Home /News /andhra-pradesh /

AP POLITICS TDP CHANDRABABU NAIDU SLAMS CM JAGAN MOHAN REDDY AND HE REVELS HIS FUTURE PLAN NGS

Chandrababu Naidu: జగన్ ఫ్రస్టేషన్ కు కారణం అదే..? చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రెడీ? ఏడాది పాటు జనంలోనే

జగన్ ఫ్రస్టేషన్ కు కారణం అదే

జగన్ ఫ్రస్టేషన్ కు కారణం అదే

Chandrababu Naidu: జగన్ ప్రస్టేషన్ లో ఉన్నారా..? ఆయన ఫ్రస్టేషన్ కు కారణం ఏంటి..? చంద్రబాబు నాయుడు మాత్రం దీనిపై క్లారిటీ ఇచ్చారు.. అంతేకాదు.. టీడీపీ ఫ్యూచర్ ప్లాన్స్ కూడా ఏంటన్నవి వివరించారు.. ఏడాది పాటు జనంలో ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇంకా చదవండి ...
  Chandrababu Naidu:  టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) 2024 ఎన్నికలపై ఫోకస్ చేశారు. ఇకపై జనాల్లోనే ఉండేట్టు ప్లాన్ చేస్తున్నారు. అది కూడా రోజులు.. నెలలు కాదు.. ఏడాది పాటు జనంలోనే ఉండాలని.. అక్కడ నుంచి నేరుగా ఎన్నికలకు వెళ్లాలని ప్లాన్ వేసినట్టు సమాచారం. ఈ ఎన్నికలకు తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party)కి చాలా కీలకమైనవి.. ఈ సారి ఓటమి పాలైతే.. పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది.  ఎలాగైనా ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ప్రతి విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. వైసీపీ (YCP)ని ఓడించేందుకు వచ్చే ఏ అవకాశాన్ని వదలడం లేదు. అందుకే పొత్తుల విషయంలోనూ చాలా క్లారిటీగా ఉన్నారు.. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో.. జనసేన (Janasena)తో కలిసి వేళ్లాలని ఆయన ఇప్పటికే ఫిక్స్ అయ్యారు. ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారు..

  మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన.. సీఎం జగన్ (CM Jagan) పాలనపై ధ్వజమెత్తారు. ప్రభుత్వంపై ఈ స్థాయి ప్రజా వ్యతిరేకత చరిత్రలో చూడలేదన్నారు. ప్రభుత్వాలు విఫలం అవ్వడం వేరు.. పాలనపై ఈ స్థాయి అసంతృప్తి వేరు. టీడీపీ అత్యధిక సీట్లు గెలుచుకున్న 1994లో కూడా అంతకు ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత లేదన్నారు చంద్రబాబు.

  జగన్ ప్రభుత్వ విధానాలతో ప్రజల జీవన ప్రమాణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జగన్ పథకాలు వెనుక ఉన్న లూటీని ప్రజలు గుర్తించారు. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి సంక్షేమ పథకాలు కారణం కాదన్నారు. జగన్ లూటీ వల్లనే ఈ దుస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలను దెబ్బతీసి జగన్ తన ఆదాయం పెంచుకుంటున్నాడని ఆరోపించారు. మద్యం పై బహిరంగ దోపిడీ జరుగుతోంది అన్నారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం వ్యక్తుల జేబులోకి వెళుతుందని మండిపడ్డారు. అలాగే మైనింగ్, ఇసుకను సంపూర్ణంగా దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు వర్గంలో ఒక్క ఓటు కూడా ఇక వైసీపీకి పడే ఛాన్స్ లేదన్నారు చంద్రబాబు.

  కొన్ని వర్గాలను టార్గెట్ చేసుకోవడం ఎప్పుడూ చూడలేదు. పవన్ పై కోపంతో ఒక సామాజికవర్గాన్ని, టీడీపీపై కోపంతో మరో వర్గాన్ని, రఘరామకృష్ణం రాజుపై కోపంతో మరో వర్గాన్ని టార్గెట్ చేశారని మండిపడ్డారు. జగన్ లో అపరిచితుడు ఉన్నాడని ఆరోపించారు. జగన్ చెప్పే వాటికి చేసే వాటికి సంబంధం ఉండదన్నారు. అలాగే వైసీపీ ఇప్పుడు ఓడిపోతే మళ్లీ జీవితంలో అధికారంలోకి రాదు అనేదే జగన్ ఫ్రస్టేషనుకు కారణమన్నారు. ఆ ఫ్రస్టేషనుతోనే జగన్ భాష మారిందని అభిప్రాయపడ్డారు.

  అలాగే కెబినెట్ విస్తరణతో జగన్ బలహీనుడని తేలిపోయిందన్నారు. ఒత్తిళ్లతో సగం మందిని కేబినెట్లో తిరిగి కొనసాగించారని గుర్తు చేశారు. దీంతో బయట తిరుగుబాట్లు మొదలయ్యాయన్నారు. కేబినెట్ విస్తరణ తరువాత బ్రతిమిలాడుకోవాల్సిన పరిస్థితి రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రికి రాలేదన్నారు.

  అలాగే ఇకపై ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటుంన్నామన్నారా..? బాదుడే బాదుడు పేరుతో టిడిపి చేస్తున్న పోరాటంలో తానూ పాల్గొంటాను. మహానాడు వరకు బాదుడే బాదుడు కార్యక్రమం ఉంటుంది. మే మొదటి వారం నుంచి తన పర్యటనలు మొదలు అవుతాయన్నారు. మహానాడు తరువాత రాష్ట్ర వ్యాప్తంగా విస్త్రృతంగా పర్యటనలు చేపడతానన్నారు చంద్రబాబు. ఒంగోలులో మహానాడు నిర్వహిస్తున్నామని చెప్పారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP News, Chandrababu Naidu, TDP

  తదుపరి వార్తలు