AP POLITICS SPECULATIONS OVER CENTRAL GOVERNMENT STARTED PROCESS TO INCREASE ASSEMBLY SEATS IN ANDHRA PRADESH AND TELANGANA FULL DETAILS HERE PRN GNT
Breaking: తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుకు రంగం సిద్ధం..? కసరత్తు మొదలెట్టిన కేంద్రం.. త్వరలోనే పార్లమెంట్లో బిల్లు..?
ప్రతీకాత్మక చిత్రం
తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలకు కేంద్రం శుభవార్త చెప్పినట్లు తెలుస్తోంది. ఎనిమిదేళ్లుగా ఇటు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), అటు తెలంగాణ (Telangana) రాష్ట్రాలు ఆశిస్తున్నట్లు అసెంబ్లీ సీట్ల పెంపు అంశంపై కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలకు కేంద్రం శుభవార్త చెప్పినట్లు తెలుస్తోంది. ఎనిమిదేళ్లుగా ఇటు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), అటు తెలంగాణ (Telangana) రాష్ట్రాలు ఆశిస్తున్నట్లు అసెంబ్లీ సీట్ల పెంపు అంశంపై కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన చట్టంలోని హామీల ప్రకారం ఏపీలో ఉన్న స్థానాలను 175 నుంచి 225కి పెంచే విధంగా.. అలాగే తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ సీట్లను 153 పెంచే ప్రక్రియకు కేంద్రం శ్రీకారం చుట్టినట్లు సమాచారం. ఈ మేరకు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణపై పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టేందుకు అనువుగా అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్ పంపాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కేంద్ర న్యాయ శాఖ కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వీలైనంత త్వరగా రిపోర్ట్ వెళ్తే.. వర్షాకాల సమావేశాల్లోనే బిల్లు పార్లమెంట్ ముందుకు వచ్చే అవకాశముంది. ఐతే దీనిపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఇంతవరకు స్పందించలేదు.
ఇదే అంశంపై మరోసారి కేంద్రం పూర్తి క్లారిటీ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన 2031 తర్వాతే ఉంటుందని స్పష్టం చేసింది. అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి గతేడాది ఆగస్టులో జరిగిన సమావేశాల సందర్భంగా లోక్సభలో ప్రశ్నించారు. ఏపీ విభజన చట్టం ప్రకారం తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 నియోజకవర్గాలను 153 నియోజకవర్గాలుగా పెంచాల్సిన అవసరం ఉందన.., ఈ దిశగా కేంద్రం ఎప్పుడు చర్యలు తీసుకుంటుందని అప్పట్లో అడిగారు.
దీనిపై స్పందించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్... తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు ఇప్పట్లో లేదని స్పష్టం చేశారు. రాజ్యంగంలోని ఆర్టికల్ 170లో చెప్పినట్లు 2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని నిత్యానంద్ రాయ్ వివరించారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న 175 నియోజకవర్గాలను 225కు పెంచుతారు. అలాగే తెలంగాణలోని 119 నియోజకవర్గాలను 153కు పెంచుతారు.
గతేడాది లోక్ సభలో కేంద్రమే 2031 వరకు పెంపు లేదని స్పష్టం చేసిన నేపథ్యంలో నియోజకవర్గాల పెంపుకు సంబంధించి ఇంత హడావిడిగా కసరత్తు మొదలుపెట్టిందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఐతే కాశ్మీర్ లో ఇటీవలే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టిన కేంద్రం తెలంగాణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గాల పెంపుపై కసరత్తు చేస్తోందన్న వాదన వినిపిస్తోంది. తెలంగాణలో వచ్చే ఏడాదిలోనే ఎన్నికలుండటంతో ఈలోగా ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్రం చూస్తోందన్న చర్చ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పట్లో సాధ్యం కాదనుకున్న నియోజకవర్గాల పెంపు నిజంగానే ఉంటుందా..? ఒకవేళ అదే నిజమైతే ఏ రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాలు వస్తాయి.. ఈ ప్రక్రియ ఎవరికి ప్లస్ అవుతుందనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..!
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.