Home /News /andhra-pradesh /

AP POLITICS SPECULATIONS OVER SENIOR POLITICIAN CK BABU TO JOIN YSRCP EVEN HE HAD RIFT WITH MINISTER PEDDIREDDY RAMA CHANDRA REDDY FULL DETAILS HERE PRN TPT

AP Politics: రాజకీయాల్లో యాక్టీవ్ అవుతున్న చిత్తూరు నేత.. పెద్దిరెడ్డితో వైరం ప్లస్సా.. మైనస్సా..!

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

చిత్తూరు జిల్లా (Chittoor District) లో ఆ నేత పేరు తెలియని వారు ఉండరు. మంది మార్బలంతో పాటు రాజకీయంలో ఆయన రూటే సపరేటు. చిత్తూరు జిల్లాలో సీనియర్ నాయకుడైన సీకే జయచంద్ర రెడ్డి అంటే వీరికి తెలియదు. సీకే బాబు అంటే చాలు టక్కున గుర్తుకు వచ్చేస్తారు.

ఇంకా చదవండి ...
  GT Hemanth Kumar, News18, Tirupati

  చిత్తూరు జిల్లా (Chittoor District)లో ఆ నేత పేరు తెలియని వారు ఉండరు. మంది మార్బలంతో పాటు రాజకీయంలో ఆయన రూటే సపరేటు. చిత్తూరు జిల్లాలో సీనియర్ నాయకుడైన సీకే జయచంద్ర రెడ్డి అంటే వీరికి తెలియదు. సీకే బాబు అంటే చాలు టక్కున గుర్తుకు వచ్చేస్తారు. నాలుగు సార్లు కాంగ్రెస్ పార్టీ (Congress Party) తరపున తిరుగు లేని రాజకీయ నాయకుడిగా ఎదిగిన సీకే.., వైఎస్ రాజశేఖర్ హయాంలో రాయలసీమ అభివృద్ధి మండలి చైర్మన్గా కీలక బాధ్యతలు చేపట్టారు. కార్మిక నేతగా సీకే రాజకీయ ప్రస్థానం మొదలైంది. అతి తక్కువ కాలంలోనే వార్డ్ మెంబెర్ గా.... వెనువెంటనే మునిసిపల్ వైస్ చైర్మన్ పదవులు చేపట్టి తనదైన ముద్రను వేసి చిత్తూరులోని ఐదు నియోజకవర్గాలను శాసించే స్థాయికి ఎదిగారు.

  1989 ఎన్నికల్లో చిత్తూరు నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎవరు ఊహించని విధంగా విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి 1994, 1999 ఎన్నికల్లోనూ గెలిచారు. 1994లో జిల్లాలోని 15 స్థానాల్లో 14 చోట్ల సైకిల్ పరవళ్లు తొక్కితే ఒక్క చిత్తూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సికే బాబు మాత్రమే కాంగ్రెస్ జండా ఎగురవేశాడు. ఇక 2004 ఎన్నికల్లో ఆయనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు. దింతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమిపాలయ్యారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్ సాధించి చిత్తూరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైయస్ మరణం తర్వాత, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలతో సీకే బాబు ఇమడలేకపోయారు.

  ఇది చదవండి: ఆ రెండు జిల్లాల్లో పొలిటికల్ హీట్.. రోజాకు మంత్రి పదవి ఇవ్వడమే కారణమా..?


