M Bala Krishna, News18, Hyderabad
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజకీయ వాతావరణం వేడేక్కుతోంది. ముందస్తు ఎన్నికలు ఉంటాయనే ప్రచారం జరుతున్న నేపథ్యంలో పార్టీలన్ని తమతమ వ్యూహాలను సిధ్దం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం (Telugu Desham Party) ఇప్పటికే ఎదో ఒక కార్యక్రమంతో ప్రజల్లో ఉండే ప్రయత్నాలు చేస్తోంది. అందులో సక్సెస్ కూడా అవుతోంది. బాదుడే బాదుడు, మొన్న నిర్వహించిన మహానాడు సూపర్ సక్సెస్ అవడంతో తెలుగు తమ్ముళ్లు పుల్ జోష్ లో ఉన్నారు. అయితే మరోవైపు బీజేపీ (BJP).. జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తమతోనే ఉన్నాడని చెబుతున్నప్పటికీ తమ మధ్యలోకి టీడీపీ రావడానికి సిధ్దంగా లేదు. అయితే బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తే మళ్లీ అధికారపార్టీ వైఎస్ఆర్సీకి అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ వ్యవహారం ఢిల్లీ పెద్దల దగ్గరే తేల్చుకోవడానికి పవన్ రెడీ అవుతున్నట్లు సమాచారం.
పవన్ మాత్రం టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే అనుకూల ఫలితాలు వస్తాయని భావిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అయితే రాష్ట్రస్థాయి బీజేపీ నాయకత్వం మాత్రం అందుకు అనుకూలంగా ఎలాంటి సంకేతాలు ఇవ్వడం లేదు. దీంతో ఈ వ్యవహారం ఢిల్లీ పెద్దలతోనే తేల్చుకోవాలని పవన్ భావిస్తోన్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
అందులో భాగంగానే అన్ని అనుకూలిస్తే పవన్ ఈ వారంలో ఢిల్లీ ప్లైట్ ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ అగ్రనాయకత్వం అమిత్ షా, మోడీ తోపాటు పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్స్ కోసం పవన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అమిత్ షా, మోడీ అపాయింట్మెంట్ట్స్ దొరికిన వెంటనే పవన్ ఢిల్లీ వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఇప్పటి వరకు పవన్ తో కలిసి పోటీ చేస్తే తమకు అనుకూల ఫలితాలు వస్తాయని భావించిన టీడీపీ ప్రజల్లో తమ పార్టీకి వస్తున్న స్పందన చూసి కాస్త ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. దీంతో పాటు పొత్తలకు సంబంధించి చంద్రబాబు ఎన్నిముందడుగులేసినా పవన్ నుంచి మాత్రం ఒక స్పష్టమైన సమాధానం రాకపోవడంతో బాబు కూడా సొంత బలంతో పోటీలో ఉంటే ఏ మేరకు వర్కవుట్ అవుతుందనేదానిపై సర్వేలు చేస్తోన్నట్లు పార్టీవర్గాలు చర్చించుకుంటున్నాయి.
మరో వైపు అధికాపార్టీ మాత్రం పవన్.. టీడీపీతో కలవకుండా తాము చేయాల్సి అన్ని పనులు చేస్తోంది. ఇప్పటికే పవన్ పై తీవ్రమై కామెంట్స్ చేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పవన్ మాత్రం వాటికి తనదైన శైలిలో సమాధానాలు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు పవన్ ఢిల్లీ టూర్ పై వైసీపీ నేతల్లో కూడ ఆసక్తి నెలకొంది. ఢిల్లీ నుంచి వచ్చిన తరువాత పవన్ పొత్తులకు సంబంధించి ఎటువంటి ప్రకటన చేయబోతున్నారు అనేదానికి సంబంధించి ఇటు టీడీపీ అటు వైసీపీలో ఆసక్తి నెలకొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Bjp-janasena, Pawan kalyan