హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Cabinet Caste Equations: కేబినెట్లో కులాల లెక్కలు ఇవేనా..! వారికే సీఎం పెద్దపీట.. తగ్గనున్న రెడ్డి, కాపు మంత్రుల సంఖ్య..?

AP Cabinet Caste Equations: కేబినెట్లో కులాల లెక్కలు ఇవేనా..! వారికే సీఎం పెద్దపీట.. తగ్గనున్న రెడ్డి, కాపు మంత్రుల సంఖ్య..?

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రివర్గ వ్యవస్థీకరణ (AP Cabinet Reshuffle) కు ఇప్పటికే ముహూర్తం కుదిరింది. ఈనెల 11వ తేదీన కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రివర్గ వ్యవస్థీకరణ (AP Cabinet Reshuffle) కు ఇప్పటికే ముహూర్తం కుదిరింది. ఈనెల 11వ తేదీన కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రివర్గ వ్యవస్థీకరణ (AP Cabinet Reshuffle) కు ఇప్పటికే ముహూర్తం కుదిరింది. ఈనెల 11వ తేదీన కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రివర్గ వ్యవస్థీకరణ (AP Cabinet Reshuffle) కు ఇప్పటికే ముహూర్తం కుదిరింది. ఈనెల 11వ తేదీన కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే గురువారం ప్రస్తుత మంత్రివర్గ చివరి సమావేశం జరగబోతోంది. ఈ సమావేశం తర్వాత మంత్రులను రాజీనామా చేయాల్సిందిగా సీఎం కోరబోతున్నారు. ఈ నేరథ్యంలో కొత్త మంత్రులపై సర్వత్రా చర్చ జరుగతోంది. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలకు పార్టీ అధిష్టానం సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది. మొదటి విడతలో మాదిరిగానే ఇప్పుడు కూడా సామాజిక సమీకరణాలకే సీఎం పెద్దపీట వేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఐతే అప్పటికంటే ఇప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నారట. ముఖ్యంగా బీసీలు, ఎస్సీలకు కేబినెట్ లో ఎక్కువ స్థానాలు కేటాయించాలని సీఎం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

  కొత్త కేబినెట్ లో తొమ్మిది మంది బీసీలు, ఆరుగురు ఎస్సీలు, ముగ్గురు కాపులు, ముగ్గురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు, ఇద్దరు ఎస్టలు, ఒక కమ్మ, ఒక మైనార్టీ వర్గానికి చెందిన వారికి అవకాశం ఇవ్వాలని జగన్ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఐతే వైశ్య, బ్రాహ్మణ సామాజిక వర్గాలకు చోటు ఉంటుందా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. వీటిలో చివరి నిముషంలో చిన్నచిన్న మార్పులు జరిగే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.

  ఇది చదవండి: జిల్లాల విభజన రోజాకు ప్లస్ గా మారిందా..? సాయంత్రమే శుభవార్త వినబోతున్నారా..?

  బీసీల్లో ప్రస్తుత మంత్రులు గుమ్మనూరు జయరాం, చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణలను కొనసాగిస్తారన్న వార్తలు వస్తున్నాయి. వీరితో పాటు కొలుసు పార్థసారథి, జోగి రమేష్, విడదల రజిని, ఉష శ్రీచరణ్, పొన్నాడ సతీష్, తమ్మినేని సీతారామ్, ధర్మాన ప్రసాదరావు పేర్లు వినిపిస్తున్నాయి. ఎస్సీ వర్గం నుంచి మేరుగ నాగార్జున, ఎలీజాతో పాటు మరికొందరి పేర్లు ప్రచారంలో ఉన్నాయి.

  ఇది చదవండి: ఏపీలో భారీగా పెరిగిన భూముల ధరలు.. విజయవాడలో గజం ఎంతంటే..!

  రెడ్డి సామాజిక వర్గంలో నెల్లూరు జిల్లా నుంచి కాకాణి గోవర్ధన్ రెడ్డి, కర్నూలు నుంచి శిల్పా చక్రపాణి రెడ్డితో పాటు రోజా, చెవిరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కాపు సామాజిక వర్గంలో ముగ్గురికి ఛాన్స్ దక్కనుందట. గతంలో నలుగురు కాపులు మంత్రివర్గంలో ఉండగా ఈసారి మూడు తగ్గించినట్లు తెలుస్తోంది. వీరిలో దాడిశెట్టి రాజా, గుడివాడ అమర్నాథ్ తో పాటు సామినేని ఉదయభాను, అంబటి రాంబాబులో ఒకరికి ఇచ్చే అవకాశమంది. కమ్మ సామాజిక వర్గం నుంచి కొడాలి నాని స్థానంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి పేర్లు వినిపిస్తున్నాయి.

  ఇది చదవండి: మంత్రులకు లాస్ట్ వర్కింగ్ డే.. సీఎం జగన్ నిర్ణయంపై సస్పెన్స్..

  ఇక ఎస్టీ కోటాలో సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర, పాలకొండ ఎమ్మెల్యే కళావతి, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి బాగ్యలక్ష్మి పోటీపడుతున్నారు. మైనార్టీలో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ రేసులో ఉన్నారు. ఐతే కులాలతో పాటు జిల్లాల వారిగా రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని సీఎం జగన్ మంత్రులను ఎంపిక చేయనున్నారు.

  First published:

  Tags: Andhra Pradesh, AP cabinet, Ap cm ys jagan mohan reddy

  ఉత్తమ కథలు