హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Janasena: జనసేనలోకి ఆ రెండు పార్టీల నేతలు..? పవన్ వైపు చూడటానికి కారణం ఇదేనా..!

Janasena: జనసేనలోకి ఆ రెండు పార్టీల నేతలు..? పవన్ వైపు చూడటానికి కారణం ఇదేనా..!

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎప్పుడూ పొలిటికల్ హీట్ ఉంటుంది. ఎన్నికలున్నా లేకపోయినా నేతల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉంటాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండటంతో ఇప్పటినుంచే జనంలోకి వెళ్లేందుకు అన్ని పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎప్పుడూ పొలిటికల్ హీట్ ఉంటుంది. ఎన్నికలున్నా లేకపోయినా నేతల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉంటాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండటంతో ఇప్పటినుంచే జనంలోకి వెళ్లేందుకు అన్ని పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎప్పుడూ పొలిటికల్ హీట్ ఉంటుంది. ఎన్నికలున్నా లేకపోయినా నేతల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉంటాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండటంతో ఇప్పటినుంచే జనంలోకి వెళ్లేందుకు అన్ని పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.

ఇంకా చదవండి ...

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎప్పుడూ పొలిటికల్ హీట్ ఉంటుంది. ఎన్నికలున్నా లేకపోయినా నేతల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉంటాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండటంతో ఇప్పటినుంచే జనంలోకి వెళ్లేందుకు అన్ని పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. కొందరు నేతలైతే పార్టీలు మారేందుకు కూడా సిద్ధమయ్యారన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, జల్లాల ఏర్పాటులో చోటు చేసుకున్న అసంతృప్తులు పార్టీ పార్పులకు కారణం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో అధికార పార్టీతో పాటు పలు పార్టీలకు చెందిన నేతలు జనసేన (Janasena) వైపు చూస్తున్నట్లు జోరుగా టాక్ నడుస్తోంది. వైసీపీలో గుర్తింపు రానివారు, టీడీపీ (TDP) లో చేరడానికి సిద్ధంగా లేని నేతలు జనసేనను బెస్ట్ ఆప్షన్ గా ఎంచుకుంటున్నారట.. పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టిన పవన్ ఆయా నేతల చేరికకు సుముఖంగా ఉన్నారన్న చర్చ జరుగుతోంది.

  జనసేన వైపు చూస్తున్న నేతల్లో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు పేరు వినిపిస్తోంది. ఆయన ఇప్పటికే చాలా పార్టీలు మారారు. అందుకే పొలిటికల్ కాస్త డల్ అయ్యారన్న ప్రచారం కూడా ఉంది. 2004 వరకు టీడీపీలో ఉన్న ఆయన.. ఆ ఎన్నికల్లో ఓటమి తర్వాత 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. తర్వాత కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీలో చేరారు. కానీ ఆ పార్టీలో ఎక్కువ కాలం లేరు. వైసీపీ నుంచి టీడీపీ.. మళ్లీ టీడీపీ నుంచి వైసీపీ చేరారు. అధికార పార్టీలో ఉన్నా ఆయనకు సరైన గుర్తింపు లేదు. పదవి రాకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కొత్తగా ఏర్పడబోతున్న నరసాపురం జిల్లా కేంద్రంగా భీమవరంను ప్రకటించడాన్ని వ్యతిరేకించిన ఆయన.. వైసీపీ ఎమ్మెల్యేను గెలిపించి తప్పుచేశానంటూ చెప్పుతో కొట్టుకున్నారు. కొత్తపల్లి తీరుపై మంత్రి పేర్ని నాని బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. అలా చేయడం సరికాదన్నారు కూడా. ఈ నేపథ్యంలో ఆయన జనసేన పార్టీలో చేరాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. జనసేన అభ్యర్థిగా నరసాపురం నుంచి పోటీ చేయాలని చూస్తున్నారట కొత్తపల్లి సుబ్బారాయుడు.

  ఇది చదవండి: ఏపీలో ఆన్ లైన్ సినిమా టికెట్లకు రంగం సిద్ధం.., ఆ సంస్థకు కాంట్రాక్ట్..

  జనసేనలో చేరుతారంటూ వినిపిస్తున్న పేర్లలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు కూడా బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన.. చాలా కాలంగా పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీలోనే ఉన్నా.. యాక్టివ్ గా కనిపించడం లేదు. మధ్యలో వైసీపీలో చేరాతన్న ప్రచారం జరిగినా అది సాధ్యపడలేదు. బీజేపీ వైపు చూస్తున్నట్లు వార్తలు వచ్చినా అది పుకారుగానే మిగిలిపోయింది. ఐతే ఈసారి జనసేనలో చేరాలని గంటా డిసైడయ్యారని.. ఐతే జనసేన-టీడీపీ పొత్తుపెట్టుకుంటేనే ఆ పార్టీలో చేరాలని ఆయన భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

  ఇది చదవండి: జూనియర్ ఎన్టీఆర్ విషయంలో టీడీపీకి మరో ఆప్షన్ లేదా..? ఆర్ఆర్ఆర్ హిట్ తర్వాత మారిన లెక్కలు..!

  ఇక జనసేన పార్టీ బలంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలోనూ పలువురు నేతలు జనసేన వైపు చూస్తున్నారట. రెండేళ్ల క్రితం అధికార పార్టీలో చేరి సరైన గుర్తింపురాని ఓ నేత కూడా ఇప్పుడు పవన్ పార్టీలో చేరాలనుకుంటున్నారట. గతంలోనే ఆయన జనసేన తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. అంతా ఓకే అనుకునే సమయానికి ఆయన ప్లేటు ఫిరాయించారు. ఆయనపై పవన్ అసంతృప్తిగా ఉన్నా.. పార్టీలోని ముఖ్యనేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్.

  ఇది చదవండి: ఆయన వెనుక అసాంఘిక శక్తులు.. బ్రదర్ అనిల్ పై క్రైస్తవ సంఘాల సంచలన ఆరోపణలు..

  వీరితో పాటు గోదావరి జిల్లాలకు చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన పలువురు ముఖ్యనేతలు, మాజీ ఎమ్మెల్యేలు జనసేనలో చేరి పోటీ చేయాలని చూస్తున్నారట. ఐతే టీడీపీతో జనసేనకు పొత్తు ఖరారైతే వీరంతా అధికారికంగా పవన్ తో జతకట్టే అవకాశముందని తెలుస్తోంది.

  First published:

  Tags: Andhra Pradesh, Janasena party, Pawan kalyan

  ఉత్తమ కథలు