హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Janasena Party: ప‌వ‌న్, నాదెండ్ల మ‌ధ్య గ్యాప్ వ‌స్తోందా..? భేదాభిప్రాయాలకు కారణం ఇదేనా..?

Janasena Party: ప‌వ‌న్, నాదెండ్ల మ‌ధ్య గ్యాప్ వ‌స్తోందా..? భేదాభిప్రాయాలకు కారణం ఇదేనా..?

పవన్ కల్యాణ్ తో నాదెండ్ల మనోహర్ (ఫైల్)

పవన్ కల్యాణ్ తో నాదెండ్ల మనోహర్ (ఫైల్)

టీడీపీ ఆఫీస్ పై దాడి (Attack on TDP Office) జ‌రిగిన‌ప్పుడు కూడా అంద‌రికంటే ముందే ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) స్పందించారు. జ‌రిగిన దాడుల‌ను ఖండించారు. అయితే ఇప్పుడు ఇదే అంశం జ‌న‌సేన పార్టీలో (Janasena Party) అంత‌ర్గ‌త విభేదాల‌కు దారితీసిన‌ట్లు ప్రచారం జరుగుతోంది.

ఇంకా చదవండి ...

  M. Bala Krishna, Hyderabad, News18

  ప్ర‌స్తుతం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)రాజ‌కీయాలు (AP Politics)హాట్ హాట్ సాగుతున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ (YSR Congress Party), ప్ర‌తిప‌క్ష‌ తెలుగుదేశం పార్టీలు (Telugu Desham Party) ఒక‌రిపై ఒక‌రు కారాలు మిరియాలు నూరుతుంటే మ‌రోవైపు బీజేపీ (BJP), జ‌న‌సేన పార్టీలు (Janasena Party) కూడా ఇదే మంచి ఛాన్స్ గా రాజ‌కీయ వ్యూహాలు ప‌న్నుతున్నాయి. అయితే ప్ర‌తిప‌క్ష‌పార్టీతో పాటు ప్ర‌భుత్వతీరుపై అదే స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan). మొన్న‌టికి మొన్న టీడీపీ ఆఫీస్ పై దాడి జ‌రిగిన‌ప్పుడు కూడా అంద‌రికంటే ముందే ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పందించారు. జ‌రిగిన దాడుల‌ను ఖండించారు. అయితే ఇప్పుడు ఇదే అంశం జ‌న‌సేన పార్టీలో అంత‌ర్గ‌త విభేదాల‌కు దారితీసిన‌ట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ విషయంలో వెంటనే స్పందించాల్సిన అవసరం లేదే అభిప్రాయం పార్టీలో కిందిస్థాయి నుంచి పైస్థాయి నేతల వరకు వ్యక్తమవుతోంది.

  ఇప్పుడీ వ్యవహారం పవన్ కల్యాణ్ కు పార్టీలోని కీలక నేతకు మధ్య గ్యాప్ తెచ్చినట్లు కనిపిస్తోంది. ఆ ముఖ్యనేత పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar). ప్ర‌స్తుతం పార్టీ వ్య‌హారాలు, ప‌వ‌న్ కు రాజకీయంగా దిశానిర్ధేశం అన్ని ఆయ‌నే చేస్తున్నారు. పార్టీ వ్యూహాల్లోనూ కీలకపాత్ర పోషిస్తున్నారాయన. పార్టీలో పవన్ తర్వాత ఆయనే అనే పేరు కూడా ఉంది. అయితే ప్ర‌స్త‌తం నాదెండ్ల మ‌నోహార్ కూడా ప‌వ‌న్ వ్య‌వ‌హారంపై కాస్త అసంతృప్తిగా ఉన్న‌ట్లు పార్టీ వ‌ర్గాల స‌మాచారం. ముఖ్యంగా టీడీపీ పార్టీ ఆఫీస్ పై దాడి విష‌యంలో ప‌వ‌న్ కాస్త ఆలోచించి మాట్లాడిఉండాల్సిందని ఆయ‌న అభిప్రాయ‌ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రి అంత దారుణ‌మైన భూతు ప‌ధం తో దూషించిన త‌రువాత పూర్తి స్థాయిలో విష‌యం తెలుసుకోకుండా ముందే మాట్లాడ‌డం ప్ర‌జ‌ల్లోకి త‌ప్పుడు సంకేతాలు వెళ్లిన‌ట్లు అయిందిని నాదెడ్ల మ‌నోహార్ అన్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

  ఇది చదవండి: ఆ కీలక నేతకు ఎమ్మెల్సీ పదవి గ్యారెంటీ..? సీఎం జగన్ మాట నిలబెట్టుకుంటారా..!  ఇదిలా ఉంటే జ‌న‌సేన పార్టీ ఆవిర్భావించిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు చాలా మంది ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీలో చేరి త‌రువాత కార‌ణం లేకుండానే త‌ప్పుడుకున్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేరు రాజా ర‌వితేజ.., తాను పార్టీ పెట్ట‌డానికి ఈయ‌నే ప్ర‌ధాన కార‌ణమని స్వయంగా ప‌వ‌న్ క‌ళ్యాణే ప‌లుమార్లు చెప్పుకొచ్చారు కూడా. పార్టీ సిద్దాంత‌లు ద‌గ్గ‌ర నుంచి విధి విధానాల వ‌ర‌కు అన్ని రాజా ర‌వితేజా ఆలోచ‌న‌ల‌తోనే జ‌రిగాయ‌ని ఆయ‌నే త‌న రాజకీయంగా వెనుకున్న వ్య‌క్తి అన్న‌ట్లుగా గ‌తంలో ప‌వ‌న్ చెప్పుకొచ్చారు. అయితే కొద్ది రోజుల‌కే ఆయ‌న పార్టీ నుంచి బ‌య‌ట‌కెళ్లి పవన్ పై తీవ్ర ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.

  ఇది చదవండి: లోకేష్ కు ఇదే మంచి ఛాన్స్..? ప్రజల్లోకి వెళ్లి క్యాష్ చేసుకుంటారా..?  ఇక విశాఖపట్నం లోక్ సభ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీ నారాయ‌ణ కూడా ఎన్నికలు ముగిసిన కొంతకాలం తర్వాత పార్టీని వీడారు. పవన్ సినిమాలు చేయడం నచ్చకే తాను పార్టీ వీడుతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు పవన్ తో నాదెండ్ల మనోహర్ కు అభిప్రాయబేధాలు వచ్చాయన్న ప్రచారం నేపథ్యంలో ఆయన నిర్ణయం ఎలా ఉండబోతుందన్నదానిపై రాజకీయావర్గాల్లో చర్చ జరుగుతోంది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Janasena party, Nadendla Manohar, Pawan kalyan

  ఉత్తమ కథలు