Chandrababu: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) గతానికి భిన్నంగా చాలా దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. సాధారణంగా చివరి వరకు సీటు విషయం తేల్చిచెప్పరంటూ తనపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. కానీ ఈ సారి మాత్రం రూటు మార్చారు. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికీ అభ్యర్థులను ఖరారు చేసుకుంటూ వస్తున్నారు. తనపై ఉన్న మచ్చను చెరిపివేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎప్పుడూ లేనివిధంగా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడికక్కడ అభ్యర్థులను ఖరారు చేస్తూ వారికి కావల్సినంత సమయాన్ని కూడా కేటాయిస్తున్నారు. ఇటీవల ఉమ్మడి ప్రకాశం జిల్లా (Prakasam District) పై పై ప్రత్యేక దృష్టి సారించారు. అందుకే నియోజకవర్గ ఇన్ఛార్జిలుతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ ఎవరెవరికి సీటు ఖరారైందో చెబుతూ వారంతా పనిచేసుకోవాలంటూ చెప్పి పంపిస్తున్నారు.
రాబోయే ఎన్నికల్లో పోటీచేసేది మీరేనని అందులో ఎలాంటి సందేహం పెట్టుకోవద్దని స్పష్టతనిస్తున్నారు. అయితే తాజాగా ఆయన దృష్టి ప్రకాశం జిల్లాపై పడింది. ఈ ఉమ్మడి జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలున్నాయి. ఇప్పటివరకు 8 మంది అభ్యర్థులు ఖరారైనట్లు సమాచారం.
ఉమ్మడి ప్రకాశంలో ఒంగోలు, మార్కాపురం, కందుకూరు, యర్రగొండపాలెం, సంతనూతలపాడు, చీరాల, అద్దంకి, పర్చూరు, కనిగిరి, కొండెపి, గిద్దలూరు, దర్శి నియోజకవర్గాలున్నాయి. అయితే ఇటీవల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ.. సీట్లు ఇస్తున్నట్టు స్పష్టం చేశారు. దీంతో వీరిలో పర్చూరు నుంచి ఏలూరి సాంబశివరావు, అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్, కొండెపి నుంచి బాల వీరాంజనేయస్వామి సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. దీంతో వీరి ముగ్గురు మళ్లీ పోటీ చేయడం పక్కా..
సంతనూతలపాడులో బీఎన్ విజయ్ కుమార్, గిద్దలూరులో అశోక్ కుమార్, ఒంగోలు నుంచి దామచర్ల జనార్దన్, కనిగిరి నుంచి ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, మార్కాపురంలో కందుల నారాయణరెడ్డి ఇన్ఛార్జిలుగా ఉన్నారు. అయితే రానున్న ఎన్నికల్లో వారే పోటీచేయడం ఖాయమైందనే ప్రచారం ఉంది. ఆ దిశగా అధినేత హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఇదీ చదవండి : ఇవి పాలు మాత్రమే కాదు.. దివ్య ఔషధం కూడా..? ఇంటింటికీ వచ్చి మరీ ఇస్తున్నారు
సిట్టింగ్ లు ముగ్గురుతోపాటు ఈ ఐదుగురు కలిపి ఎనిమిది మంది అభ్యర్థులను పార్టీ ఫిక్స్ చేసింది. అయితే వైసీపీ నుంచి వచ్చే వారికోసం రెండు స్థానాలు కేటాయించినట్టు తెలుస్తోంది. దర్శిలో పమిడి రమేష్ ఇన్ఛార్జి పదవి నుంచి తప్పుకున్నారు. వైసీపీ నుంచి వచ్చే కీలక నేతకు ఆ సీటు ఇవ్వనున్నారంటూ వార్తలు వస్తున్నాయి.
ఇక చీరాలలో ఎంఎం కొండయ్య, కందుకూరులో ఇంటూరి నాగేశ్వరరావు, ఎర్రగొండపాలెంలో ఎరిక్షన్ బాబు ప్రస్తుతం ఇన్ఛార్జిలుగా కొనసాగుతున్నారు. వీరి పనితీరుపై చంద్రబాబు అసంతృప్తిగా ఉండటంతో వీరికి ఇంకా ఖరారు కాలేదు. ఎర్రగొండపాలెంలో బాబుతోపాటు అజితారావు, వైసీపీ నుంచి టీడీపీలోకి రావాలని చూస్తున్న డేవిడ్ రాజు కూడా ఈ సీటు కోసం పోటీపడుతున్నారు. జనసేనతో పొత్తు కుదిరితే చీరాల నియోజకవర్గాన్నిఆ పార్టీకి కేటాయించే అవకాశం కనపడుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, Chandrababu Naidu, TDP