హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Cabinet: మంత్రి పదవిపై రోజాకు సీఎం క్లారిటీ ఇచ్చేశారా..? ఆమెకు దక్కే పదవి ఇదేనా..? ఆ ప్రచారంలో నిజమెంత..?

AP Cabinet: మంత్రి పదవిపై రోజాకు సీఎం క్లారిటీ ఇచ్చేశారా..? ఆమెకు దక్కే పదవి ఇదేనా..? ఆ ప్రచారంలో నిజమెంత..?

AP Politics: 24 మందితో రాజీనామా చేయించిన జగన్.., 24 మంది ఎమ్మెల్యేలను మంత్రులుగా తీసుకుంటారన్న ప్రచారం జరిగింది. ఐతే ఇంతలోనే జగన్ తన మనసు మార్చుకున్నారని.. పాత మంత్రుల్లో దాదాపు 10 మందిని మళ్లీ తన టీమ్ లోకి తీసుకుంటారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో రోజా అంశం ఆసక్తికరంగా మారింది.

ఇంకా చదవండి ...

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కేబినెట్ పై సర్వత్రా చర్చ జరగుతోంది. గురువారం జరిగిన కేబినెట్ (AP Cabinet) సమావేశం తర్వాత మంత్రులంతా రాజీనామాలు సమర్పించగా.. కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఐతే 24 మందితో రాజీనామా చేయించిన సీఎం జగన్ (AP CM YS Jagan).., 24 మంది ఎమ్మెల్యేలను మంత్రులుగా తీసుకుంటారన్న ప్రచారం జరిగింది. ఐతే ఇంతలోనే జగన్ తన మనసు మార్చుకున్నారని.. పాత మంత్రుల్లో దాదాపు 10 మందిని మళ్లీ తన టీమ్ లోకి తీసుకుంటారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందరూ కొత్తవారిని తీసుకుంటే ఎన్నికల నాటికి పాలనా పరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశముందని.. అందుకే సీనియారిటీ, సమర్ధత ఆధారంగా 7 నుంచి 10 మందిని కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

    మంత్రివర్గంలో కొనసాగేవారి లిస్టులో బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్నినాని, కొడాలి నాని, చెల్లుబోయిన వేణు, సీదిరి అప్పలరాజు, అంజాబ్ భాషా పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఓ మహిళా మంత్రిని కూడా కొనసాగిస్తారన్న ప్రచారం జరుగుతున్నందున తానేటి వనిత గానీ, మేకతోటి సుచరితగానీ ఉండే చాన్సుందని తెలుస్తోంది.

    ఇది చదవండి: సీఎం జగన్ లో సడన్ ఛేంజ్ ను గమనించారా..? ఆ మార్పుకు కారణాలు ఇవేనా..?

    ఇక వైసీపీలో అందరికంటే ముందుగా మంత్రి పదవిని ఆశిస్తున్న నగరి ఎమ్మెల్యే రోజాకు అమాత్యయోగం దాదాపు లేనట్లేనని తెలుస్తోంది. సీనియర్లను కొనసాగిస్తే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఖచ్చితంగా ఆ జాభితాలో ఉంటారు. చిత్తూరు జిల్లా సమీకరణాల్లో పెద్దిరెడ్డి మంత్రివర్గంలో ఉంటే రోజాకు ఛాన్స్ ఉండదు. దీనిపై ఇప్పటికే రోజాకు సమాచారం ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఆమెకు పార్టీకి సంబంధించి కీలక బాధ్యతలు ఇస్తారన్న టాక్ నడుస్తోంది. మరోవైపు రోజా మాత్రం గత వారం రోజులుగా మంత్రిపదవి దక్కాలని గుళ్లు, గోపురాల చుట్టూ తిరుగుతున్నారు. కాణిపాకం నుంచి కాశీ వరకు అన్ని ఆలయాలను చుట్టేశారామె. ఇదిలా ఉంటే రోజాకు పదవి గ్యారెంటీ అని.. మహిళల కోటాలో అయినా ఛాన్సుంటుందని ఆమె అభిమానులంటున్నారు.

    ఇది చదవండి: కేబినెట్ పై సీఎం జగన్ అనూహ్య నిర్ణయం.. ఆ 10 మందికి సెకండ్ ఛాన్స్..?

    రోజాను మంత్రివర్గంలోకి తీసుకొని హోం శాఖ ఇస్తారన్న ప్రచారం చాలా రోజులుగా సాగుతోంది. ఐతే రోజాను కేబినెట్లోకి తీసుకోకపోయినా హోం మంత్రి మాత్రం మరోసారి మహిళకే ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. ఐతే హోంమంత్రి అయ్యే మహిళా ఎమ్మెల్యే ఎవరనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఎస్సీ మహిళ కోటాలో తానేటి వనిత, సుచరితలో ఒకర్ని కొనసాగించే అవకాశముండటంతో వాళ్లిద్దరిలో ఒకరికి హోం శాఖ ఇవ్వొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎక్కువశాతం సుచరితకే ఆ పదవి దక్కుతుందన్న ప్రచారం జరుగుతోంది. ఈ సస్పెన్స్ కు తెరపడాలంటే మరో సీఎంఓ నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చేవరకు ఓపికపట్టాల్సిందే..

    First published:

    Tags: Andhra Pradesh, AP cabinet, Ap cm ys jagan mohan reddy, MLA Roja

    ఉత్తమ కథలు