Home /News /andhra-pradesh /

AP POLITICS SPECULATIONS ON YCP MLA UNDAVALLI SRIDEVI WILL NOT GET TICKET IN 2024 ELECTIONS FOR THIS REASON FULL DETAILS HERE PRN GNT

YSRCP: ఆ వైసీపీ మహిళా ఎమ్మెల్యేకు ఈసారి నో టికెట్..? ఆమె కూడా ఫిక్సైపోయారా..?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

టీడీపీ (TDP) కి అంతా పాజిటివ్ అనుకున్న అమరావతి (Amaravati) ప్రాంతంలో వైసీపీ (YSRCP) నుంచి ఘన విజయం సాధించారు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. రాజధాని ప్రాంతంలో వైసీపీ పరువు నిలబెట్టిన ఎమ్మెల్యేగా ఆమెకు పేరింది.

  Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) విడిపోయిన తర్వాత అప్పటి ప్రభత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది. దీంతో అక్కడి భూములకు రెక్కలొచ్చాయి. అక్కడి ప్రజల లైఫ్ స్టైల్ మారింది. ఐతే తమకు ఇంత లైఫ్ ఇచ్చిన చంద్రబాబును గెలిసపిస్తారని అంతా భావించారు. టీడీపీ (TDP) కి అంతా పాజిటివ్ అనుకున్న అమరావతి (Amaravati) ప్రాంతంలో వైసీపీ (YSRCP) నుంచి ఘన విజయం సాధించారు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. రాజధాని ప్రాంతంలో వైసీపీ పరువు నిలబెట్టిన ఎమ్మెల్యేగా ఆమెకు పేరింది. ఐతే డాక్టరుగా పెద్దగా పేరు తెచ్చుకోపోయినా.. నాయకురాలిగా బాగానే గుర్తింపు తెచ్చుకున్నారు. ఉండవల్లి శ్రీదేవి సీఎం జ‌గ‌న్ ఇంటి డాక్టర్ కూడానట. హైద‌రాబాద్‌లో ఆమెకు ఉన్న ఆమె మ‌ల్టీస్పెషాలిటీ ఆసుప‌త్రిలోనే.. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు వైద్య సేవ‌లు పొందేవారట. ఈ ప‌రిచ‌యాల నేప‌థ్యంలోనే 2019 ఎన్నిక‌ల్లో ఆమెకు జ‌గ‌న్ పిలిచి టికెట్ ఇచ్చారు.

  అప్పటి వ‌ర‌కు పార్టీ కోసం ప‌నిచేసిన వారిని కూడా ప‌క్క‌న పెట్టి మ‌రీ.. ఈ లేడీ డాక్ట‌ర్‌కు తాడికొండ రిజర్వుడు సీటు కేటాయించారు సీఎం జగన్. ఎన్నికల్లో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌పై స్వ‌ల్ప ఓట్ల ఆధిక్య‌త‌తో విజ‌యం ద‌క్కించుకున్నారు. అంతే అప్పటి నుంచి ప‌క్కా మాస్ మహరాణిలా వ్య‌వ‌హ‌రించారు.

  ఇది చదవండి: ప్రత్యర్థుల ప్లాన్ కు రోజా చెక్.. స్కెచ్ మాములుగా లేదుగా..!


  మూడు రాజధానుల వ్యవహారంలో అమరావతి రైతుల‌ను నిత్యం రెచ్చ‌గొట్టారు. అధినేత జగ‌న్‌ మెప్పుకోసం వారిని పెయిడ్ ఆర్టిస్టులన్నారు. అంతేకాదు... ఓ సందర్భంలో అంబేద్కర్ ను చులకన చేసి మాట్లాడారు. ఆయన వల్ల మాదిగలకు వచ్చిన హక్కులు ఏమీ లేవని వ్యాఖ్యానించారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాస్తే దానిని సక్రమంగా అమలు చేసిన బాబూ జగ్జీవన్ రామ్ వల్లే మాదిగలకు రాజ్యాంగ హక్కులు సంక్రమించాయని చెప్పుకొచ్చారు. ఈ వివాదం ముదరడంతో తన వీడియోని మార్ఫింగ్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెబుతూనే క్షమాపణలు చెప్పారు.

  ఇది చదవండి: వీవీఐపీలందరికీ విజయవాడతోనే పని.. దీని వెనుక పెద్ద కారణమే ఉంది..!


