Home /News /andhra-pradesh /

AP POLITICS SPECULATIONS OVER AP CM YS JAGANMOHAN REDDY MIGHT GIVE OTHER RESPONSIBILITIES TO YV SUBBAREDDY AFTER COMPLETION OF TTD CHAIRMANSHIP FULL DETAILS HERE PRN GNT

YV Subba Reddy: బాబాయిని హస్తిన కు పంపే యోచనలో సీఎం జగన్..? ఆ జీవో వెనుక అసలు నిజం ఇదేనా..?

వైవీ సుబ్బారెడ్డి (ఫైల్)

వైవీ సుబ్బారెడ్డి (ఫైల్)

టీటీడీకి (TTD) స్పెసిఫైడ్ అథారిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) పదవీకాలం పొడిగించడం లేదన్నది స్పష్టమైంది.

  అన్నా రఘు, గుంటూరు ప్రతినిధి, న్యూస్18

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడల్లా నెలకొనే హడావిడి అంతాఇంతా కాదు. జగన్ హస్తిన టూర్ ఎలా ఉండబోతోంది..? అక్కడ ఆయన ఎవరెవర్ని కలవబోతున్నారు..? ఏయే అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తారు..? ఇలాంటి అంశాలే రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమవుతుంటాయి. ఇక కరోనా సమయం కావడంతో వ్యాక్సినేషన్, వైద్య సదుపాయలకు నిధులు కూడా సీఎం ఢిల్లీ పర్యటన అజెండాలో ఉంటూ వస్తున్నాయి. జగన్ ఢిల్లీ పర్యటన షెడ్యూల్, ఆయన వెళ్లడం వరకు అంతా బాగానే సాగుతున్నా.. కేంద్ర పెద్దలతో అపాయింట్ మెంట్ విషయంలో మాత్రం కొంత గందరగోళం ఏర్పడుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఓసారి ఢిల్లీ వెళ్లిన సమయంలో చివరి నిముషం వరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన ఖరారు లేదు. ఐతే హస్తినలో వైసీపీ వ్యవహారాలు చూస్తున్న ఆ పార్టీ ఎం.పి బాలశౌరి బలమైన లాబీయింగ్ నెరపటంలో అంచనాలను అందుకోలేకపోతున్నారని విరమ్శ ఉంది. ఈ విషయావ్ని వైసీపీ వర్గాలో బహిరంగా చర్చించుకున్న సందర్భాలు లేకపోలేదు.

  దీంతో ఢిల్లీలో రాష్ట్ర వ్యవహారాలు చక్కబెట్టేందుకు బలమైన వ్యక్తిని నియమించాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బాధ్యతను కొంతకాలం వైసీపీ పార్లెమంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి చూడగా.. ప్రస్తుతం ఆయన ఉత్తరాంధ్ర బాధ్యతల్లో బిజీగా ఉంటున్నారు. దీంతో హస్తినకు, ఏపీ ప్రభుత్వానికి వారధిగా ఉండేందుకు తన సొంతబాబాయి అయిన వైవీ సుబ్బారెడ్డిని ఢిల్లీకి పంపాలని జగన్ యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీటీడీ ఛైర్మన్ గా ఉన్న ఆయన పదవీ కాలం ఇటీవలే ముగిసింది. పాలకమండలి స్థానంలో స్పెసిఫైడ్ అథారిటీని కూడా ప్రభుత్వం నియమించింది. తొలుత వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం మరో ఏడాది పొడిగిస్తారన్న ప్రచారం జరిగింది. కానీ స్పెసిఫైడ్ అథారిటీ ప్రకటన వచ్చిన తర్వాత పొడింపు వార్తలు ఊహాగానాలేనని తేలిపోయాయి.

  ఇది చదవండి: అదే జరిగితే ఒక్కో స్టూడెంట్‌కు రూ.కోటి ఇవ్వాలి.. ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టు హెచ్చరిక..


  ప్రభుత్వ తాజా నిర్ణయంతో సీఎం జగన్.. వైవీ సుబ్బారెడ్డిని రాజ్యసభ పదవిని కట్టబెట్టి ఢిల్లీకి పంపుతారన్న చర్చకు బలం చేకూరినట్లైంది. గత ఎన్నికల ముందు ఒంగోలు సిట్టింగ్ ఎంపీగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి 2019 ఎన్నికల్లో తన సీటును వదులుకున్నారు. వైసీపీ విజయం సాధించిన తర్వాత సీఎం జగన్ ఆయనను టీటీడీ ఛైర్మన్ గా నియమించారు. అప్పటి నుంచి పదవీకాలం ముగిసేవరకు తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ధికి పనిచేశారు. సీఎం జగన్ తనకు మరోసారి అవకాశమిస్తే పనిచేస్తానని.. లేదంటే లేదని ఇటీవల వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు.

  ఇది చదవండి: ఎమ్మెల్యే రోజాకు మంత్రిపదవి ఖాయమైందా..? ఆమె కల నిజమైనట్లేనా..?


  ప్రభుత్వం స్పెసిఫైడ్ అథారిటీని నియమించడంతో వైవీ పదవీ కాలాన్ని పొడిగించడం లేదన్న దాదాపు స్పష్టమైన నేపథ్యంలో ఆయన్న ఢిల్లీ పంపిస్తారనే టాక్ ఊపందుకుంది. టీటీడీ ఛైర్మన్ లాంటి ప్రాముఖ్యమున్న పదవిని వదులుకొని ఆయన ఢిల్లీ వెళ్తారా..? కేంద్ర ప్రభుత్వ పెద్దల అపాయింట్ మెంట్లు, ఇతర పనుల కోసం లాబియింగ్ చేస్తారా..? బాబాయ్ మనసులో ఏముందో అబ్బాయికి చెప్తారా..? లేక అబ్బాయి అప్పజెప్పిన బాధ్యతను నెరవేరుస్తారా..? అనేది వేచి చూడాల్సిందే..!
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ysrcp, YV Subba Reddy

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు