M Bala Krishna, News18, Hyderabad
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటకీ అప్పుడే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత వచ్చే ఎన్నికల్లో అయిన తమ సత్తా చూపించాలని తెలుగు తమ్ముళ్లు (TDP) తహాతహాలాడుతున్నారు. ఇప్పటికే సీఎం జగన్ (AP CM YS JAGAN) ప్రభుత్వంలో పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికి ప్రజా క్షేత్రంలోకి దిగాలని డిసైడ్ అయ్యారు చంద్రబాబు. 2019 నుంచి అప్పుడప్పుడు బాబు ప్రజల్లోకి వచ్చినా లోకేష్ మాత్రం ప్రజల్లో ఉండే ప్రయత్నాలు చేస్తున్నారు. తమ నాయకులను అరెస్ట్ లు చేసినప్పుడు.., ఇతర కార్యక్రమాల్లో కూడా లోకేష్ గత కొద్ది రోజులుగా చురుగ్గా పాల్గోంటున్నారు.
ఇప్పటికే రాజధాని అంశం, రాష్ట్రం ఆర్ధికంగా దెబ్బతినటం, నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి అన్ని వస్తువుల ధరలు పెరుగుదల వీటితోపాటు ప్రభుత్వ తీసుకున్న కొన్ని నిర్ణయాలపట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూల ఓటుగా మార్చుకోవడానికి ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు టీడీపీ బాస్. ఇందులో భాగంగా మే చివరి వారం నుంచి చంద్రబాబు ప్రజల్లోఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. కోవిడ్ కారణంగా గత రెండేళ్లగా టీడీపీ మహానాడు నిర్వహించలేదు. అయితే తాజా కోవిడ్ అంతా చక్కబడిన తరువాత ఇప్పుడు మహానాడును భారీ ఎత్తున చేయడానికి పార్టీ సన్నహాలు చేస్తోంది.
మహానాడుతో నేతల్లోనే కాకుండా కేడర్లో కూడా నూతన ఉత్సాహాన్ని నింపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు టూర్ కు సంబంధించిన షెడ్యూల్ మరో వారంలో క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు బస్సు యాత్ర చేయబోతున్నట్లు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. మరో వైపు చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా ప్రజల్లోనే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు బస్సు యాత్ర చేస్తే లోకేష్ పాదయాత్ర చేయడానికి సన్నహాలు చేస్తున్నారట. ఇప్పటికే పార్టీ నేతలు లోకేష్ పాదయాత్రకు సంబంధించిన షెడ్యూల్ ను కూడా తయారు చేసినట్లు తెలుస్తోంది.
ఇద్దరు నేతలు ఇప్పటి నుంచి ఎన్నికల సమయం వరకు ప్రజల్లోనే ఉండేలా తమ షెడ్యూల్ ను ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. లోకేష్ పాదయాత్ర ద్వార కొన్ని ప్రాంతాలను కవర్ చేస్తే చంద్రబాబు తన బస్సు యాత్ర ద్వార రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలను తిరగనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. పార్టీలో ముఖ్యమైన ఇద్దరు నేతలు ఇప్పటి నుంచే ప్‌టజల్లో ఉండడంతో అటు నేతల్లో ఇటు కేడర్ లో నూతన ఉత్సాహాం నెలకుంది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ జెండా ఎగరడం ఖాయమని నేతలు, కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మరో వైపు ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వం తలనొప్పులు తీసుకొచ్చే అంశాలు చాలనే ఉన్నాయి ముఖ్యంగా మద్యపాన నిషేదం, కరెంట్ కోతలు చార్జీల మోత, ఇసుక అందబాటులో లేకపోవడం, తిరుమల కొండ పై నెకుంటున్న గందరగోళ వాతావరణం లాంటి అంశాలు ప్రభుత్వానికి నిత్యం ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. దీంతో పాటు తాజా కేబినేట్ విస్తరణ తరువాత కొంత మంది సొంత పార్టీ నేతలే జగన్ పై తిరుగుబాటు చేయడం వంటి అంశాలు కూడా పార్టీని ఆందోళనకు గురిస్తోన్నాయి. ఈ తరుణంలో బాబు టూర్ ఏమైరకు సక్సెస్ ను తీసుకొస్తోందో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Chandrababu Naidu, Nara Lokesh, TDP