హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Politics: ఏపీలో ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధమైందా..? అమిత్ షాతో చర్చ లీక్..?

AP Politics: ఏపీలో ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధమైందా..? అమిత్ షాతో చర్చ లీక్..?

వైఎస్ జగన్ (ఫైల్)

వైఎస్ జగన్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధమతోందా..? ఏడాది ముందుగానే ఎన్నికలు జరుగుతాయా..? ఈ అంశంలో సీఎం జగన్ (CM YS Jagan) కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధమతోందా..? ఏడాది ముందుగానే ఎన్నికలు జరుగుతాయా..? ఈ అంశంలో సీఎం జగన్ (CM YS Jagan) కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా..? ప్రస్తుతం ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఇదే టాపిక్ పై చర్చ జరుగుతోంది. ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు ముందస్తు ఊహాగానాలకు మరింత ఊతమిస్తున్నాయి. గత కొన్నినెలలుగా ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమనే ప్రచారం జరుగుతుండగా.. వైసీపీ నేతలు ఖండిస్తూ వస్తున్నారు. సీఎం జగన్ మంచిపాలన అందిస్తుంటే ముందస్తుకు వెళ్లాల్సిన అవసరమేంటని ప్రశ్నిస్తున్నారు. ఐతే గత నెలలో వైసీపీ కీలక నేత సజ్జల చేసిన కామెంట్స్.. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జగన్ భేటీలో జరిగిన చర్చతో ముందస్తు ఎన్నికలకు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఏడాది, రెండేళ్లలో ఎన్నికలకు వెళ్లబోతున్నామని గత నెలలో సజ్జల రామకృష్ణా రెడ్డి హింట్ ఇచ్చారు. తాజాగా ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జగన్ భేటీ అయినప్పుడు అసెంబ్లీ రద్దు గురించి చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి. తాము ముందస్తు ఎన్నికలకు వెళ్తామని జగన్.., అమిత్ షాకు తెలిపినట్లు సమాచారం. ఈ విషయం వైసీపీ ఎంపీల ద్వారానే లీక్ అయ్యిందని కూడా తుసత్ట. తనకు జగన్ కు మధ్య జరిగిన సంభాషణ గురించి అమిత్ షా... మరో కేంద్ర మంత్రికి తెలపగా.. ఆయన ఆ మాటల్ని వైసీపీ ఎంపీల దగ్గర ప్రస్తావించినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఇది చదవండి: ఏపీకి జేపీ నడ్డా.. జనసేన డిమాండ్ పై స్పందిస్తారా.. పొత్తు ముందుకెళ్తుందా..?


ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని సీఎం జగన్ సర్వేల ద్వారా తెలుసుకున్నారని.. అందుకే ముందుగానే ఎన్నికలకు వెళ్తే.. గట్టెక్కొచ్చని ఆయన భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే సీఎం కూడా ముందస్తు ఎన్నికల ఆలోచనతో ఉన్నట్లు వైసీపీలో చర్చ జరుగుతోందట.

ఇందులో భాగంగానే ఆయన గడప గడపకు మన ప్రభుత్వం, సామాజిక న్యాయభేరీ బస్సు యాత్ర వంటి కార్యక్రమాలకు పిలుపునిచ్చినట్లు సమాచారం. అలాగే ఈనెల 23న ఆత్మకూరు ఉపఎన్నికను ముందస్తుకు సన్నాహకంగా భావించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఆత్మకూరులో భారీ మెజార్టీ సాధించి ప్రభుత్వానికి ఆదరణ తగ్గలేదనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశముందట.

ఇది చదవండి: అమ్మఒడి జాబితాలో మీ పేరు లేదా.. అయితే ఇలా చేయండి..


ఇదిలా ఉంటే ప్రతిపక్షాల పొత్తు రాజకీయాలకు.. ముందస్తు ఎన్నికల ద్వారా బ్రేక్ వేయాలనేది జగన్ వ్యూహంగా తెలుస్తోంది. జనసేనతో టీడీపీ కలిస్తే.. బీజేపీ దూరంగా ఉంటుందని భావిస్తున్న జగన్.. ప్రభుత్వ వ్యతిరేకత చీలి విజయం దక్కిందనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈసారి టీడీపీ గెలుపును అడ్డుకుంటే భవిష్యత్తులో తిరుగుండదనేది జగన్ స్కెచ్ గా ఉంది. మరి ముందస్తు ఎన్నికల ప్రచారానికి క్లారిటీ రావాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే..!

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy

ఉత్తమ కథలు