AP POLITICS TADEPALLI FARMERS WROTE POST CARDS TO GOVERNOR THEY WANT KARUNYA DEATHS NGS
CM Jagan: సీఎం కార్యాలయం దగ్గర రైతులకు ఇన్ని కష్టాలా..? కారుణ్య మరణాలకు అనుమతివ్వాలని పోస్ట్ కార్డులు
సీఎం జగన్ (పాత ఫొటో)
CM Jagan: ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా.. తీర్చాల్సిన బాధ్యత సీఎందే.. ముఖ్యంగా రైతులు అయితే.. ముఖ్యమంత్రే మతకు న్యాయం చేయాలని .. వారి బాధను ఆయనకు తెలిసేలా చేస్తారు. కానీ ఇక్కడి పరిస్థి అందుకు భిన్నం.. స్వయంగా సీఎం క్యాంప్ కార్యాయలం పక్కనే ఉన్న.. రైతులు కారుణ్య మరణాలకు అవకాశం ఇవ్వాలని వేడుకుంటున్నారు. మరి వారికి వచ్చిన కష్టం ఏంటి..?
CM Jagan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ (CM Jagan) క్యాంప్ కార్యలయం దగ్గర రైతులకు ఇంత కష్టమొచ్చిందా.? కష్టం అంటే సాధారణ కష్టం కూడా కాదు.. తమకు కారుణ్య మరణాలకు అనుమతివ్వాలని లేఖలు రాస్తున్నారు అంటే వారు ఎంత అవేదన అనుభవిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.. అసలు వారి ఆవేదనకు కారణం ఏంటి..? వారి డిమాండ్ ఏంటి అంటే..? గుంటూరు జిల్లా (Guntur District) లోని తాడేపల్లి (Tadepalli), కుంచనపల్లి (Kunchanapalli), కొలనుకొండ (Kolanukonda) గ్రామాల్లోని వ్యవసాయ భూములపై విధించిన యూ-1 జోన్ (U -1 Zone) ను ఎత్తివేయాలని బాధిత రైతులు చేపట్టిన ఆందోళన రోజు రోజుకు ఉధృతమవుతోంది. తక్షణమే ఆ జోన్ ను రద్దు చేయాలని.. దీక్షలు నిర్వహిస్తున్న రైతులు తమ సమస్యలు.. తీరకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా కారుణ్య మరణాలకు అనుమతివ్వాలని లేఖలు రాసి షాక్ కు గురి చేశారు. ప్రభుత్వ నిబంధనలతో ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక పొతున్నామని.. పిల్లలకు పెళ్లిల్లు కూడా చేయలేకపోతున్నామని మనస్థాపానికి గురవుతున్నారు. అందుకే సీఎం కార్యాలయం ఉన్న తాడేపల్లి పరిధిలోని రైతులు ఏపీ గవర్నర్ (AP Governor) కు పోస్టు కార్డులు రాయడం కలకలం రేపుతోంది. రాజధాని అమరావతి (Amaravati) కోసం తాడేపల్లి పరిధిలోని అమరా నగర్ కు చెందిన 178 ఎకరాలను ప్రభుత్వం యూ-1 జోన్ కిందకు వస్తుంది. అంటే ఆ భూములను ఎటువంటి క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు జరగకుండా నిషేధం విధించింది గతంలోని టిడిపి ప్రభుత్వం.
ఈ జోన్ ను తొలగించాలని టీడీపీ ప్రభుత్వ హయాం నుంచి ఈ ప్రాంత రైతులు ఆందోళన నిర్వహిస్తూనే ఉన్నారు. గత ఎన్నికలలో తాము అధికారంలోకి వస్తే యూ -1 జోన్ ను తొలగిస్తామని రైతులకు వైసీపీ హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం యూ-1 జోన్ తొలగించడంలో చేస్తున్న జాప్యం వల్ల ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత 13 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న రైతులు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోడంతో తీవ్రంగా ఆవేదన చెంతున్నారు. తమకు న్యాయం జరగుతుందని నమ్మకం పోయిందంటున్నారు. అందుకే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు పోస్ట్ కార్డులు రాసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తమ ఆవేదనను అర్థం చేసుకొని.. కారుణ్య మరణాలను ప్రసాదించాలి అంటూ ఆ లేఖల్లో పేర్కొన్నారు. ఇప్పటికే 2019 ఎన్నికలలో యూ-1 జోన్ ఎత్తివేస్తామని వైసీపీ ఇచ్చిన హామీ మేరకు స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ని కలిసి అనేక మార్లు విజ్ఞప్తి చేశారు. తరువాత ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డిని సైతం కలిసి వారు తమ సమస్య దృష్టికి తీసుకు వెళ్లారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు నెలల్లోనే యూ-1 జోన్ ఎత్తివేస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదని, ఈ కారణంగా జాతీయ రహదారి సమీపంలో ఉన్న తమ భూములను అవసరాలకోసం అమ్ముకోలేక పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.