హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

RRR: రఘురామ పాదాలకు గాయాలున్నట్టు నిర్ధారణ... చిత్ర హింసలు పెట్టింది నిజమేనన్న న్యాయవాది

RRR: రఘురామ పాదాలకు గాయాలున్నట్టు నిర్ధారణ... చిత్ర హింసలు పెట్టింది నిజమేనన్న న్యాయవాది

రెండున్నరేళ్ల క్రితం వైసీపీ సర్కార్ తో విభేదించిన రఘురామకృష్ణంరాజు రచ్చబండ పేరుతో ప్రతిరోజూ ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ సీఎం జగన్ పై తీవ్రస్థాయి విమర్శలు చేస్తూవచ్చారు. ఈక్రమంలోనే జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ పలు కోర్టుల్లో పిటిషన్లు వేయడం, అవి విచారణకు రావడం ఏపీ వ్యాప్తంగా టెన్షన్ రేకెత్తించింది. ప్రతిగా రఘురామపైనా పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయి. అరెస్టు భయంతో ఢిల్లీకే పరిమితమైన రఘురామ రెండున్నరేళ్లుగా సొంత నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు..

రెండున్నరేళ్ల క్రితం వైసీపీ సర్కార్ తో విభేదించిన రఘురామకృష్ణంరాజు రచ్చబండ పేరుతో ప్రతిరోజూ ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ సీఎం జగన్ పై తీవ్రస్థాయి విమర్శలు చేస్తూవచ్చారు. ఈక్రమంలోనే జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ పలు కోర్టుల్లో పిటిషన్లు వేయడం, అవి విచారణకు రావడం ఏపీ వ్యాప్తంగా టెన్షన్ రేకెత్తించింది. ప్రతిగా రఘురామపైనా పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయి. అరెస్టు భయంతో ఢిల్లీకే పరిమితమైన రఘురామ రెండున్నరేళ్లుగా సొంత నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు..

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ ను ఏపీ పోలీసులు చిత్ర హింసలకు గురి చేశారా? పోలీసుల కస్టడీలో ఏం జరిగింది. ఆర్మీ వైద్యుల నివేదిక అదే చెబుతోందా? తాజాగా ఆయన కాలి మీద గాయాలు ఉన్నాయని ధర్మాసనం నిర్ధారించింది. దీంతో సుప్రీం కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇంకా చదవండి ...

  ఎన్నికల ఫలితాల కోసం ఎలా ఎదురు చూస్తారో.. ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా అంతా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మెడికల్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఏపీ వైద్యులు ఆయనకు తాజాగా దెబ్బలు ఏం అవ్వలేదని స్పష్లం చేశారు. కానీ రఘురామ తరపు న్యాయవాదులు సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో హైదరాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో పరీక్షలు చేయించమని సుప్రీం ఆదేశించింది. దీంతో ఇప్పుడు ఆ మెడికల్ రిపోర్ట్ లో గాయాలు ఉన్నట్టు తేలింది. దీనిపై సుప్రీం కోర్టు సైతం క్లారిటీ ఇచ్చింది.

  తాజాగా ఎంపీ రఘురామ బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. ఆర్మీ ఆస్పత్రి నివేదికను న్యాయమూర్తి వినయ్ చరణ్‌ చదివి వినిపించారు. రఘురామ పాదాలకి గాయాలున్నట్టు నిర్ధారణ అయ్యిందన్నారు.. మెడికల్‌ బోర్డు రిపోర్ట్‌కి, ఆర్మీ ఆస్పత్రి చెకప్‌కి మధ్య ఏదో జరిగిందని ప్రభుత్వం తరఫు న్యాయవాది దవే అనుమానం వ్యక్తం చేశారు. కస్టడీలో చిత్రహింసలు నిజమేనని ఈ రిపోర్ట్‌లో తేలిందని పిటిషనర్ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టుకు వివరించారు. రఘురామ తనకు తాను గాయాలు చేసుకున్నారని భావిస్తున్నారా..? అని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మిలటరీ ఆస్పత్రి నివేదికను ఇరు పక్షాలకు మెయిల్‌ ద్వారా పంపిస్తామని ధర్మాసనం తెలిపింది. తరువాత విచారణ సోమవారానికి వాయిదా వేయాలని ప్రభుత్వ తరపు న్యాయవాది దవే కోరగా.. తక్షణమే విచారణ పూర్తి చేయాలని కోరిన రోహత్గీ కోర్టును కోరారు. ఇలా రెండు వైపులా వాదనలు పూర్తయ్యాయి. అనంతరం విచారణను ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేస్తున్నట్లు దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రకటించింది.

  దాజా పరిణామాలు.. ఆర్మి ఆస్పత్రి మెడికల్ రిపోర్ట్ చూస్తే.. ఈ కేసులు కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి దీనిపై ధర్మాసనం ఏవిధంగా స్పందిస్తుంది అన్నది చూడాలి.. ఏపీలో పోలీసులు కాని.. అటు ప్రభుత్వం కాని అసలు రఘురామకు అయిన గాయాలు ఇప్పటివి కావని ఆరోపిస్తున్నారు. గతంలో ఉన్న దెబ్బలతో ఆయన డ్రామాలు ఆడుతున్నారని వాదిస్తూ వస్తున్నారు. కానీ తాజా నివేదిక చూస్తే ఎంపీకి అవి తాజాగా అయిన గాయాలుగానే రిపోర్టులో ఉంది. అంటే ఆయన ఆరోపిస్తున్నట్టు నిజంగానే పోలీసులు ఎంపీ రఘురామ రాజును చిత్ర హింసలకు గురి చేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అయితే ఏపీ పోలీసుల తరపు అధికారులు మాత్రం ప్రభుత్వ ఆస్పత్రి ఇచ్చిన మెడికల్ రిపోర్ట్స్ తరువత నుంచి ఆయన సికింద్రాబాద్ కు వెళ్లే లోపే ఏదైనా జరిగి ఉండొవచ్చని కొత్త వాదనను తెరపైకి తీసుకొస్తున్నారు. ఆ వాదనతో కోర్టు ఎంత వరకు ఏకీ భవిస్తుంది.. ఒక వేళ ఎంపీని చిత్ర హింసలకు గురి చేశారన్న విషయాన్ని నమ్మితే ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్నది తీవ్ర ఉత్కంఠ పెంచుతోంది..

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap government, AP News, MP raghurama krishnam raju, Supreme, Supreme Court

  ఉత్తమ కథలు