M Bala Krishna, News18, Hyderabad
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో రాజకీయాల్లో ఇటీవల ప్రధానంగా చర్చ జరుగుతున్న అంశం జనసేన పార్టీ (Janasena Party) తో తెలుగుదేశం (Telugu Desham Party)పొత్తు. ఈ రెండు పార్టీలు చేతులు కలపబోతున్నాయని.. 2024లో కలిసే బరిలో దిగుతున్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది. ఒక విధంగా చంద్రబాబే.. పవన్ తో పొత్తుకు తలుపులు తెరిచారు. వన్ సైడ్ లవ్, త్యాగాలకు సిద్ధమంటూ సిగ్నల్స్ ఇచ్చారు. ఐతే పవన్ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చమని చెబుతున్నా టీడీపీ విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతానికి బీజేపీతోనే ఉన్నామంటున్నారు. ఐతే ఎన్నిసార్లు పొత్తలకు సంబంధించి ముందడుకేసినా పవన్ నుంచి ఒక స్పష్టత లేకపోవడంతో చంద్రబాబు ఇక చాలనుకుంటున్నారా..? త న సామర్ధ్యం పైనే బాబు నమ్మకం పెట్టుకుంటే బెటర్ అనే ఆలోచనకు వచ్చారా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.
టీడీపీ వర్గాల నుంచి ప్రస్తుతం ప్రభుత్వంపై పూర్తిస్థాయి వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో తాను ఒంటరిగా బరిలో దిగితే ఫలితాలు ఎలా ఉంటాయనేదానిపై బాబు కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇటీవల పార్టీ చేపట్టిన బాదుడే బాదుడు, మహానాడు, మినీ మహానాడు అన్ని కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుండడంతో ఇప్పుడు బాబు తన సొంత బలంపై ఫోకస్ పెట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటికే పలుసార్లు పొత్తులకు సంబంధించి చంద్రబాబు మందడుగు వేసిన పవన్ నుంచి మాత్రం ఈ అంశంపై క్లారిటీ రాలేదు. అసలు పొత్తులతో ముందుకెళ్తతారో లేదో అనే అంశంపై కూడా పవన్ తేల్చకపోవడంతో చంద్రబాబు విసిగిపోయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగానే తెలుగుదేశం వచ్చే ఎన్నికల్లో పొత్తులతో లేకుండా పోటీ చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయనేదానిపై బాబు సర్వే కూడా నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఓ 15 నియోజకవర్గాలకు ఎంపిక చేసుకొని ఈ సర్వే జరుగుతున్నట్లు తెలుస్తోంది.
టీడీపీ ఒంటరిగా బరిలో దిగితే ఎలాంటి ఫలితాలు ఉంటాయనేదానిపై ఈ సర్వే తరువాత చంద్రబాబు డిసైడ్ అవనున్నట్లు సమాచారం. మరో వైపు ఇప్పటికే ఒక వైపు చంద్రబాబు మరో వైపు లోకేష్ ప్రజల్లోనే ఎదో ఒక కార్యక్రమంతో ఉంటున్నారు. దీనికితోడు టీడీపీ నిర్వహించే కార్యక్రమాలకు ప్రజల్లో విశేష స్పందన వస్తుండటంతో కేడర్ తోపాటు నేతలు కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు. అయితే ప్రస్తుతం వస్తున్న స్పందన ఎన్నికల నాటి వరకు ఉంటుందా..? ఇప్పుడు ఈ స్పందన చూసి పొత్తులకు సంబంధించి నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుందనే చర్చ పార్టీలో జరుగుతోంది.
పవన్ త్వరలో ఢిల్లీ వెళ్లనున్న నేపథ్యంలో ఆ టూర్ తరువాత తన మనసులో మాట చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే గత రెండు ఎన్నికల్లో తాను తగ్గానని ఇప్పుడు మీరు తగ్గితే బాగుంటుందని పవన్ చేసిన వ్యాఖ్యలపై కూడా టీడీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ప్రస్తుతం పవన్ అండ్ బాబు మధ్య జరుగుతున్న ఈ కోల్డ్ వార్ అధికారపార్టీ నేతలు తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. పవన్ ను రెచ్చగొట్టి టీడీపీతో చెడేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే మొత్తం ఈ పొత్తుల వ్యవహారం పవన్ ఎటుంటి కాల్ తీసుకుంటున్నారనేదే ఇప్పుడు ఆసక్తిగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Janasena party, TDP