Home /News /andhra-pradesh /

AP POLITICS SPECULATIONS OVER YSRCP DONT WANT ATHAKUR BY POLL TO UNANIMOUS AS CM JAGAN WANTS TO PROVE THEIR POWER TO OPPOSITION PARTIES WITH HUGE MAJORITY FULL DETAILS HERE PRN GNT

Atmakuru Bypoll: ఆత్మకూరు ఏకగ్రీవం కావడం వైసీపీకి ఇష్టం లేదా..? అధికార పార్టీ వ్యూహం ఇదేనా..?

సీఎం జగన్ తో మేకపాటి విక్రమ్ రెడ్డి (ఫైల్)

సీఎం జగన్ తో మేకపాటి విక్రమ్ రెడ్డి (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని నెల్లూరు జిల్లా (Nellore District) ఆత్మకూరుకు త్వరలోనే బై ఎలక్షన్ (Atamkur By Election) జరగనుంది. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (Mekapati Gowtham Reddy) హఠాన్మరణంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఐతే సాధారణంగా సిట్టింగ్ ఎమ్మెల్యే మరణిస్తే ఏకగ్రీవానికే అవకాశముంటుంది. కానీ ఆత్మకూరులో పోటీ తప్పేలా లేదు. సిట్టింగ్ స్థానాన్ని ఏకగ్రీవం చేసుకునేందుకు వైసీపీ కూడా ఆదిశగా ప్రయత్నాలు చేయడం లేదు.

ఇంకా చదవండి ...
    Anna Raghu, News18, Amaravati

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని నెల్లూరు జిల్లా (Nellore District) ఆత్మకూరుకు త్వరలోనే బై ఎలక్షన్ (Atamkur By Election) జరగనుంది. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఐతే సాధారణంగా సిట్టింగ్ ఎమ్మెల్యే మరణిస్తే ఏకగ్రీవానికే అవకాశముంటుంది. కానీ ఆత్మకూరులో పోటీ తప్పేలా లేదు. సిట్టింగ్ స్థానాన్ని ఏకగ్రీవం చేసుకునేందుకు వైసీపీ కూడా ఆదిశగా ప్రయత్నాలు చేయడం లేదు. అసలు ఆ పార్టీనే పోలింగ్ జరగాలని కోరుకుంటోందా..? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఆత్మకూరులో భారీ మెజారిటీ సాధించి తమకు ప్రజాధరణ తగ్గలేదని ప్రతిపక్షాలకు గట్టి సంకేతాలివ్వాలనేది వైసీపీ వ్యుహంగా తెలుస్తోంది. ఆత్మకూరులో వైసీపీ అభ్యర్థిగా, గౌతమ్ రెడ్డి వారసుడిగా ఆయనన సోదరుడు విక్రమ్ రెడ్డి బరిలో దిగుతున్నారు.

    ఇప్పటికే అధికార వైసీపీ పార్టీ విక్రమ్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఆత్మకూరులో నామినేషన్లు కూడా ప్రారంభమయ్యాయి. బీజేపీ అయితే ఎన్నికకు రెడీ అయింది, ఇందుకోసం ఐదుగురితో ఓ ఎన్నికల కమిటీని నియమించింది. నిజానికి ప్రధాన పార్టీలు అంటే టీడీపీ, జనసేన పోటీ చేయడానికి సిద్ధంగా లేవు. జనసేన బీజేపీతో పొత్తులో ఉన్నా.. అలాంటి మొహమాటాలేమీ పెట్టుకోకుండా బీజేపీ ఏకపక్షంగా పోటీ చేస్తామని ప్రకటించింది. ఇప్పుడు జనసేన మద్దతిస్తుందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.

    ఇది చదవండి: బార్లపై బాదుడే..! కొత్త బార్ పాలసీపై సీఎం జగన్ కసరత్తు..?


    బద్వేలు సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయినప్పుడు కుటంబసభ్యులకే టిక్కెట్ ఇవ్వడంతో తాము పోటీ చేయబోవడం లేదని జనసేన అధినేత ప్రకటించారు. ఇక్కడ కూడా మేకపాటి కుటుంబమే పోటీ చేస్తున్నందున జనసేన పోటీ చేసే అవకాశం లేదు. టీడీపీ కూడా ఇప్పటికే పోటీ చేయడం లేదని ప్రకటించేసింది. దీంతో బరిలో ఉండే ప్రధాన పార్టీ బీజేపీనే అవుతుంది. కానీ ఇక్కడ పోటీ చేయడానికి బీజేపీ అభ్యర్థి లేరు. ఐతే బీజేపీ తరపున మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మేనల్లుడు రవీంద్రారెడ్డి బరిలో దిగుతారన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవలే ఆయన బీజేపీలో చేరడం ఈ ఊహాగానాలకు బలాన్నిస్తోంది.

    ఇది చదవండి: జూలై 1 నుంచి ఇంటర్ క్లాసులు.. అకడమిక్ క్యాలెండర్ రిలీజ్..75 రోజులు సెలవులే..!


    నిజానికి వైసీపీ కూడా ఆత్మకూరులో పోటీని కోరుకుంటోంది. విక్రమ్ రెడ్డి గెలుపు నల్లేరుపై నడకే అని ప్రచారం జరుగుతన్నా.. ఎందుకైనా మంచిదని ఆయన ముందుగానే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఆత్మకూరులో సానుభూతి, సంక్షేమ పథకాలు వెరసి లక్షయినా మెజారిటీ రాకపోతుందా అని వైసీపీ అంచనా వేస్తోంది.

    ఇది చదవండి: ఇంటర్నెట్ ఎంతపని చేసింది..! గోదారి గట్ల వెంట సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల పరుగులు


    ఇదిలా ఉంటే ఇటీవల టీడీపీ మహానాడు సక్సెస్ కావడంతో ఆత్మకూరులో తమ బలాన్ని చూపించి.. టీడీపీ ప్రచారానికి చెక్ పెట్టాలనేది కూడా వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. అటు బీజేపీ కూడా బద్వేలులో మాదిరిగానే ఉనికి చాటుకునేలా ఓట్లు రాకపోతాయా అనే ఉద్దేశంతో పోటీ చేస్తోంది. టీడీపీ, జనసేనకు వెళ్లాల్సిన ఓట్లలో ఎంతోకొంత తమకు రాకపోతాయా అని కమలనాథులు అంచనా వేస్తున్నారు. మరి ఆత్మకూరులో వైసీపీ రికార్డు విజయాన్ని సాధిస్తుందా లేదా అనేది పోలింగ్ పూర్తై ఫలితాలు వచ్చేవరకు వేచి చూడాల్సిందే..!
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Mekapati Goutam Reddy, Nellore Dist, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు