AP POLITICS SPECULATIONS OVER AP GOVERNMENT STOPPED FREE ELECTRICITY SCHEME IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN GNT
AP Govt Schemes: మరో పథకానికి జగన్ సర్కార్ మంగళం..? లబ్ధిదారులను సైలెంట్ గా తప్పిస్తున్నారా..?
వైఎస్ జగన్ (File)
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను (AP Welfare Schemes) అమలు చేస్తోంది. ప్రతి నెలా అర్హుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తోంది. కొన్ని పథకాలను సబ్సిడీ కింద అమలు చేస్తోంది. కొన్నింటిని ఉచితంగానే అందిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను (AP Welfare Schemes) అమలు చేస్తోంది. ప్రతి నెలా అర్హుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తోంది. కొన్ని పథకాలను సబ్సిడీ కింద అమలు చేస్తోంది. కొన్నింటిని ఉచితంగానే అందిస్తోంది. ఇందులో భాగంగా ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ పథకం కూడా అమలవుతోంది. జగ్జివన్ జ్యోతి పథకం (Jagjeevan Jyothi Scheme) కింద ఎస్సీ, ఎస్టీ లకు ఉచిత విద్యుత్ అందిస్తోంది. ఈ పథకం కింద నెలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తోంది. అంటే 200 యూనిట్లలోపు వినియోగిస్తే ఎలాంటి బిల్లు వేయరు. ఐతే ఇప్పుడీ పథకం అమలు కావడం లేదంటూ లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. అంతేకాదు జగన్ సర్కార్ పథకాన్ని సైలెంట్ గా నిలిపేసిందంటూ ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి.
ఈ నెల నుంచి జగ్జీవన్ జ్యోతీ పథకాన్ని నిలిపేశారంటూ గుంటూరు కోబాల్ట్ పేటకు చెందిన కొందరు లబ్ధిదాదురులు కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగడం కలకలం రేపుతోంది. ఎస్సీ, ఎస్టీలకుగా అందించే ఉచిత విద్యుత్ లోనూ కోతలు పెట్టేశారని.., 200 యూనిట్ల వరకు ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు ప్రకటించిన జగన్.. ఇప్పుడు అదే పధకానికి తూట్లు పొడిచేలా కొత్త నిర్ణయం తీసుకున్నారంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
నిన్నటి వరకు ఎస్టీ, ఎస్సీలు జాబితాలో ఉంటూ 200 యూనిట్లు రాయతీ పొందిన వారు తాజాగా అర్హత కోల్పోయారు. గత నెల వరకు అర్హత ఉన్న వారంతా ఈనెలలో అనర్హుల జాబితాలో చేరిపోయారు. ఒక్క నెలలో ఇలా దాదాపు లక్షా 40వేల మంది విద్యుత్ రాయతీకి అనర్హులుగా నిర్ధారించి పథకాన్ని నిలిపేసినట్లు విమర్శలు వస్తున్నాయి. దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.600 కోట్లు మిగులుతుందని ప్రతిపక్షాలంటున్నాయి.
అంతే కాకుండా దళిత కాలనీల్లో ఉన్న వారికే ఈ పధకం వర్తిస్తుందని చెప్పడంపై కూడా విపక్షాలు మండిపడుతున్నాయి. అర్బన్, మండల కేంద్రాల్లో దళిత కాలనీలు ఉండవని తెలిసి కూడా ఇలా నిబంధనలు ఎలా మారుస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. దళితులను కాలనీల్లో మాత్రమే ఉండాలనే విధంగా ప్రభుత్వం తీరు ఉందని, రాయతీలు వర్తించాలంటే దళిత కాలనీల్లోనే ఉండాలని చెప్పడం దుర్మార్గంగా అభివర్ణించారు. అంటే ప్రభుత్వమే దళితులను ఇతర వర్గాల నుంచి వేరు చేసే విధంగా చర్యలు చేపడుతుందని, దీనిని దళిత సంఘాలన్నీ జగన్ ను నిలదీయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం కుంటి సాకులు చెప్పి రద్దు చేస్తున్నారని, క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇవ్వాలనే నిబంధన సరికాదంట్నారు. జగజ్జీవన్ జ్యోతి పధకానికి తూట్లు పొడుస్తూ, కేంద్రం ఆదేశాలకు జగన్ సర్కార్ లొంగిపోయి పని చేస్తుందని సీపీఎం నేత బాబూరావు విమర్శించారు. గతంలో రైతులు, ఇప్పుడు దళితులు, గిరిజనులకు కోత పెట్టి మోసం చేశారని, దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోరాటాలను ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.
గుంటూరు నగరానికి చెందిన ఎం దీనమ్మ మాట్లాడుతూ తనకు ఒక కనెక్షన్ మాత్రమే ఉందని గత రేడు సంవత్సరాలలో రెండు వందల యూనిట్ల వినియోగం దాట లేదని అయినా ఎస్సీలకు ఇచ్చే జగ్జివన్ జ్యోతి విద్యుత్ రాయితీ తనకు అందుతుందని..., కానీ ఈ నెల 109 యూనిట్లు మాత్రమే వాడుకున్న రూ.332 బిల్లు వేశారని వాపోయింది. ఐతే జగ్జీవన్ జ్యోతి పథకాన్ని నిజంగానే నిలిపేస్తున్నారా..? లబ్ధిదారులు, ప్రతిపక్ష నేతలు ఆరోపణలు వాస్తమేనా..? ఈ విషయాలపై సంబంధిత మంత్రిగానీ, అధికారులుగానీ వివిరణ ఇవ్వాల్సి ఉంది.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.