హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Cabinet: కేబినెట్ లో కొనసాగేది వీరేనా..? సీఎం జగన్ మనసులో ఏముంది..? ఆ ఇద్దరి పరిస్థితి ఏంటి..?

AP Cabinet: కేబినెట్ లో కొనసాగేది వీరేనా..? సీఎం జగన్ మనసులో ఏముంది..? ఆ ఇద్దరి పరిస్థితి ఏంటి..?

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ (CM YS Jagan)  రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ టాపిక్ ఎత్తడంతో ఇప్పుడు ఎక్కడ చూసినా మంత్రివర్గంపైనే చర్చ జరుగుతోంది. జగన్ టీమ్ లో ఉండేదెవరు.. బయటకు వెళ్లేదెవరనేదానిపై జోరుగా చర్చ జరుగుతోంది.

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ (CM YS Jagan) రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ టాపిక్ ఎత్తడంతో ఇప్పుడు ఎక్కడ చూసినా మంత్రివర్గంపైనే చర్చ జరుగుతోంది. జగన్ టీమ్ లో ఉండేదెవరు.. బయటకు వెళ్లేదెవరనేదానిపై జోరుగా చర్చ జరుగుతోంది. ప్రమాణ స్వీకారం సమయంలోనే రెండున్నరేళ్ల తర్వాత మార్పులుంటాయని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లయినప్పటి నుంచి రాష్ట్ర రాజకీయాల్లో మంత్రుల పదవులపైనే చర్చ జరుగుతోంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై స్వయంగా ముఖ్యమంత్రే మాట్లాడటంతో వీలైనంత త్వరగానే ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఉగాదినాటికి కొత్త జిల్లాలు, కొత్త పాలన ఉండాలని సీఎం భావిస్తున్నందున.. ఈలోగానే మంత్రుల లెక్కలు కూడా తేల్చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సీఎం జగన్ మంత్రుల మార్పులపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

    మంత్రులుగా కొనసాగేవారి లిస్టులో నలుగురైదుగురి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వీరిలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సమాచార శాక మంత్రి పేర్ని నాని, పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానితో పాటు ఆర్ధిక మంత్రి బుగ్గన పేరు కూడా వినిపిస్తోంది. ఐతే ఈనెల 15న వైఎస్ఆర్‌సీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ భేటీలో కేబినెట్ కూర్పుపై క్లారిటీ రానుంది.

    ఇది చదవండి: త్వరలోనే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ.. క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

    మంత్రులుగా కంటిన్యూ అవుతురానుకున్నవారిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాయలసీమలో కీలకంగా ఉన్నారు. కుప్పంలో చంద్రబాబుకు ధీటుగా బదులివ్వడంలో కీలకంగా ఉన్నారు. ఇక ఉత్తరాంధ్రలో మంత్రి బొత్స సత్యనారాయణ చాలా సీనియర్ నేత, పార్టీకి కూడా చాలా కీలకం అందుకే ఆయన్ను కొనసాగించే అవకాశాలున్నాయంటున్నారు.

    ఇది చదవండి: ఏపీ బడ్జెట్ కేటాయింపులు ఇలా.. ఏ రంగానికి ఎంత ఇచ్చారంటే..!

    మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని కొనసాగింపుపై చర్చ జరుగుతోంది. మంత్రులిద్దరూ ప్రభుత్వ వాయిస్ ను గట్టిగా వినిపించడంతో పాటు రాజకీయంగానూ ప్రత్యర్థులకు కౌంటర్లిస్తున్నారు. టీడీపీపై కొడాలి నాని, జనసేనపై పేర్ని నాని ఢీ అంటే ఢీ అనే విధంగా విరుచుకుపడుతున్నారు. ఐతే ఒకే జిల్లా నుంచి ఇద్దర్ని కంటిన్యూ చేస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఆర్ధిక మంత్రిగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రభుత్వంలో కీలక పాత్రపోషిస్తున్నారు. రాష్ట్రానికి అప్పులు తీసుకురావడం, కేంద్ర నిధులు సాధించడంలో ఆయన కృషి చేస్తుండటంతో బుగ్గన పదవికి కూడా ఢోకా లేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

    ఇది చదవండి: జాతీయ స్థాయిలో సీఎం జగన్ రికార్డు.. వరుసగా మూడోసారి టాప్ ప్లేస్..

    ఇదిలా ఉంటే ఏడాదిన్నర క్రితం కేబినెట్ లోకి వచ్చిన మంత్రులు సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణను కొనసాగిస్తారా.. లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. అందరికీ దాదాపు మూడేళ్లపాటు అవకాశమిచ్చిన సీఎం.. తమను కొనసాగిస్తారన్న ఆశాభావంతో ఉన్నారు. మరి సీఎం మనసులో ఎవరున్నారు..? ప్రొగ్రెస్ రిపోర్టుల్లో ఎవరికి ఎక్కువ మార్కులొచ్చాయనేది తెలియాల్సి ఉంది.

    First published:

    Tags: Andhra Pradesh, AP cabinet, Ap cm ys jagan mohan reddy

    ఉత్తమ కథలు