హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Politics: న‌వంబ‌ర్ లో ఏపీ అసెంబ్లీ ర‌ద్దు..? జ‌గ‌న్ ఎన్నిక‌ల వ్యూహాం ఇదేనా..? లండ‌న్ లో కీలక భేటీ..?

AP Politics: న‌వంబ‌ర్ లో ఏపీ అసెంబ్లీ ర‌ద్దు..? జ‌గ‌న్ ఎన్నిక‌ల వ్యూహాం ఇదేనా..? లండ‌న్ లో కీలక భేటీ..?

వైఎస్ జగన్ (ఫైల్)

వైఎస్ జగన్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh¬) లో ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల జరుగుతున్న పరిణామాలు, వైసీపీ (YSRCP) ముఖ్యనేతల కామెంట్స్ వంటివన్నీ సీఎం జగన్ (AP CM YS Jagan) ముందస్తుకు వెళ్లబోతున్నారన్న ఊహాగానాలకు ఊతమిస్తున్నాయి.

ఇంకా చదవండి ...

M Bala Krishna, News18, Hyderabad

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల జరుగుతున్న పరిణామాలు, వైసీపీ (YSRCP) ముఖ్యనేతల కామెంట్స్ వంటివన్నీ సీఎం జగన్ (AP CM YS Jagan) ముందస్తుకు వెళ్లబోతున్నారన్న ఊహాగానాలకు ఊతమిస్తున్నాయి. ఏపీలో రెండేళ్ల ముందుగానే ఎన్నిక‌ల హాడ‌విడి మొద‌లైపోయింది. ఒక వైపు ప్ర‌తిప‌క్ష పార్టీ ప్ర‌జ‌ల్లోనే ఉంటుంటే మ‌రో వైపు అధికార‌పార్టీ నేత‌లు కూడా ఎదో ఒక కార్య‌క్ర‌మంతో ప్ర‌జ‌ల్లో ఉండే ప్రయ‌త్నాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌లు రోజుకో రొడ్డు షో తో ప్ర‌జ‌ల్లో ఉంటున్నారు. ప్ర‌తిప‌క్ష తెలుగు దేశం ప్రభుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌క‌డుతూ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హాస్తోంది. అందులో భాగంగా తెలుగు దేశం చెప‌ట్టిన కార్య‌క్ర‌మాల్లో ఒక్క‌టైన బాదుడు బాదుడు ప‌ట్ల ప్ర‌జ‌ల్లో విశేష స్పంద‌న వ‌స్తోంది.

దీంతో ప్ర‌భుత్వం ఎప్పుడు ముందుస్తుకు వెళ్లిన అది త‌మ‌కే క‌లిసోస్తుంద‌నే ఆలోచ‌న‌లో ఆ పార్టీనేత‌లు ఉన్నారు. ఇదిలా ఉంటే జ‌గ‌న్ స‌ర్కార్ మాత్రం ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్లు స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ ముందుస్తుకు వెళ్లాల‌నే నిర్ణ‌యం తీసుకున్నట్లు తెలుస్తోంది. అన్ని అనుకూలిస్తే ఈ ఏడాది న‌వంబ‌ర్ లో అసెంబ్లీని ర‌ద్దు చేసి ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌నే ఆలోచ‌న‌లో జ‌గ‌న్ ఉన్న‌ట్లు స‌మాచారం. ఇది దృష్టిలో పెట్టుకోనే జ‌గ‌న్ గ‌డ‌ప గ‌డప‌కు మ‌న ప్ర‌భుత్వం అనే కార్య‌క్ర‌మాని డిజైన్ చేసిట్లు స‌మాచారం.

ఇది చదవండి: అనంతబాబు ఆ ముగ్గురికి బినామీ..! మాజీ ఎంపీ సంచలన కామెంట్స్..


