AP POLITICS SPECULATIONS OVER YCP MLA TRYING FOR CABINET BERTH THROUGH PARTY KEY LEADERS FULL DETAILS HERE PRN GNT
AP Cabinet Updates: కేబినెట్ బెర్త్ కోసం ఎమ్మెల్యేల ప్రయత్నాలు.. జగన్ అనుగ్రహం వారికేనా..?
సీఎం వైఎస్ జగన్ (ఫైల్)
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పాలిటిక్స్ (AP Politics) ప్రస్తుతం కేబినెట్ విస్తరణ చుట్టూ తిరుగుతున్నాయి. మంత్రివర్గంలో మార్పులకు సీఎం జగన్ (CM YS Jagan) ముహూర్తం ఖరారు చేయడం, పాతమంత్రులతో రాజీనామాలు చేయించడంతో మంత్రి పదవి కోసం ఎమ్మెల్యేలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పాలిటిక్స్ (AP Politics) ప్రస్తుతం కేబినెట్ విస్తరణ చుట్టూ తిరుగుతున్నాయి. మంత్రివర్గంలో మార్పులకు సీఎం జగన్ (CM YS Jagan) ముహూర్తం ఖరారు చేయడం, పాతమంత్రులతో రాజీనామాలు చేయించడంతో మంత్రి పదవి కోసం ఎమ్మెల్యేలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సామాజిక వర్గాలు, జిల్లాలు, రాజకీయ సమీకరణాలను లెక్కలేకుసొది అధిష్టానం అనుగ్రహం పొందేందుకు ట్రై చేస్తున్నారు. కేబినెట్లో మార్పులపై సీఎం జగన్ ప్రస్తావించిన తర్వాత ఆశావాహులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. పార్టీ ముఖ్యనేతలు, జగన్ తో సన్నిహితంగా ఉండే సీనియర్ల వద్ద తమకు అవకాశమివ్వాలని కోరుతున్నారు. గత రెండు రోజులుగా ఆశావాహుల నుంచి వచ్చే ఫోన్లు, రికమండేషన్లతో పార్టీ ముఖ్యనేతలు బిజీ అయిపోతున్నారు. కొందరు నేరుగా కలిసి వారి ప్రయత్నాలు చేస్తున్నారు.
ముఖ్యంగా గుంటూరు జిల్లాకు చెందిన ఓ మహిళా ఎమ్మెల్యే మంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. సీఎం కార్యక్రమాల్లో ఆయన దృష్టిలో పడేందుకు తపించే ఆమె.. జగన్ అత్యంత సన్నిహితమైన ముఖ్యనేత ద్వారా లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం. సామాజిక సమీకరణాల కోటాలో ఆమెకు ఛాన్స్ వస్తుందని అనుచరులు ప్రచారం చేస్తున్నారు.
ఇక తన మాటలతో ప్రతిపక్షాలపై విరుచుకుపడే ఓ ఎమ్మెల్యే.. అమాత్య పదవి కోసం చేయని ప్రయత్నం లేదట. పార్టీ ఓడిపోయినా తాను జగన్ వెంటే నడిచానని.. ఎప్పటికీ ఆయన వైపే ఉన్నానని.. కులసమీకరణాలు చూసైన తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారట. ఎన్నికల సమయంలో ఓ పార్టీ బలమున్న గ్రామంలో నా గుండెల్లో బాకులు గుచ్చొద్దంటూ వేడుకున్న సదరు ఎమ్మెల్యే.. గెలిచిన తర్వాత ఓ వివాదంలో చిక్కుకొని తీవ్ర విమర్శలెదుర్కొన్నారు. ఇప్పుడు మంత్రి పదవి రాకుంటే తాను తలెత్తుకోలేనని పార్టీ ముఖ్యనేతలతో అంటున్నట్లు సమాచారం.
ఇక వైసీపీలో బలంగా ఉన్న సామాజిక వర్గానికి చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే.. తన రికార్డును చూసైనా పదవి ఇవ్వాలని పార్టీ నేతలను కోరుతున్నారట. ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ తనకు తిరుగులేదనిపించుకున్నా.. మంత్రి పదవి దక్కకపోవడమే ఆయనకు లోటుగా మారింది. ఈసారి మాత్రం తాను మినిస్టర్ అవడం పక్కా అని ప్రచారం చేసుకుంటున్నారట. ఐతే సామాజిక వర్గం పరంగా వేరే జిల్లాలకు ఆ పదివి కేటాయిస్తారన్న టాక్ నడుస్తోంది.
వైసీపీకి కీలకమైన చిత్తూరు జిల్లాకు చెందిన మహిళా ఎమ్మెల్యే ఆర్కే రోజా. పార్టీ మహిళా అధ్యక్షురాలిగా, ఫైర్ బ్రాండ్ గా పేరుగాంచిన ఆమె.. మంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మొదటికోటాలోనే పదవి రావాల్సి ఉన్నా.. అది సాధ్యం కాలేదు. ఇప్పుడు రెండోసారైనా ఛాన్స్ రాకపోతుందా అని ఎదురుచూస్తున్నారు. అధిష్టానం అనుగ్రహగంతో పాటు దేవుడి దయ ఉండాలన్న భావనతో కాణిపాకం టు కాశీ యాత్రకూడా చేశారమె. కానీ సీనియర్లను కొనసాగించాలని సీఎం భావిస్తున్నందున ఆమెకు ఛాన్స్ దక్కడం దాదాపు అసాధ్యమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.