M. Bala Krishna, Hyderabad, News18
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో.. ముఖ్యంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) లో ఎక్కడ చూసినా ఇప్పుడు ఒకే అంశంపై చర్చ. అదే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి (MP Vijayasai Reddy) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) తో భేటీ అవడమే. ప్రస్తుతం విజయ సాయి రెడ్డి వ్యవహారం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రెండు రోజుల్లో కేంద్రంలోని ఇద్దరు కీలక నేతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు విజయ సాయి రెడ్డి. సుదీర్ఘ విరామం తర్వాత ప్రధానితో విజయ సాయి రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మోదీతో విజయసాయి సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యలతో పాటు రాజకీయ అంశాలు ,తాజా పరిణామాలను కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను విజయసాయి ఇప్పటికే పలుసార్లు రాజ్యసభలో లేవనెత్తారు. వీటికి కేంద్ర ప్రభుత్వం కూడా రాజ్యసభలోనే లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చేసింది. ఈ సమస్యలకు సరైన సమాధానం రాలేదని ఇప్పటికే రాష్ట్రంలో విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి కూడా. దీంతో సమస్యలను సత్వరం పరిష్కారించాలంటూ ప్రధాని మోదీని విజయసాయి రెడ్డి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీల అమలుపై ప్రధానికి రాసిన లేఖలో వివరించారు.
ఇక పోలవరం ప్రాజెక్టు నిధుల కేటాయింపు, రైల్వే జోన్ వ్యవహారం, నిధుల విడుదల వంటి కీలక అంశాలను ప్రస్తావించారు వైసీపీ ఎంపీ. గతంలో ఇచ్చిన విభజన హామీలను అమలు చేసేందుకు కృషి చేయాలని కూడా ప్రధానిని కోరారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కేంద్రం సహకరించాలని కూడా కోరారు. రెండేళ్లుగా ప్రాజెక్టు సవరించిన అంచనాల విషయంలో ఎన్ని సార్లు లేఖలు రాసినా కూడా కేంద్రం ఏ మాత్రం స్పందించడం లేదు. అలాగే ప్రాజెక్టుకు ఇప్పటి వరకు ఖర్చు చేసిన నిధుల లెక్కల వివరాలను తక్షణమే సమర్పించాలని కూడా కేంద్ర జల శక్తి శాఖ ఎప్పటికప్పుడు లేఖలు రాస్తూనే ఉంది. దీంతో ప్రాజెక్టు నిర్ణీత సమయంలో పూర్తి చేయటం కష్టమని ఇప్పటికే రాష్ట్ర అధికారులు తేల్చేశారు. ఐతే విజయసాయి కేంద్ర పెద్దలతో వరుస భేటీల వెనక ఆంతర్యం ఒక్క రాష్ట్ర సమస్యలేనా.. లేక మరేదైనా కారణముందా అనేదానిపై చర్చ జరుగుతోంది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Narendra modi, Vijayasai reddy, Ysrcp