  2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరినా, అక్కడి 2014 ఎన్నికల్లో పోటీకి దూరంగానే ఉండిపోయారు. నాటి చిత్తూరు వైసిపి అభ్యర్థి జంగాలపల్లి శ్రీనివాసులు విజయానికి తన వంతు పాటుపడ్డారు. కానీ, ఆ ఎన్నికల్లో చిత్తూరు స్థానాన్ని టిడిపి కైవసం చేసుకుంది. సికె బాబు క్రమంగా వైసిపి లో ఒంటరి అవుతూ వచ్చారు. చివరకు ఆయన్ని అటు పార్టీ కూడా దూరం పెట్టింది. దీంతో వైసిపి నుంచి ఆయన బయటకు వచ్చారు. రాజకీయ సమీకరణలలో భాగంగా 2017 నవంబరులో అనూహ్యంగా బీజేపీలో చేరారు. పొత్తులో భాగంగా 2019 ఎన్నికల్లో చిత్తూరు సీటు పొందొచ్చని భావించారు. కానీ, టిడిపి, బిజెపి పొత్తు చెదిరిపోవడంతో మళ్లీ సికే సందిగ్ధ స్థితిలో పడిపోయారు. బీజేపీకి దూరం అయినా టీడీపీతో టచ్ లోనే ఉంటూ చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గ టిడిపి అభ్యర్థుల కోసం ప్రచారంలో పాల్గొన్నారు. కానీ, జిల్లాలో వైసిపి దాదాపు క్లీన్ స్వీప్ చేసింది.

  ఇది చదవండి: వైసీపీ జిల్లా అధ్యక్షులు వీరే.. కొడాలి నాని, పేర్ని నానికి దక్కిన పదవులివే..!


  2019 ఎన్నికల అనంతరం రాజకీయాలకు, రాజకీయ నాయకులకు దూరంగా ఉంటున్నారు సీకే. ఇంట్లోనే ఉంటూ తన సన్నిహితులతో కలసిసరదాగా గడిపేస్తున్నారు. మళ్లీ రాజకీయాల వైపు దారి మల్లిందో ఏమో గాని వ్యూహం మార్చారనే టాక్ నడుస్తోంది. అధికార పార్టీలో ఉంటె లెక్కే వేరు అనుకున్నారేమో వైసీపీకి మళ్లీ దగ్గరకానున్నట్లు పార్టీ వర్గాలు చెవులు కోరుకుంటున్నాయి. మళ్లీ అధిరికంగా సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు టాక్. కుమారుని భవిష్యత్ కోసం సీకే సతీమణి సీకే లావణ్యకు కూడా రాజకీయాలపై ఆసక్తి కనపరుస్తోంది. కుమారుడు సాయికృష్ణను కూడా రాజకీయంగా తెరపైకి తీసుకు రావాలనే ప్రయత్నాలు బలంగానే చేస్తున్నారు.

  ఇది చదవండి: తూచ్.. నేనలా అనలేదు..! అధిష్టానంపై యుద్ధం వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే క్లారిటీ..


  మొన్న చిత్తూరులో భారీ స్దాయిలో జరిగిన వైఎస్సార్ వర్ధంతి వేడుకల్లో తన కుమారుడితో కలిసి సికె లావణ్య పాల్గొనడం నగరంలో చర్చనీయాంశమైంది. దీంతో సికె కుటుంబం మళ్లీ వైసీపీలోకి రావడం ఖాయమని అంతా అనుకుంటున్నారు. కానీ జిల్లా ముఖ్య నీతైనా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డితో వైరం ఉండటంతో పార్టీలో ఎలాంటి చోటు దక్కబోతుందనే ఆసక్తి జిల్లా నేతల్లో ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాటి నుంచే ఇరు వర్గీయుల మధ్య ఒక చిన్న సంగ్రామమే జరిగిందట. ఓ ర్యాలీ విషయంలో ఇద్దరు నేతలమధ్య గొడవ తారాస్థాయికి చేరుకుందట. సీకే బాబు పార్టీలోకి వస్తే సముచిత స్థానం దక్కుతుందా.... పెద్దిరెడ్డిని కాదని సీకేని పార్టీలోకి చేర్చుకుంటారా... వైసీపీ అధిష్టానం ఏంచేయబోతుందో వేచి చూడాలసిందే..??
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, AP Politics, Ysrcp

  తదుపరి వార్తలు