M. Bala Krishna, Hyderabad, News18
మూడు రాజధానుల అంశంలో ( AP 3 Capitals Issue) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) వెనక్కి వెళ్లారా..? ఇప్పటికిప్పుడు మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకురావడానికి గల కారణాలేంటీ..? అసలు మూడు రాజధానుల అంశాల్లో జగన్ మనుసులో మాట ఏంటీ..? మూడు రాజధానుల అంశంలో ప్రభుత్వ ఆలోచన మారకపోతే ఇప్పుడు ఉన్నట్టుండి ఎందుకు ఈ హాడావిడి..? ఇప్పుడు ఇవే ప్రశ్నలు సగటు ఆంధ్రోడి మెదడును తొలిచేస్తోన్నాయి. అయితే జగన్ ఇప్పటికిప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణమే ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే జగన్ వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.
ఒకవైపు రాజధాని రైతులు ఉద్యమం తీవ్రతరం అవుతున్న నేపధ్యంలో మరో వైపు హైకోర్టు లో కూడా ఈ అంశంపై ప్రభుత్వానిక సానుకూలంగా లేకపోవడ, దీనికి తోడు మొన్న అంసెబ్లీలో జరిగిన వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీయడం వంటి పలు అంశాలను దృష్టిలో పెట్టుకోని జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తొలూత అందరూ మూడు రాజధానుల అంశంలో జగన్ వెనకడుగు వేశారు అనుకున్నా అసెంబ్లీలో జగన్ ప్రసంగంతో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. జగన్ వ్యూహాత్మకంగానే ఈ వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చారని హై కోర్టు లో ఎలాగు ఈ బిల్లును కొట్టేస్తుందని ముందే తెలుసుకుని జగన్ ఈ బిల్లును రద్దు చేసినట్లు తెలుస్తోంది.
దీంతో పాటు అసెంబ్లీ లో జరిగి సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించడంతో టాపిక్ ను డైవర్ట్ చేయడానికి కూడా అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే శాసన మండలిలో వైసీపీ బలం తక్కువ ఉండడంతో బిల్లు ఇక్కడ పాస్ కావడం చాలా కష్టం కాబట్టి మరికొద్ది రోజుల్లో శాసన మండలిలో తమ బలం పెరుగుతున్న నేపధ్యంలో అప్పుడు బిల్లును ప్రవేశపెడితే మరింత ఈజీగా అనుకున్నది చేయోచ్చని జగన్ యోచనగా తెలుస్తోంది.
మరోవైపు మొన్న అమిత్ షా టూర్ లో స్థానికి బీజేపీ కేడర్ కి అమరావతి రైతులో ఉద్యమంలో పార్టీ నేతలు చురుగ్గ పాల్గోన్నాలని అమిత్ షా దిశా నిర్దేశం చేశారు. దీంతో ప్రస్తుతం ఉన్న బిల్లులో కొన్ని లోపాలు ఉండటంతో వాటిని సరి చేసి మళ్లీ టెక్నికల్ గా అనుకూలంగా ఉండే విధంగా అసెంబ్లీతో పాటు మండలిలోనూ ప్రవేశపెట్టాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ అంశాన్ని తెరపైకి తీసుకువస్తే కాస్త టీడీపీ చేస్తున్న ప్రచారానికి కూడా అడ్డుకట్ట వేయొచ్చని జగన్ భావించి హుటాహుటిన సోమవారం కేబినెట్ ఏర్పాటు చేసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మొత్తానికి జగన్ మూడు రాజధానుల అంశానికే కట్టుబడి ఉన్నట్లు అయింది మొన్న జరిగిన సంఘటనపై ప్రజల్లో చర్చను పక్కదారి పట్టించినట్లు కూడా అయిందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap capital, Ap cm ys jagan mohan reddy