Home /News /andhra-pradesh /

AP POLITICS SPECULATIONS OVER THAT THERE IS A RIFT IN MEKAPATI FAMILY AFTER GOWTHAM REDDY SEDDEN DEMISE FULL DETAILS HERE PRN TPT

Mekapati Family: మేకపాటి ఫ్యామిలీలో విభేదాలు..? అందుకే ఆయన ఆత్మకూరుకు దూరంగా ఉన్నారా..?

మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, రాజమోహన్ రెడ్డి (ఫైల్)

మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, రాజమోహన్ రెడ్డి (ఫైల్)

దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (Mekapati Gowtham Reddy) మరణం అనంతరం నెల్లూరు జిల్లా (Nellore District) రాజకీయాల. ఆసక్తికరంగా మారుతున్నాయి. బ్లాక్ బస్టర్ సినిమాలో ట్విస్టులను పోలిన విధంగా మేకపాటి బ్రదర్స్ మధ్య విబేధాలకి అనేక కారణాలు ఉన్నాయట.

ఇంకా చదవండి ...
    GT Hemanth Kumar, News18, Tirupati

    దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (Mekapati Gowtham Reddy) మరణం అనంతరం నెల్లూరు జిల్లా (Nellore District) రాజకీయాల. ఆసక్తికరంగా మారుతున్నాయి. బ్లాక్ బస్టర్ సినిమాలో ట్విస్టులను పోలిన విధంగా మేకపాటి బ్రదర్స్ మధ్య విబేధాలకి అనేక కారణాలు ఉన్నాయట. అన్న మేకపాటి రాజమోహన్ తో విభేదించిన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రమోహన్ రెడ్డి దూరంగా ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఓ వైపు మేకపాటి విక్రమ్ రెడ్డి గెలుపుకు పార్టీలోనూ అతిరధ మహారధులు ఆత్మకూరులో తిష్ట వేసి ప్రచారం చేస్తుంటే.... స్వంత బాబాయి చంద్ర శేఖర్ రెడ్డి కనిపించకపోవడంతో కుటుంబంలో నెలకొన్న విబేధాలు బహిర్గతం అయిందని స్వంత పార్టీలోటాక్. అన్న తనయుడు మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం అనంతరం మంత్రి పదవి కుటుంబంలో ఒక్కరికి దక్కుతుందని అందరూ ఊహించారు.

    అన్న మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆశీర్వాదంతో పాటు రాజకీయ అనుభవంతో తనకు మంత్రి పదవి దక్కే ఛాన్స్ నూటికి నూరు శాతం పక్కా అని భావించారు ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. కానీ అనుకున్న రీతిలో ఆయనకు అన్న కుటుంబం నుంచి పెద్దగా మద్దతు రాలేదు. సీఎం జగన్ ను కలసి మనసులో మాట చెప్పుకున్నా పట్టించుకోలేదు.

    ఇది చదవండి: అర్ధరాత్రి కూల్చివేతలేంటి..? అయ్యన్నపాత్రుడి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు.. 


    చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యేగా గెలిచినా నాటి నుంచి వ్యవహార శైలిలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యేగా గెలిచినా కొన్నాళ్లకు రెండవ భార్య వ్యవహారం తెరపైకి వచ్చింది. అంతటితో ఆగకుండా.. ఆమెకు పార్టీలో కీలక పదవి ఇచ్చారంట చంద్రశేఖర్ రెడ్డి. రెండవ భార్య పెత్తనం నియోజకవర్గంలో ఎక్కువైందని.. ఎమ్మెల్యే మాత్రం హైదరాబాద్ కు పరిమితం అయ్యారనే టాక్ నడిచింది.

    ఇది చదవండి: నచ్చింది కాదు.., ఇచ్చిందే తాగండి..? ఏపీలో మందుబాబులకు వింత కష్టాలు


    చంద్రశేఖర్ రెడ్డి నిర్వాకంతో మేకపాటి రాజమోహన్ రెడ్డి అనుచరవర్గమైన ఎంపిపి సుబ్బారెడ్డి మరో వర్గాన్ని ఏర్పాటు చేసి ఉదయగిరిలో కీలక నేతగా ఎదుగుతున్నాడట. దీంతో చంద్రమోహన్ రెడ్డి పార్టీపై.. కుటుంబీకులపై మరింత గుర్రు పెట్టుకున్నాడని టాక్. గౌతమ్ రెడ్డి మరణం అనంతరం మేకపాటి రాజమోహన్ రెడ్డి 200ఎకరాల భూమిని ప్రభుత్వ పరం చేసి.., అగ్రికల్చరర్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో తన ప్రమేయం లేకుండా 100 ఎకరాల భూమిని ఎలా ఇచ్చేస్తారన్న వాదోపవాదాలు అన్నదమ్ముల మధ్య నడిచాట.



    దీంతో కుటుంబ సభ్యులు కూడా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైఖరి పట్ల గుర్రుగా ఉన్నారట. మేకపాటి కుటుంబం కూడా ఆయనను ఆత్మకూరు ఎన్నికల ప్రచారానికి ఆహ్వానించలేదని సమాచారం. అలాగే వైసీపీ అధినేత జగన్ కూడా ఆయనను పెద్దగా పట్టించుకోలేదని చెప్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో చంద్రశేఖర్ రెడ్డికి సీటు రాదనే వాదన వినిపిస్తుంటే.., తనకే టికెట్ వస్తుందని ధీమాగా ఉన్నారట చంద్రశేఖర్ రెడ్డి. మరి మేకపాటి ఫ్యామిలీలో నిజంగానే విభేదాలున్నాయా..? లేక ఇదంతా ఊహాగానాలేనా అనేది క్లారిటీ రావాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే..!
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Mekapati Goutam Reddy, Nellore Dist

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు