ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకోనుందా..? విజయవాడ (Vijayawada) నడిబొడ్డులో పొలిటికల్ గేమ్ కొత్త టర్న్ తీసుకోబోతోందా..? ఏపీలో అధికారంలోకి వచ్చేందుకు ట్రై చేస్తున్న జనసేన పార్టీ (Janasena Party) కి కాపు సామాజిక (Kapu Community) వర్గం పూర్తిస్థాయిలో అడగా నిలవనుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకోనుందా..? విజయవాడ (Vijayawada) నడిబొడ్డులో పొలిటికల్ గేమ్ కొత్త టర్న్ తీసుకోబోతోందా..? ఏపీలో అధికారంలోకి వచ్చేందుకు ట్రై చేస్తున్న జనసేన పార్టీ (Janasena Party) కి కాపు సామాజిక (Kapu Community) వర్గం పూర్తిస్థాయిలో అడగా నిలవనుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.. వంగవీటి రంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాతో భేటీ కావడం చర్చనీయాంశమైంది. జులై 3 నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రారంభించనున్న జనవాణి కార్యక్రమం జరగనున్న సంగతి తెలిసిందే..! ఈ నేపథ్యంలో ఆ ఏర్పాట్లను పరిశీలించేందుకు విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంకు వెళ్లిన నాదెండ్ల మనోహర్.. అక్కడ మీడియా సమావేశం పూర్తైన వెంటనే ఎదురుగా ఉన్న వంగవీటి రాధా ఇంటికి వెళ్లి కాసేపుభేటీ అయ్యారు.
ఈ భేటీతో వంగవీటి రాధా జనసేన పార్టీలో చేరబోతున్నారంటూ వస్తున్న ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. వంగవీటి కుటుంబానికి ఒక్క విజయవాడలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పాపులారిటీ ఉంది. ఇప్పుడు వంగవీటి రాధా జనసేనలో చేరితే ఆ పార్టీకి మరింత బలం చేకూరుతుందన్న చర్చ కూడా జరుగుతోంది.
ఇదిలా ఉంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ జులై 3న విజయవాడలో జనవాణి కార్యక్రమాన్ని వంగవీటి రాధా ఇంటి సమీపంలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలోనే నిర్వహించనున్నారు. జులై 4న వంగవీటి రంగా 75వ వర్ధంతి కావడంతో ఆదివారమే పవన్ కల్యాణ్.. రంగా విగ్రహానికి నివాళులర్పించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు అదే రోజు రంగా-రాధా మిత్రమండలికి చెందిన పలువురు జనసేన పార్టీలో చేరుతారన్న ప్రచారం కూడా జరుగుతోంది.
గతంలోనూ వంగవీటి రాధా జనసేన పార్టీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. ఐతే ప్రజారాజ్యం పార్టీలో పనిచేసి తృటిలో ఓడిపోయిన రాధా.. ఆ తర్వాత వైసీపీలో చేరారు. అక్కడ తగినంత గుర్తింపు ఇవ్వకపోవడంతో 2019 ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. టీడీపీ తరపున పోటీ చేయకపోయినా.. ఎన్నికల ప్రచారంలో మాత్రం పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన టీడీపీని వీడి జనసేనలో చేరబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ రాధా మాత్రం టీడీపీలోనే కొనసాగుతున్నారు.
ప్రజారాజ్యం అనుభవాలు, ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జనసేనలో చేరే అంశంపై రాధా స్పందించలేదు. ఐతే ఈ మధ్యలో రాధా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కూడా భేటీ అయ్యారు. కానీ పార్టీలో చేరికపై మాత్రం తేల్చలేదు. జనసేనలో రాధా చేరికపా ఇటు పార్టీ వర్గాలు గానీ, అటు జనసేన నేతలుగానీ స్పందించలేదు. ఐతే రాధా టీడీపీలో ఉండేకంటే జనసేనలో చేరితే మరింత బలం చేకురుతుందని జనసేనికులు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.