Home /News /andhra-pradesh /

AP POLITICS SPECULATIONS OVER RIFT IN AP BJP AFTER KEY LEADERS MET WITH OUT INFORMING STATE PRESIDENT SOMU VEERRIAJU IN VIJAYAWADA FULL DETAILS HERE PRN GNT

AP BJP: ఏపీ బీజేపీలో లుకలుకలు..? సోముకి వ్యతిరేకంగా అసమ్మతివర్గం..? ఆ భేటీకి కారణం ఇదేనా..!

సోము వీర్రాజు (ఫైల్)

సోము వీర్రాజు (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అధికారంలోకి వచ్చేందుకు భారతీయ జనతాపార్టీ (Bharatiya Janatha Party) పావులు కదుపుతోంది. ఇందుకోసం జనసేన పార్టీతో పొత్తుకూడా పెట్టుకుంది. అంతేకాదు సభలు, సమావేశాల పేరుతో దూకుడుగా ముందుకెళ్తోంది. ఐతే ఏపీని సీరియస్ గా తీసుకొని ముందుకెళ్లాలని భావిస్తున్న ఏపీ బీజేపీలో లుకలుకలు మొదలయ్యాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

ఇంకా చదవండి ...
    Anna Raghu, News18­, Guntur

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అధికారంలోకి వచ్చేందుకు భారతీయ జనతాపార్టీ (Bharatiya Janatha Party) పావులు కదుపుతోంది. ఇందుకోసం జనసేన పార్టీతో పొత్తుకూడా పెట్టుకుంది. అంతేకాదు సభలు, సమావేశాల పేరుతో దూకుడుగా ముందుకెళ్తోంది. ఐతే ఏపీని సీరియస్ గా తీసుకొని ముందుకెళ్లాలని భావిస్తున్న ఏపీ బీజేపీలో లుకలుకలు మొదలయ్యాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. విజయవాడ కేంద్రంగా విభేదాలకు బీజం పడినట్లు తెలుస్తోంది. ఆదివారం జాతీయ కార్మిక సంక్షేమ బోర్డ్ చైర్మన్ జయప్రకాష్ నారాయణ అధ్వర్యంలో పార్టీ జాతీయ కార్యదర్శి వై.సత్యకూమార్ కు ఆత్మీయ సమావేశం పేరుతో జరిగిన సమావేశానికి ఏపీ బీజేపీ ముఖ్యనేతలంతా హాజరయ్యారు. కానీ ఈ భేటీలో ఉండాల్సిన కీలక వ్యక్తి మాత్రం లేరు. ఏపీలో బీజేపీ ఫేస్ గా మారిన ఆయన లేకపోవడంతో పార్టీలో ఏదో జరుగుతోందన్న ఊహాగానాలు మొదలయ్యాయి.

    ఈ సమావేశంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కనిపించలేదు. రాష్ట్ర పార్టీ అధ్యకుడు హాజరుకాకపోవడం, కనీసం ఆయన పేరు కూడా ప్రస్తావించకుండా సమావేశం జరిగింది. సమావేశానికి ఏపీ బీజేపీ ముఖ్యనేతలు కన్నా లక్ష్మీనారాయణ, లంకా దినకర్, తురగా నాగభూషణం, జమ్ముల శ్యామ్ కిషోర్, కిలారు దిలిప్, పాతూరి నాగభూషణం, మాజీ MLA విష్ణు కుమార్ రాజు, రమేష్ నాయుడు, SK బాజీ, శ్రీనివాసరాజు ఇతర ముఖ్య నేతలు హాజరైనా సోము మాత్రం కనిపించలేదు.

    విజయవాడలో ఏపీ బీజేపీ నేతల సమావేశం

    ఇది చదవండి: ఆయనకు టికెట్ ఇస్తే ఓటమి ఖాయం.. మాజీ మంత్రిపై జేసీ సంచలన వ్యాఖ్యలు.. చంద్రబాబుకు మళ్లీ తలనొప్పులు..


    దీంతో ఏపీ బీజేపీలో అసమ్మతి జ్వాలలు మొదలయ్యాయన్న ప్రచారం జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ విజయనాకి తన వంతు కృషిచేసిన జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ను ఎపీ రాజకీయాలపై దృష్టి పెట్టాలని ఈ సమావేశంలో నేతలు కోరారు. అంతేకాదు సోము తీరుపై పలువురు నేతలు సత్యకుమార్ కు ఫిర్యాదులు కూడా చేసినట్లు తెలుస్తోంది.

    ఇది చదవండి: ఏపీలో పెరగనున్న విద్యుత్ బిల్లులు..? కొత్త ఛార్జీలు ఇవేనా..!


    రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అంశాల్లో ఇతరులు ఇచ్చిన సూచనలు కూడా పాటించడం లేదని సోము వీర్రాజుపై పార్టీ నేతలు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.. టీడీపీపై అంటే ఘాటుగా విరుచుకుపడే సోము.. వైసీపీ చేసిన తప్పులను ఎత్తి చూపడంలో మాత్రం పూర్తిగా వెనుకబడుతున్నారని అధిష్టానానికి పలువురు ఫిర్యాదులు చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

    ఇది చదవండి: రోజుకో క్వార్టర్ మందు, సిగరెట్ తాగుతా..! టీచర్లకు స్టూడెంట్ లేఖ.. ఏపీ ప్రభుత్వ స్కూల్లో షాకింగ్ ఘటన..


    గతంలో తిరుపతికి వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం సోము వీర్రాజుకు క్లాస్ పీకినట్టు ప్రచారం జరిగింది. ముఖ్యంగా రాజధాని అమరావతి కోసం తీర్మానం చేసిన తరువాత.. రాజధాని ఉద్యమంలో ఎందుకు పాల్గొనడం లేదని ఆయన ప్రశ్నించినట్టు తెమలుస్తోంది. మద్యలో ఆయన కలుగజేసుకుని.. అమరావతి ఉద్యమం పెయిడ్ బ్యాచ్ చేస్తోందని ఏదో అనబోతే.. అమిత్ షా గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టు కొందరు చెబుతున్నారు. కేవలం అమరావతి విషయంలోనే కాదు.. రాష్ట్రాంలో పార్టీని పటిష్ట పరచడం కానీ.. ఇతర పార్టీల నేతలను బీజేపీలోకి రప్పించడంలో కానీ ఎక్కడ సోమువీర్రాజు పాత్ర కనిపించడం లేదని.. ఆయన వల్ల పార్టీకి కలిగే లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉందని.. సోము వీర్రాజు వ్యతిరేక వర్గం జాతీయ కార్యదర్శి సత్యకుమార్ విన్నవించినట్లు తెలుస్తుంది. త్వరలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మార్పు ఉంటుందన్న ఊహాగానాల నేపథ్యంలో ఈ మీటింగ్ ప్రాధాన్యత సంతరించుకుంది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap bjp, AP Politics, Somu veerraju

    తదుపరి వార్తలు