హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vijayasai Reddy: సాయిరెడ్డిని జగన్ పూర్తిగా సైడ్ చేశారా..? సజ్జల మాటకే జై కొట్టిన సీఎం..?

Vijayasai Reddy: సాయిరెడ్డిని జగన్ పూర్తిగా సైడ్ చేశారా..? సజ్జల మాటకే జై కొట్టిన సీఎం..?

విజయసాయి రెడ్డి, వైఎస్ జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి (File)

విజయసాయి రెడ్డి, వైఎస్ జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి (File)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్ర‌భుత్వంలో ఎప్పుడు ఎవ‌రికి ప్రాధాన్య‌త పెరుతుందో.. ఎప్పుడు ఎవ‌రికి ప్రాదాన్య‌త తగ్గుతుందో చెప్పలేని పరిస్థితి. ఈరోజు చక్రం తిప్పినవాళ్లు రేపు నామమామత్రంగా మారిపోవచ్చు. ఈరోజు పెద్దగా కనిపించని నేతలు.. రేపు కీలకంగా మారవచ్చు.

ఇంకా చదవండి ...

  M Bala Krishna, News18, Hyderabad

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్ర‌భుత్వంలో ఎప్పుడు ఎవ‌రికి ప్రాధాన్య‌త పెరుతుందో.. ఎప్పుడు ఎవ‌రికి ప్రాదాన్య‌త తగ్గుతుందో చెప్పలేని పరిస్థితి. ఈరోజు చక్రం తిప్పినవాళ్లు రేపు నామమామత్రంగా మారిపోవచ్చు. ఈరోజు పెద్దగా కనిపించని నేతలు.. రేపు కీలకంగా మారవచ్చు. మంత్రి ప‌ద‌వులు ఇచ్చే విష‌యంలో.., కేబినెట్ నుంచి తప్పించే విష‌యంలో ఇది స్ప‌ష్ట‌మైంది. పార్టీలో ప్ర‌భుత్వంలో చాలా కీల‌కం అనుకున్న వాళ్లు మంత్రి ప‌దవుల రేసులో లేకుండా పోయారు... అసలు రేసులో లేనివాళ్లు అనూహ్యంగా అమాత్యయోగం దక్కించుకున్నారు. అయితే మంత్రులు ప్ర‌మాణ‌స్వీకారం వేదికగా పార్టీలో రకరకాల చ‌ర్చ‌లు మొద‌లయ్యాయి. ముఖ్యంగా వైసీపీ (YSRCP) కి కీలకమైన ఓ నేత మార్క్ అటు మంత్రి వర్గంలోనూ.. ఇటు ప్రమాణస్వీకారం సందర్భంగానూ కనిపించలేదు. ఆయనే వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) .

  పార్టీ అధికారంలోకి రావ‌డానికి ఎంతో కీల‌కంగా వ్య‌వ‌హారించిన విజ‌య‌సాయిరెడ్డి పాత్ర మంత్రుల ఎంపికలో కనిపించలేదు. ఈ మొత్తం ఎపిసోడ్ లో సాయిరెడ్డి పేరు కూడా వినిపించలేదు. దీంతో పార్టీ నేతల మధ్య ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. సీఎం జగన్ కు సాయిరెడ్డికి మధ్య దూరం పెరిగింద‌నేది పార్టీలో టాక్.

  ఇది చదవండి: రాజీనామాపై కుండబద్దలుకొట్టిన బాలినేని.. సీఎంతో భేటీ తర్వాత కీలక వ్యాఖ్యలు..


  ఇదిలా ఉంటే గ‌త కొద్ది రోజులుగా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి సీఎం జగన్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అందరికీ తెలిసిందే. ఒకరకంగా ఏపీలో మంత్రుల మాట కంటే సజ్జల మాటే ఎక్కువగా చెల్లుబాటవుతుందనేలా పరిస్థితులున్నాయి. ఏపీలో ఉద్యోగుల సమ్మె, జీతాల పోరాటం సమయంలో మంత్రులకంటే సజ్జలే ఎక్కువగా మీడియా ముందుకొచ్చారు. ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపి దానికి శుభం కార్డు పడేలా చేసింది కూడా ఆయనే.

  ఇది చదవండి: ఏపీ మంత్రుల చదువు, కెరీర్ వివరాలివే..! బాగా చదువుకున్న మంత్రులు వీళ్లే..!


  ఇప్పుడు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వేళ మరోసారి సజ్జల కీలకంగా వ్య‌వ‌హారించారు. త‌న వ‌ర్గానికి మంత్రి ప‌ద‌వులు రావ‌డానికి సజ్జల చాలా కీల‌కంగా వ్య‌వ‌హారించార‌నే టాక్ వినిపిస్తోంది. దీంతో ఒక్క‌సారిగా విజ‌య‌సాయి రెడ్డి ప్రాధాన్యత త‌గ్గ‌డానికి, పార్టీలో, ప్రభుత్వంలో సజ్జల శక్తివంతమైన వ్యక్తిగా మారడానికి కారణాలు ఏమై ఉండొచ్చన్న చర్చ అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో జరుగుతోంది.

  ఇది చదవండి: సంబరాల్లో మంత్రి రోజా.. భర్తతో కలిసి వేడుకలు.. సీఎంతో సెల్ఫీ..


  మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కసరత్తులో భాగంగా సీఎం జగన్ పలుసార్లు సజ్జలతోనే భేటీ అయ్యారు. ఆయన నుంచే ఇన్ పుట్స్ తీసుకున్నారు. అసలు సజ్జల సూచించిన ఎమ్మెల్యేలనే కేబినెట్ లోకి తీసుకున్నారన్న టాక్ కూడా గట్టిగానే వినిపిస్తోంది. మంత్రి ప‌ద‌వుల విష‌యంలో సాయిరెడ్డి సూచించిన ఒక్క ఎమ్మెల్యేకు కూడా జ‌గ‌న్ పరిగణలోకి తీసుకోలేదన్నది మరోవాదనగా ఉంది. అంతెందుకు మంత్రి పదవి దక్కని అసంతృప్తులను బుజ్జగించే బాధ్యతను కూడా సీఎం.. సజ్జలకే అప్పజెప్పారు. దీంతో గ‌త కొత్త కాలంలో ఏపీ ప్ర‌భుత్వంలో జ‌గ‌న్ త‌రువాత స్థానంలో స‌జ్జ‌ల ఉన్నారు అనే ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్లయింది.

  ఇది చదవండి: కొత్త కేబినెట్ తో జగన్ కు తలనొప్పులు తప్పవా..? మొదటికే మోసం వస్తుందా..?


  పార్టీలో తన మాటకు అంతగా ప్రాధాన్యం దక్కడం లేదనేది విజయసాయి రెడ్డి అభిప్రాయంగా ఆయన సన్నిహితులంటున్నారు. అందుకే ఆయన అమరావతికి రాకుండా విశాఖపట్నం, హైదరాబాద్ కే పరిమితం అవుతున్నారని.. లేదంటే ఢిల్లీలో ఉండిపోతున్నారని తెలుస్తోంది. గా మారారు. ఐతే పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ కు తోడుగా నీడగా వ్యవహరించిన విజసాయిరెడ్డిని పట్టించుకోకపోవడానికి కారణాలేంటనేది మాత్రం కార్యకర్తలకు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతోంది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Sajjala ramakrishna reddy, Vijayasai reddy

  ఉత్తమ కథలు