్రదేశ్  (Andhra Pradesh) రాజకీయాల్లో మళ్లీ వివేకానంద రెడ్డి హత్య (YS Vivekananda Reddy Murder Case) చుట్టూ రచ్చ మొదలైంది. వివేకానంద రెడ్డి హత్యకేసులో బిగ్ ట్విస్ట్  (Big Twist) చోటు చేసుకుంది. వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేసింది సుప్రీం కోర్టు (Supreme court).వివేకా కుమార్తె సునీత పిటిషన్‌ పై ఇవాళ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. హైదరాబాద్ సీబీఐ స్పెషల్ కోర్టు (CBI  Special Court) కు బదిలీ చేస్తూ తీర్పునిచ్చింది సుప్రీం కోర్టు ధర్మా సనం. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఈ కేసులో నేర విచారణ నిష్పాక్షికంగా జరపడం కోసం హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. అయితే, విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హత్య కేసులో సాక్ష్యాదారాలు ధ్వంసం చేసినట్లు ఆధారాలు ఉన్నాయని తెలిపింది. విచారణపై వివేకా కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారని, వివేకా కుటుంబ సభ్యుల ప్రాథమిక హక్కులకు భంగం కలుగకూదని విచారణను తెలంగాణ సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది.

సుప్రీంకోర్టు తీర్పుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విటర్ వేదికగా స్పందించారు. సొంత బాబాయ్ హత్యకేసు విచారణ పొరుగు రాష్ట్రానికి బదిలీ అయింది. అదికూడా జగన్ సీఎంగా ఉండగా! తలెక్కడ పెట్టుకుంటావ్ జగన్ రెడ్డీ? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. సీఎం పదవికి జగన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఇదిలాఉంటే వివేకా హత్యకేసు విచారణ తెలంగాణకు బదిలీ కావటం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విటర్ వేదికగా స్పందించారు. బాబాయ్ వివేకాను చంపించింది అబ్బాయేనని ఆరోపించారు. బాబాయ్ హత్యకేసు పక్క రాష్ట్రానికి .. అబ్బాయ్ చంచల్ గూడ జైలుకి అంటూ లోకేశ్ ఎద్దేశా చేశాడు.

బాబాయ్ హత్య కేసు పక్క రాష్ట్రానికి... అబ్బాయ్ చంచల్ గూడ జైలుకి..#AbbaiKilledBabai pic.twitter.com/QYOwEjaBxj

ఈ కేసుని బదిలీ చేయడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి . తెలంగాణలో విచారణ జరిగితే చాలా మంచిదన్నారు. హత్యకు గురైన వైఎస్ వివేక తమ పార్టీ నాయకుడు.. సీఎం జగన్ కి చిన్నాన్న అని అన్నారు. ఈ కేసులో వాస్తవాలు బయటకి రావాలని తాము కోరుకుంటున్నామన్నారు సజ్జల.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP Politics, Chandrababu Naidu, Supreme Court, Ys viveka murder case

ఉత్తమ కథలు