M Bala Krishna, News18, Hyderabad
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy). రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా.. ఆ తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. ఐతే మొన్నీమధ్య మళ్లీ రాజకీయాల్లోకి రీఎంట్రీ అంటూ హాడావిడి చేసిన కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు మళ్లీ సైలెంట్ అయ్యారు. ఇటీవల ఢిల్లీ (Delhi) వెళ్లొచ్చిన తరువాత కీలక ప్రకటన చేస్తారని అందరూ భావించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) పగ్గాలు మళ్లీ కిరణ్ కుమార్ రెడ్డికి ఇవ్వబోతున్నారనే ప్రచారం కూడా జోరుగా సాగింది. అయితే కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు కానీ ఆయన వచ్చిన తరువాత అందరూ ఉహించినట్లు ఎటువంటి ప్రకటన లేకపోగా ఆయన మళ్లీ రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ (Prashanth Kishore) కాంగ్రెస్ లో చేరుతారు అనే వార్తాలు వచ్చినప్పుడు ఏపీలో కూడా కీలక చర్చ జరగింది.
ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో చేరుతున్న నేపథ్యంలో ఏపీలో జగన్ (AP CM Jagan) పార్టీని కూడా ఆయన కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొమని సలహా ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఏపీలో ప్రస్తుతం అధికార పార్టీపైకి అన్ని పార్టీలు ఒక్క తాటిపైకి వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ తో వెళ్లెత్తే కాస్తయిన ఓట్లను చీల్చొచ్చనే సలహా ఆయన జగన్ కు ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ ప్రచారం జరగుతున్న నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చివరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కిరణ్ కుమార్ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపొచ్చింది. అయితే కిరణ్ కుమార్ రెడ్డి కూడా జగన్ కు కలుపుకొని ఏపీలో కాంగ్రెస్ కు మళ్లీ పూర్వవైభవం తీసుకోస్తే బాగుంటుందని సోనియా, రాహుల్ కు చెబుతారాని అందరు భావించారు.
కిరణ్ కుమార్ రెడ్డి డిల్లీ వెళ్లారు కానీ అందరూ ఉహించినట్లు ఆయన వచ్చిన తరువాత ఏపీలో కాంగ్రెస్ కు సంబంధించి ఒక్క ప్రకటన కూడా లేదు. దీంతో అసలు సోనియా గాంధీ.. కిరణ్ కుమార్ రెడ్డిని ఎందుకు హుటహుటిన ఢిల్లీకి రమ్మన్నారు..? ఏపీ కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకొని రావడానికి ఇద్దరి మధ్య ఎలాంటి చర్చ జరిగింది..? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఢిల్లీ వెళ్లిన కిరణ్ కుమార్ రెడ్డి సోనియా, రాహుల్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏపీలో ప్రస్తుతం కాంగ్రెస్ ఉన్న పరిస్థితిని పూర్తిగా కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరికి వివరించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం పరిస్థితుల్లో ఏపీలో కాంగ్రెస్ ను తాను గట్టెక్కించలేనని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఏపీలో కాంగ్రెస్ కు కేడర్ ఉన్నా నేతలు మాత్రం లేరని.. ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ లో జాయిన్ అవడానికి ఒక్కరు కూడా ముందుకు రారని ఆయన కుండబద్దలు కొట్టినట్లు వార్తలు వస్తున్నాయి. జగన్ పార్టీలో పొత్తు విషయంపై కూడా ఆయన సోనియాకు క్లారిటీ ఇచ్చినట్లు సమచారం. జగన్ పార్టీ కాంగ్రెస్ తో పోత్తు పెట్టుకోవడానికి సిధ్దంగా లేదని ఈ వ్యూహం కూడా వర్క్ అవుట్ కాదని చెప్పినట్లు తెలుస్తోంది. తనపై నమ్మకంతో తనను పిలిచి బాధ్యత తీసుకొమ్మనందుకు కృతజ్ఞతలు కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో తానే కాదు ఎవరు కూడా ఏపీలో కాంగ్రెస్ కు పూర్వవైభవం తీసుకురాలేదని ఆయన సూటిగా సోనియాకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ కు కాస్త పాజిటివ్ వేవ్ ఉందని.. అక్కడ దృష్టిపెడితే బాగుంటుందని కూడా ఆయన సలహా ఇచ్చినట్లు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Congress