మ‌రోవైపు తెలుగు దేశం కూడా జ‌గ‌న్ ఎప్పుడైన ఎన్నిక‌ల‌కు రెడీ అవుతార‌నే స‌మాచారంతో అన్ని స‌న్న‌ద్దం చేసుకుంటుంది. ఇందులో భాగంగానే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీలకుండ జాగ్ర‌త్తు లు ప‌డుతుంది. ఇప్ప‌టికే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ తో ట‌చ్ లో ఉన్న తెలుగు దేశం.. మ‌రో పార్టీ బీజేపీని కూడా త‌మ కూట‌మిలోకి చేర్చే బాధ్య‌త‌ను ప‌వ‌న్ కు అప్ప‌గించిన‌ట్లు స‌మాచారం.

ఇది చదవండి: ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్.. డ్రైవర్ హత్య కేసులో కీలక పరిణామం..


మొత్తానికి ప్ర‌భుత్వం వ్య‌తిరేక పార్టీలు అన్ని ఒక్క‌తాటిపైకి వ‌చ్చి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీల‌కుండా క‌ట్టుదిట్ట‌మైన వ్యూహాలు వేస్తోంది. మ‌రో వైపు జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష వ్యూహాలును దెబ్బ‌కొట్టేందుకు ఢిల్లీ స్థాయిలోనే పావులు క‌దుపుతున్నారు. రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత అడ్ర‌స్ లేకుండా పోయిన కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు మ‌ళ్లీతెర‌పైకి తీసుకొచ్చి కొంతైనా ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు ను చీల్చ‌గ‌లిగితే ప్ర‌తిప‌క్ష పార్టీలు వేస్తోన్న వ్యూహానికి కొంత మేరైన అడ్డుక‌ట్ట వేయోచ్చ‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. అందులో భాగంగానే మాజీ సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డిని తెర‌పైకి తీసుకొచ్చింది కూడా జ‌గ‌న్ పార్టీ నేత‌ల‌నే టాక్ వినిపిస్తోంది.

ఇది చదవండి: అమ్మఒడిపై కీలక అప్ డేట్.. ఈసారి వచ్చేది రూ.13వేలే.! కారణం ఇదే..!


దీంతోపాటు వ‌చ్చే ఎన్నిక‌ల్లో 50 నుంచి 60 శాతం మేర‌కు కొత్త వారికి టిక్కెట్స్ ఇవ్వ‌డం వెనుక కూడా ఇదే వ్యూహాం ఉన్న‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం పార్టీలో ఉన్న కొంత మంది నేత‌ల ప‌ట్ల చాలా వ్య‌తిరేక‌త ఉన్న నేపథ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో వాటి ప్ర‌భావం పార్టీపై ప‌డే అవ‌కాశం కూడా ఉంద‌ని జ‌గ‌న్ భావిస్తోన్న‌ట్లు తెలుస్తుంది. దీంతోపాటు ప్ర‌శాంత్ కిషోర్ స‌ర్వేలో కూడా దాదాపు 50 మంది సిట్టింగ్ ఎమ్మెల్యే ప‌ట్ల ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఉంద‌ని రిపోర్ట్ రావ‌డంతో జ‌గ‌న్ కూడా ఇందుకు సుముఖంగా ఉన్న‌ట్లు స‌మాచారం.

ఇది చదవండి: మారువేషంలో ప్రజల్లోకి మంత్రి, ఎమ్మెల్యే.. పబ్లిక్ రియాక్షన్ ఇదే.. పరువు తీసిన ప్రయోగం..?


అన్ని అనుకూలిస్తే ఈ ఏడాది న‌వంబ‌ర్ లో అసెంబ్లీని రద్దు చేసి ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని జ‌గ‌న్ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మొన్న దావోస్ మార్గ‌మ‌ధ్యంలో ప్లైట్ ను ల‌డ‌న్ లో ల్యాండ్ చేయించి అక్క‌డ కేటీఆర్ తో ర‌హాస్య బేటీ కూడా నిర్వ‌హించార‌ని ప్ర‌తిప‌క్ష పార్టీలు ఆరోపిస్తోన్నాయి.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP Politics

ఉత్తమ కథలు