  ఇక పేకాట క్లబ్బుల వ్యవహారంలో ఆమె అనుచరులే ఆడియో టేప్ లీక్ చేసిన వ్యవహారం అప్పట్లో కలకలం రేపింది. అప్పుడు కూడా బుకాయింపులకు దిగారు. ఆ ఆడియోలో వాయిస్ అసలు తనదే కాదన్నారు. ఇదే స‌మ‌యంలో సొంత పార్టీ నేత‌ల‌తో కూడా కయ్యాల‌కు కాలుదువ్వారనీ.. పొరుగు నియోజ‌క‌వ‌ర్గాల ఎమ్మెల్యేల‌తోనూ విభేదాలు తెచ్చుకున్నారనీ.. ఫ‌లితంగా జ‌గ‌న్ ద‌గ్గ‌ర ఇమేజ్ కాస్తా డ్యామేజీ అయిందని టాక్.

  ఇది చదండి: ఏపీలో లెక్కలేనంత సహజవాయువు నిక్షేపాలు.. పార్లమెంట్ లో కేంద్రం కీలక ప్రకటన.. 


  ఇదిలావుంటే.. తాజాగా గ‌డ‌ప గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మంలో ఉండవల్లి శ్రీదేవి భంగపాటు ఎదురైందట. ఆమెను నిల‌దీస్తున్న ప్రజలకు ఒక‌టి రెండు సార్లు వారికి స‌మాధానం చెప్పారట. కానీ.. ప్రజల నుంచి ప్రశ్నలు ఎక్కువయ్యే సరికి ఇప్పుడు వారి గడప తొక్కడం మానేశారు. దీనికితోడు.. సొంత అనుచరులు, కార్యకర్తలు కూడా ఆమెపై గుర్రుగా ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో తాము ఎంతో సాయం చేశామ‌నీ.. కానీ ఆమె మాత్రం త‌మ‌కు ఏమీ చేయ‌లేద‌ని ఆగ్రహంగా ఉన్నారు. పైగా ఎమ్మెల్యేగారు ఎక్కువగా హైదరాబాద్‌లోనే ఉంటున్నారని కార్యకర్తలు చెబుతున్నారు.

  ఇది చదవండి: ఆ ఊళ్లో పాలు ఫ్రీ.. కొనడం, అమ్మడం నిషేధం.. కారణం ఇదే..!  దీంతో ఇప్పుడు ఉండవల్లి శ్రీదేవి ఇల్లు దాటినా.. జెండా ప‌ట్టుకునే కార్య‌క‌ర్తకానీ, జై కొట్టే నాయ‌కుడు కానీ క‌రువయ్యార‌ట. ఈ ప‌రిణామాల వెనుక తన సామాజిక వర్గానికే చెందిన ఓ ఎంపీ నందిగం సురేష్ ఉన్నారని ఆమె వాద‌న‌. నందిగం సురేష్ స్వగ్రామం తాడికొండ నియోజకవర్గంలోనే ఉంది. ఇసుక తవ్వకాలతో ఎంపీ ఆయన అనుచరులు భారీగా వెనకేసుకుంటున్నారని శ్రీదేవి అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు వార్తలు వచ్చాయి. దీంతో తనపై ఆయన అసమ్మతిని ఎగదోస్తున్నారని ఆమె అనుమానిస్తున్నారు.  ఇది చదవండి: ఈ పంట ఒక్కసారి వేస్తే 40ఏళ్లు దిగుబడి.. ఖర్చు లేదు.. కేవలం లాభమే.. వివరాలివే..!

  ప్రస్తుతం తాడికొండ సీటును ఉండవల్లి శ్రీదేవి, ఎంపీ నందిగం సురేష్ తో పాటు మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, గుంటూరు జెడ్పీ చైర్పర్సన్ హెనీ క్రిస్టియానా ఆశిస్తున్నారు. అయితే.. స‌ద‌రు ఎంపీ.. విష‌యంలోఅధిష్టానం పాజిటివ్‌గా ఉండ‌డంతో ఉండ‌వ‌ల్లిని దూరం పెట్టి.. ఎంపీ వైపే జగన్ మొగ్గు చూపుతున్న‌ట్టు తెలుస్తోంది. కార్యకర్తల్లో అసంతృప్తితో పాటు సీటుకి తీవ్ర పోటీ ఉండడంతో ఈసారి శ్రీదేవికి టికెట్ రాదని ప్రచారం జరుగుతోంది. దీంతో ఉండ‌వ‌ల్లి.. పార్టీ కార్య‌క్ర‌మాలకు దూరంగా ఉంటున్నార‌ని.. ఆమె కూడా మాన‌సికంగా సిద్ధ‌మ‌య్యార‌ని అంటున్నారు. సో.. ఈలేడీ డాక్టరమ్మ 2024 తర్వాత ఆస్ప‌త్రికే ప‌రిమితం అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Vundavalli sridevi, Ysrcp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు