ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో వాతావరణం ఎన్నికలను తలపిస్తుంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ అధినేత, సీఎం జగన్ వరుస పర్యటనలతో ప్రజల్లోనే ఉంటున్నారు. అధికార వైసీపీ పార్టీ అవినీతిని, అక్రమాలను చంద్రబాబు, పవన్ ఎండగడుతున్నారు. మరోవైపు సీఎం జగన్ నిత్యం ప్రజల్లో ఉంటూ ఎన్నికలకు నేతలను, కేడర్ ను సిద్ధం చేస్తున్నారు. ఈసారి ఏది ఏమైనా 175కి 175 సీట్లే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చేయాలని దిశా నిర్ధేశం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు వ్యూహాలను రచిస్తూ గెలుపే లక్ష్యంగా పని చేస్తున్నారు. ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన జగన్ ఇటీవల వరుస సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిన్న విజయవాడలో బీసీ గర్జన పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టారు. ఇక ఇవాళ కూడా పార్టీ నాయకులతో సమావేశం అయ్యారు.
ఈ సమావేశంలో సీఎం జగన్ (Cm Jagan) కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లలో గెలుపే లక్ష్యంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఏపీలో ఉన్న వాలంటీర్ వ్యవస్థ లాగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ 50 ఇళ్లకు ఇద్దరు లేదా ముగ్గురు చొప్పున 5.20 లక్షల మంది వైసీపీ ప్రతినిధులను నియమించాలని సీఎం ఆదేశించారు. వీరిని గ్రామ సారథులుగా పిలవాలని, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను వివరించాలని సూచించారు. అంతేకాదు 10 రోజుల్లో బూత్ కమిటీలను నియమించాలని సీఎం జగన్ (Cm Jagan) ఆదేశించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhrapradesh, Ap, Ap cm jagan, Ap cm ys jagan mohan reddy, AP News, Ys jagan