హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Cabinet Updates: కేబినెట్ పై సీఎం జగన్ అనూహ్య నిర్ణయం.. ఆ 10 మందికి సెకండ్ ఛాన్స్..?

AP Cabinet Updates: కేబినెట్ పై సీఎం జగన్ అనూహ్య నిర్ణయం.. ఆ 10 మందికి సెకండ్ ఛాన్స్..?

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ (AP Cabinet Reshuffle) లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా..? అశావాహులకు గండికొట్టేలా సీఎం జగన్ నిర్ణయం తీసుకోబోతున్నారా..?

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ (AP Cabinet Reshuffle) లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా..? అశావాహులకు గండికొట్టేలా సీఎం జగన్ నిర్ణయం తీసుకోబోతున్నారా..?

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ (AP Cabinet Reshuffle) లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా..? అశావాహులకు గండికొట్టేలా సీఎం జగన్ నిర్ణయం తీసుకోబోతున్నారా..?

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ (AP Cabinet Reshuffle) లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా..? అశావాహులకు గండికొట్టేలా సీఎం జగన్ నిర్ణయం తీసుకోబోతున్నారా..? ముందుగా అనుకున్నంత మందికి పదవులు ఇవ్వలేకపోతున్నారా..? తాజా ప్రచారం చూస్తే అదే నిజమనిస్తోంది. పాత మంత్రుల్లో ఒకరిద్దరిని కొనసాగిస్తామని తొలుత సీఎం జగన్ చెప్పగా.. ఇప్పుడు ఆ సంఖ్య పెరిగినట్లు సమాచారం. ఏకంగా పది మంది వరకు కొనసాగిస్తారన్న ప్రచారం జరుగుతోంది. సీనియర్ మంత్రులు, ప్రభుత్వంలో తప్పకుండా ఉండాలని భావించే వారిని కొనసాగించాలని సీఎం అనుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే మంత్రులంతా రాజీనామాలు సమర్పించగా ఎవరికి మళ్లీ ఛాన్స్ దొరుకుతుందనేది చర్చనీయాంశమైంది. దీనిపై మరో రెండు రోజుల్లో సస్పెన్స్ వీడనుంది.

    కొనసాగే మంత్రుల్లో బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణు, గుమ్మనూరు జయరాం, అంజాద్ భాషా, బొత్స సత్యనారాయణ, తానేటి వనితతో పాటు మరో ఒకరిద్దరిని కొనగిస్తారనిన ప్రచారం జరుగుతోంది. టీమ్ మొత్తాన్ని మార్చేస్తే పాలనకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని సీఎం భావించారని.. అందుకే సమర్ధులైన పది మందికి మళ్లీ ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది. కొత్తగా 14 నుంచి 17 మంది కొత్త మంత్రులను తీసుకోనున్నారు. ప్రస్తుతమున్నవారిలో దాదాపు ఏడు నుంచి పది మందిని తీసుకుంటారని సమాచారం. కొత్త జిల్లాలు, కుల సమీకరణాల వారిగా మిగిలిన వారిని ఎంపిక చేస్తారన్న టాక్ వినిపిస్తోంది.

    ఇది చదవండి: ఏపీలో పరిశ్రమలకు పవర్ హాలిడే.. హోర్డింగులకూ విద్యుత్ బంద్.. మాల్స్ పైనా ఆంక్షలు..

    ఇందులో సామాజిక సమీకరణాలను కూడా దృష్టిలో పెట్టుకోనున్నారు. ఇప్పటికే బీసీల నుంచి 9 మందికి, ఎస్సీల నుంచి ఆరుగురికి, కాపుల నుంచి ముగ్గురు, రెడ్ల నుంచి ముగ్గురు, ఎస్టీల నుంచి ఒకరు, కమ్మ సామాజిక వర్గం నుంచి ఒకరు, మైనార్టీల నుంచి ఒకరికి అవకాశం కల్పించనున్నారు.

    ఇది చదవండి: ఊపిరి ఉన్నంత వరకు వారిని గుర్తుపెట్టుకుంటా.. మంత్రిగా పేర్ని నాని చివరి ప్రసంగం..

    బీసీల్లో ప్రస్తుత మంత్రులు గుమ్మనూరు జయరాం, చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణలను కొనసాగిస్తారన్న వార్తలు వస్తున్నాయి. వీరితో పాటు కొలుసు పార్థసారథి, జోగి రమేష్, విడదల రజిని, ఉష శ్రీచరణ్, పొన్నాడ సతీష్, తమ్మినేని సీతారామ్, ధర్మాన ప్రసాదరావు పేర్లు వినిపిస్తున్నాయి. ఎస్సీ వర్గం నుంచి మేరుగ నాగార్జున, ఎలీజాతో పాటు మరికొందరి పేర్లు ప్రచారంలో ఉన్నాయి.

    ఇది చదవండి: కేబినెట్లో కులాల లెక్కలు ఇవేనా..! వారికే సీఎం పెద్దపీట.. తగ్గనున్న రెడ్డి, కాపు మంత్రుల సంఖ్య..?

    రెడ్డి సామాజిక వర్గంలో నెల్లూరు జిల్లా నుంచి కాకాణి గోవర్ధన్ రెడ్డి, కర్నూలు నుంచి ఒకరికిస్తారన్న ప్రచారం జరుగుతోంది. చిత్తూరు నుంచి చెవిరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి పేర్లు ప్రచారంలో ఉన్నా పెద్దిరెడ్డిని కంటిన్యూ చేయనున్నారు. కాపు సామాజిక వర్గంలో ముగ్గురికి ఛాన్స్ దక్కనుందట. గతంలో నలుగురు కాపులు మంత్రివర్గంలో ఉండగా ఈసారి మూడు తగ్గించినట్లు తెలుస్తోంది. వీరిలో దాడిశెట్టి రాజా, గుడివాడ అమర్నాథ్ తో పాటు సామినేని ఉదయభాను, అంబటి రాంబాబులో ఒకరికి ఇచ్చే అవకాశమంది. కమ్మ సామాజిక వర్గం నుంచి కొడాలి నానిని తప్పిస్తే ఆయన స్థానంలో  మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి పేర్లు వినిపిస్తున్నాయి.

    ఇది చదవండి: జిల్లాల విభజన రోజాకు ప్లస్ గా మారిందా..? శుభవార్త వినబోతున్నారా..?

    ఇక ఎస్టీ కోటాలో సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర, పాలకొండ ఎమ్మెల్యే కళావతి, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి బాగ్యలక్ష్మి పోటీపడుతున్నారు. మైనార్టీలో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ రేసులో ఉన్నారు. ఐతే కులాలతో పాటు జిల్లాల వారిగా రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని సీఎం జగన్ మంత్రులను ఎంపిక చేయనున్నారు.

    First published:

    Tags: Andhra Pradesh, AP cabinet, Ap cm ys jagan mohan reddy

    ఉత్తమ కథలు