Mega vs Nandamuri: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రస్తుతం ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) కి ఈ ఎన్నికల చాలా కీలకంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో ఓడితే పార్టీ ఉనికికే ప్రమాదం. అందుకే డూ ఆర్ డూ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) .. ఇందులో భాగంగ ఏ చిన్న అవకాశాన్ని ఆయన వదులుకోదలచుకో లేదు. అవసరం ఉన్నా లేకున్నా.. అందర్నీ కలుపుకొనే వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో జనసేనతో పొత్తుకునే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో మెగా, జనసేన అభిమానుల మద్దతు కూడా టీడీపీకి చాలా అవసరం..
ఇప్పుడు బాలయ్య ఫ్యాన్స్ రూపంలో తలనొప్పి మొదలైంది. ఇప్పటికే మొన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు విషయంలో.. జూనియర్ ఎన్టీఆర్ స్పందనపై టీడీపీ నేతలు, అభిమానులు సైతం తీవ్రంగా మండిపడ్డారు. ఎన్టీఆర్ ను ట్రోల్స్ చేశారు కూడా.. దీనిపై అదేస్థాయిలో జూనియర్ అభిమానులు.. టీడీపీపై ట్రోల్స్ కు దిగారు.. ఆ తలనొప్పి నుంచి టీడీపీ ఇంకా బయటపడలేదు. ఇప్పుడు బాలయ్య అభిమానుల వంతు వచ్చింది..
అసలు సమస్య ఏంటి అంటే..? బయటకు ఏం చెబుతున్నా.. చిరంజీవి, బాలకృష్ణ అభిమానుల మధ్య.. కొంతకాలం క్రితం వరకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఉండేది. అయితే బాలయ్య రాజకీయాల్లో నేరుగా ఎంట్రీ ఇవ్వడం.. చిరంజీవి నుంచి సినిమాల విషయంలో కొంత విరామం తీసుకోవడంతో తాత్కాలికంగా ఆ వివాదానికి తెరపడింది. అంతేకాదు ఇటు బాలయ్య కానీ.. అటు చిరంజీవి కానీ ఏదైనా బహిరంగ సభల్లో.. తమ ఇద్దరి మధ్య మంచి స్నేహ బంధం ఉందని.. విబేధాలు లేవని చెబుతూ వచ్చారు. ఇటీవల అన్ స్టాప్ బుల్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న బాలయ్య సైతం చిరంజీవి.. గెస్ట్ గా వస్తారు అంటూ..? తమ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పడంతో వివాదం ముగిసినట్టే అనుకున్నారు.
ఇదీ చదవండి : సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు.. అన్న కోసం ఏం చేశానో క్లారిటీ ఇచ్చిన షర్మిల
కానీ అయితే గాడ్ ఫాదర్ సినిమా నుంచి మళ్లీ ఈ ఇద్దరు అభిమానుల మధ్య రగడ ప్రారంభమైంది. మెగా అభిమానులు, నందమూరి అభిమానుల మధ్య హోరాహోరీగా యుద్ధం నడుస్తోంది. నందమూరి మోక్షజ్ఞ పేరుపై.. ఆయన అభిమానులు చేసిన ట్వీట్ ఇప్పుడు దుమారం రేపుతోంది.. బాలయ్య అఖండ రికార్డులు గురించి చెబుతూ.. ఆ రికార్డులను బ్రేక్ చేయడంలో ఏ బాస్ వల్లా కాదని.. చెప్పలేని బాషలో బూతులు రాశారు. దాని తగ్గట్టే మెగా అభిమానులు కౌంటర్లు ఇస్తున్నారు.
ఇదీ చదవండి : పేరు మార్పు పిచ్చి పరాకాష్టకు చేరిందా..? సీఎం జగన్ పై నారా లోకేష్ సెటైర్.. తాజాగా మరో పేరు మార్పు
అయితే ఈ మెగా, నందమూరి అభిమానుల వార్ తెలుగు దేశం అధినేతకు తలనొప్పిగా మారింది. గాడ్‌ఫాదర్ మూవీ తాజాగా మంచి హిట్టైంది. దీంతో మెగా అభిమానులు బాస్ ఈజ్ బ్యాక్, టాలీవుడ్‌లో నెంబర్ వన్ అంటూ కామెంట్స్ పెడుతూ పరోక్షంగా బాలకృష్ణకు కౌంటర్లిస్తున్నారు. దీంతో నందమూరి అభిమానులు రీమేక్ సినిమాను చేసి హిట్ కొట్టడం కాదని, సొంత కథతో సొంత సినిమా చేయాలని రిప్లై ఇస్తున్నారు. గాడ్ ఫాదర్ సినిమా కలెక్షన్లను, అఖండ సినిమా కలెక్షన్లను పోల్చిచూపుతూ వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఈ యుద్ధం.. టీడీపీ, జనసేన సంబంధాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది.
అందుకే నేరుగా అధిష్టానమే దీనిపై స్పందించాల్సి వచ్చింది. పార్టీలో ఉంటూ ఇతర కథానాయకులపై కామెంట్లు పెట్టవద్దని అధిష్టానం ఆదేశించిందని అచ్చెన్నే స్వయంగా ప్రకటించారు అంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చు. ఎందుకంటే ఐప్యాక్, బ్లూ మీడియా ట్రాప్ లో ఎవరూ పడొద్దని, టీడీపీ అంటే అందరిదని, అన్ని మతాలవారు, కులాలవారు, ప్రాంతాలవారు ఉంటారన్నారు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వ్యక్తులకు అభిమానులుంటారని, ఒక పార్టీగా అందరూ పోరాటం చేయాల్సింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై అని అచ్చెన్న అన్నారు. మన లక్ష్యమంతా వైసీపీని గద్దె దించి టీడీపీని అధికారంలోకి తీసుకురావడంపైనే ఉండాలని, ఇతర కథానాయకుల గురించి, వారి అభిమానుల గురించి వెటకారంతో, ద్వేషంతో, కసితో, వ్యంగ్యంతో.. ఇలా ఏ పోస్టులు పెట్టొద్దని కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Bala Krishna Nandamuri, Chandrababu Naidu, Chiranjeevi, God Father Movie