హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vijayasai Reddy: వైసీపీలో విజయసాయి స్థానం గల్లంతేనా..? సీఎం జగన్ నిర్ణయం వెనుక కారణం ఇదేనా..?

Vijayasai Reddy: వైసీపీలో విజయసాయి స్థానం గల్లంతేనా..? సీఎం జగన్ నిర్ణయం వెనుక కారణం ఇదేనా..?

ఎంపీ విజయసాయి రెడ్డి

ఎంపీ విజయసాయి రెడ్డి

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అధికార పార్టీ అయిన వైసీపీ (YSRCP) లో నెంబర్ 2 పొజిషన్ ఇక విజయసాయిరెడ్డి (MP Vijayasai Reddy) కి లేనట్టే అనిపిస్తోంది. ఇప్పటికే ఆ వైపుగా అధినేత జగన్ మోహన్ రెడ్డి అడుగులు కూడా పడ్డాయి.

  P Anand Mohan, News18, Visakhapatnam

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అధికార పార్టీ అయిన వైసీపీ (YSRCP) లో నెంబర్ 2 పొజిషన్ ఇక విజయసాయిరెడ్డి (MP Vijayasai Reddy) కి లేనట్టే అనిపిస్తోంది. ఇప్పటికే ఆ వైపుగా అధినేత జగన్ మోహన్ రెడ్డి అడుగులు కూడా పడ్డాయి. వ్యూహాత్మకంగా అంచెలంచెల విధానంలో విజయసాయిరెడ్డిని పార్టీలో కీలక బాధ్యతల నుంచీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూరం చేశారు. ఇప్పుడు ఉత్తరాంధ్ర బాధ్యతలు.. విశాఖ పై నాయకత్వాన్ని కూడా ఆయన మెల్లిగా పక్కన పెట్టేశారు. దీంతో ఇప్పుడు విజయసాయిరెడ్డి ఒక్క ఢిల్లీకి తప్ప.. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో తన పట్టు కొనసాగించే పరిస్థితి కనిపించడం లేదు. మొదటి నుంచీ విజయసాయిరెడ్డిని సీఎం జగన్ (AP CM YS Jagan) రాజకీయంగా దూరంగా పెడుతున్నట్టు వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

  ప్రధానంగా విశాఖపట్నంలో ఆయన హవా తగ్గించాలని.. విశాఖ నాయకత్వానికి ఆయన్ని దూరం చేయాలని అంతర్గతంగా పెద్ద మంత్రాంగమే నడిచిందంటారు. విశాఖ కేంద్రంగా పార్టీ వ్యవహారాలకు మించి ఆయన పెత్తనం చేస్తున్నారని పార్టీ అధినేతకు పదే పదే ఫిర్యాదులు అందాయని వైసీపీ వర్గాలు అంటున్నాయి. దాదాపు ఏడాదిన్నర నుంచీ ఈ పరిస్థితి ఇలాగే కొనసాగడంతో హైకమాండ్ నిర్ణయం కూడా తీసుకుందని సమాచారం.

  ఇది చదవండి: అవినీతిపరులకు సీఎం హెచ్చరిక.. ఏసీబీ కోసం స్పెషల్ యాప్.. కాల్ సెంటర్..


  అయితే ఇదంతా విజయసాయిరెడ్డి స్వయంకృతమే అంటున్నవారు కూడా లేకపోలేదు. సాధారణంగా వైసీపీలో సర్వం జగన్నామ స్మరణే ఉండాలి. అన్నీ ఆయన కనుసన్నల్లోనే జరగాలని కూడా చెబుతుంటారు. కానీ.. ఢిల్లీలో చక్రం తిప్పుతున్నట్టు కనిపిస్తూనే.. ఆయన వ్యక్తిగత ఇమేజ్ ను పెంచుకుంటున్నారని విజయసాయిపై వై.ఎస్. జగన్ కి ఉప్పందిందట. ఇదే ఆయన కొంపముంచుతోందని విజయసాయిరెడ్డి కూడా గ్రహించలేకపోయారట. సాయిరెడ్డి తనంతట తాను వ్యక్తిగతంగా ఎదగాలని ఉవ్విళ్లూరుతున్నారని.. అందుకే ఆయన్ని సీఎం పక్కన పెట్టాల్సి వచ్చిందని అంటున్నారు.

  ఇది చదవండి: ఆ రెండు జిల్లాల్లో పొలిటికల్ హీట్.. రోజాకు మంత్రి పదవి ఇవ్వడమే కారణమా..?


  కానీ.. ఈ ఎఫెక్ట్ ఎక్కడా పార్టీ పై పడకుండా మొదట్నించీ అధినేత జాగ్రత్తగానే అడుగులు వేశారని చెప్పాలి. అందులో భాగంగానే మెల్లిగా విశాఖ విషయంలోనూ నిర్ణయం తీసుకోవడాన్ని గమనించాలనంటున్నారు వైసీపీ కార్యకర్తలు. ఆది నుంచీ సాయిరెడ్డి విషయంలో పార్టీలోని కొందరు నేతలకు కాస్తంత జెలసీ ఉన్న సంగతి బహిరంగ రహస్యమే. అయితే మరీ ఇంతస్థాయిలో ఆయనపై ఆలోచించే స్థాయికి రావడమే ఇప్పుడు చర్చనీయాంశమైంది. మొన్నటి మంత్రివర్గ విస్తరణలో కానీ.. నిన్నటి జగన్ మోహన్ రెడ్డి విశాఖ పర్యటనలో కానీ.. కొన్ని కీలకాంశాల విషయంలో కానీ.. విజయసాయిరెడ్డిని సంప్రదించలేదు. ఇన్ని జరుగుతున్నా.. సాయిరెడ్డి కూడా ఎక్కడా బయటపడలేదు.

  ఇది చదవండి: చంద్రబాబు సీఎం అయితే రాజకీయాలకు రిటైర్మెంట్.. టీడీపీ నేత సంచలన ప్రకటన


  ప్రతిపక్ష నేతను గట్టిగా విమర్శించండంలోనూ.. ఇతర నేతల నోళ్లు మూయించడానికే ఆయన్ను పరిమితం చేస్తున్నట్టే సీన్ కనిపించింది. అలాగే అధినేతకు ఇష్టం లేని పనులు చేయడం వల్లనే ఇలా వీఎస్ఆర్కి జరిగిందని చెబుతున్నవాళ్లూ లేకపోలేదు. ఇన్ని చేసిన విజయసాయిని అలా ఎలా పక్కన పెట్టాస్తారని ఆయన పై సానుభూతి చూపుతున్న వాళ్లు లిస్టు పెద్దదే. ఏదేమైనా వీఎస్ఆర్ విశాఖకి దూరం కావడం కొందరి మోదం కొందరికి ఖేదమే.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Vijayasai reddy, Ysrcp

  ఉత్తమ కథలు