హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP-TS Water War: పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ ఏపీ..? కేంద్రం గెజిట్ తో సీమకు ఒరిగేదేం లేదా

AP-TS Water War: పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ ఏపీ..? కేంద్రం గెజిట్ తో సీమకు ఒరిగేదేం లేదా

ఫ్రతీకాత్మక చిత్రం

ఫ్రతీకాత్మక చిత్రం

విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల మధ్య పలు అంశాల్లో మాటమాట పెరిగినా.. నదీ జలాల విషయంలో మాత్రం వైరం ముదిరింది.

అన్నా రఘు, గుంటూరు ప్రతినిధి, న్యూస్18

విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల మధ్య పలు అంశాల్లో మాటమాట పెరిగినా.. నదీ జలాల విషయంలో మాత్రం వైరం ముదిరింది. అప్పటివరకు స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అంటూ స్నేహగీతాలు పాడుకున్న ఆంధ్ర -తెలంగాణ ముఖ్యమంత్రులు ఉన్నట్టుండి ఏమైందో ఏమోకానీ నీటి యుధ్ధానికి తెరతీశారు. కృష్ణా నదిలో నీటి వాడకంపై ఇరు రాష్ట్రాల మధ్య ముదిరిన వివాదం చివరికి చిలికి చిలికి గాలివానలా మారింది. అంతటితో ఆగకుండా కృష్ణాజలాల నీటి సమస్యపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తూ లేఖ కూడా రాశారు. అసలే తమకు కొరుకుడు పడకుండా ఉన్న కే.సి.ఆర్ పై జగన్ లేఖ రూపంలో ఫిర్యాదు అందడంతో వెంటనే కేంద్రం ఓ గెజిట్ నోటిఫికేషన్ ను విడుదలచేసింది. ఐతే ఇరురాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీ విషయమై పరిష్కారం చూపమని జగన్ కోరితే.., కృష్టాతో పాటు గోదావరి నీటి అజమాయిషీని కూడా కేంద్రం తనగుప్పిట్లో పెట్టుకోవడం ఇక్కడ గమనించవలసిన విషయం. కృష్ణా గోదావరి నీటి వివాదంపై కేంద్రం వ్యవహరించిన తీరు పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్టు ఉందంటున్నారు మేధావులు.

కేంద్ర విడుదలచేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఇక నుండి కృష్ణా-గోదావరి నీటి పంపకం కేంద్ర చేతుల్లోకి వెళుతుంది. ఇక నుండి ఈ రెండు నదులపై ఉన్న ప్రాజెక్టులలో ఏ అవసరానికి నీటిని విడుదల చేయాలన్నా కేంద్రం అనుమతి తప్పనిసరి. పైగా కొత్తగా ఏర్పాటు అయ్యే బోర్డు నిర్వహణ ఖర్ఛుల క్రింద ఏ.పి -తెలంగాణలు ఏటా చేరి 200కోట్లు జమచేయవలసి ఉంటుంది. రెండు నదులపై ఉండే ప్రాజెక్టుల వద్ద కేంద్ర బలగాలు తమ ఆధీనంలోకి తీసుకుంటాయి.

ఇది చదవండి: సాయిరెడ్డికి, జ‌గ‌న్ కు మ‌ధ్య గ్యాప్ వచ్చిందా...? అసలు కారణం ఇదేనా..?


అన్ని ప్రాజెక్టులకూ సరైన నీటి కేటాయింపులు చేయకుండా గెజిట్ విడుదల చేయడం ఏంటని తెలంగాణ ప్రభుత్వం గరం గరం అవుతుంటే.. తమ లేఖవల్లే గెజిట్ నోటిఫికేషన్ విడుదలైందని ఆంధ్ర ప్రభుత్వం చంకలు గుద్దుకుంటుంది. ఐతే కొత్తగా వచ్చిన గెజిట్ వల్ల తెలంగాణకి కొంతమేర ఇబ్బంది అనే అంటున్నారు మేధావులు. ఇక ఆంధ్రాలో కృష్ణా డెల్టా ప్రాంతానికి మేలు జరిగినా రాయలసీమకు మాత్రం పూర్తిగా అన్యాయమే జరుగుతుందనేది విశ్లేషకుల మాట.

ఇది చదవండి: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. బస్ టికెట్ తో పాటే దర్శనం టోకెన్..


అసలు వివాదమే రాయలసీమ ఎత్తిపోతల నుండి మొదలైన నేపధ్యంలో ఆ ప్రాజెక్ట్ ను కేంద్రం గుర్తించకపోవడం రాయలసీమ వాసులకు మరిన్ని నీటి కష్టాలు తీసుకు వస్తుందనడంలో సందేహం లేదు.కేంద్రంతో పోరాడి రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ కు గుర్తింపు తెచ్చి ఆప్రాంతానికి నీరు అందించడంలో జగన్ ఎంత వరకు విజయం సాధిస్తారో చూడాలి..?

ఇది చదవండి: చెల్లెలితో రాసలీలలు.. అక్క మెడలో తాళి.. వీడు మాములోడు కాదు..

First published:

Tags: Andhra Pradesh, Krishna River Management Board

ఉత్తమ కథలు