హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Chandrababu-Vishal: చంద్రబాబుకు పోటీగా విశాల్..? కుప్పంలో గెలుపునకు జగన్ స్కెచ్..? వైరల్ అవుతున్న న్యూస్..

Chandrababu-Vishal: చంద్రబాబుకు పోటీగా విశాల్..? కుప్పంలో గెలుపునకు జగన్ స్కెచ్..? వైరల్ అవుతున్న న్యూస్..

చంద్రబాబు, విశాల్ (ఫైల్)

చంద్రబాబు, విశాల్ (ఫైల్)

హీరో విశాల్ (Hero Vishal) పరిచయం అక్కర్లేని వ్యక్తి. తెలుగు వాడే అయినప్పటికీ తమిళనాడు (Tamilnadu) లో అగ్ర కథానాయుడిగా కొనసాగుతున్నాడు. ఇప్పటికే తమిళనాట నడిగర్ సంఘం అధ్యక్షునిగా పనిచేసారు విశాల్. సామాజిక దృక్పథం ఉన్న వ్యక్తిగాను అందరికి సుపరిచితులే. విశాల్ తండ్రి కృష్ణారెడ్డి తెలుగు వాడు కావడం.. వారి బంధు వర్గం అంతా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోనే ఉంది.

ఇంకా చదవండి ...

GT Hemanth Kumar, News18, Tirupati

హీరో విశాల్ (Hero Vishal) పరిచయం అక్కర్లేని వ్యక్తి. తెలుగు వాడే అయినప్పటికీ తమిళనాడు (Tamilnadu) లో అగ్ర కథానాయుడిగా కొనసాగుతున్నాడు. ఇప్పటికే తమిళనాట నడిగర్ సంఘం అధ్యక్షునిగా పనిచేసారు విశాల్. సామాజిక దృక్పథం ఉన్న వ్యక్తిగాను అందరికి సుపరిచితులే. విశాల్ తండ్రి కృష్ణారెడ్డి తెలుగు వాడు కావడం.. వారి బంధు వర్గం అంతా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోనే ఉంది. అంతే కాదు హీరో విశాల్ కు ఏపీలోని రాయలసీమ జిల్లాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక చిత్తూరు జిల్లాలో తమిళ నేటివిటీ, తమిళనాడుకు సమీప ప్రాంతం కావడంతో మరింత ఆదరణ లభిస్తుంది. ఈ ఆదరణనే క్యాష్ చేసువుకోవాలి చూస్తోంది వైసీపీ. విశాల్ తెలుగు వాడు... అందులోనూ రెడ్డి సామజిక వర్గానికి చెందిన వాడు కావడంతో కుప్పంలో కుప్పంలో వ్యూహాలు మార్చేస్తున్నారు వైసీపీ నాయకులు.

జగన్ కు వీరాభిమానిగా విశాల్ పలు సందర్భాలలో చెప్తూ వచ్చారు. తమిళ హీరో అయినా బంధువర్గం కుప్పంలో ఉన్నారనే టాక్ వినిపిస్తూ వస్తోంది. ఏపీలో రాజకీయాలు రోజు రోజుకు మారుతున్న నేపథ్యంలో వ్యూహాలకు ప్రతి వ్యూహాలు తార స్థాయికి చేరుకుంటున్నాయి. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుని దెబ్బ తీసేందుకు సరికొత్తగా ప్రజల ముందుకు వెళ్లేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అందుకు దీటుగా టీడీపీ పార్టీ జిల్లా యాత్రలు చేస్తూ.. ప్రజలు తమవైపే ఉన్నారని తన బలాన్ని చాటుతోంది.

ఇది చదవండి: అంతాకలిసి నా వెంట్రుక కూడ పీకలేరు.. మరోసారి సీఎం జగన్ హాట్ కామెంట్స్..


కుప్పంలో చంద్రబాబు 1989 నుంచి తిరుగులేని సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. అవతలివైపు ఎవరు నిలబడినా.. చంద్రబాబుదే గెలుపు. కానీ వైసీపీ అధికారంలోని రాగానే చంద్రబాబుకు ఎన్నడూ లేని విధంగా ఎదురుదెబ్బలు తగులుతూ వస్తున్నాయి. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో వరుసగా స్థానిక మున్సిపల్ ఎన్నికలు గెలిచిన ఉత్సాహంలో ఉంది వైసీపీ. ఈ క్రమంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది.

ఇది చదవండి: సీఎం జగన్ గోల్డెన్ ఛాన్స్ మిస్సయ్యారా..? ఆ విషయంలో ఆశలు వదులుకోవాల్సిందేనా..?


కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామంటూ జిల్లా మంత్రి పెద్దిరెడ్డి పదే పదే చెబుతూ వస్తున్నారు. అయితే, చంద్రబాబు సైతం గతం కంటే ఎక్కువగా ఈ సారి తన నియోజకవర్గంపై శ్రద్ధపెట్టారు. తరచూ పర్యటనలు చేస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీ నుంచి ఈసారి కుప్పంలో ఎవరు పోటీ చేస్తారనేదానిపై చర్చ జరుగుతోంది. ఈక్రమంలో పలుపేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఈ జాబితాలో మంత్రి పెద్దిరెడ్డి సోదరుడి కుమారుడు పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అదే సమయంలో బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాల్సి వస్తే ఇద్దరి పేర్లు సైతం పరిశీలనలో ఉన్నాయి.

ఐతే ఎన్ని పేర్లు పరిగణలోకి తీసుకున్న చంద్రబాబుకు పోటీ ఇచ్చే అంశం అనుమానంగా మారింది. అందుకే అటు గ్లామర్, ఇటు బంధుగణం, పాపులారిటీ ఉన్న విశాల్ ను రంగంలోకి దించాలని జగన్ భావిస్తున్నారట. విశాల్ కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కావడమే కాకుండా.. జగన్ కు వీరాభిమాని. చంద్రబాబుకు పోటీ ఇచ్చేందుకు అలాంటి వ్యక్తి అయితేనే సరైనోడని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. విశాల్ ను ఎమ్మెల్యే అభ్యర్థిగా కుప్పంలో నిలబెడితే చంద్రబాబుకి చెక్ పెట్టినట్లు అవుతుందని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ఇటు వైసీపీ నుంచి గానీ.. అటు విశాల్ నుంచిగానీ క్లారిటీ లేదు. ఈప్రచారంలో నిజమెంతనేది తెలియాలంటే మరికొన్నిరోజులు ఆగాల్సిందే..!

First published:

Tags: Andhra Pradesh, Chandrababu Naidu, Hero vishal, Kuppam

ఉత్తమ కథలు