Home /News /andhra-pradesh /

AP POLITICS SPECULATIONS ON CM JAGAN MAY REJECT TICKETS TO 50 OF SITTING MLAS IN 2024 TO IMPLEMENT PARTY STRATEGY FULL DETAILS HERE PRN BK

YSRCP: పార్టీపై సీఎం జగన్ ఫోకస్.. వచ్చే ఎన్నికల్లో 50మంది సిట్టింగ్ లకు నో టికెట్..? కారణం ఇదేనా..?

సీఎం జగన్ (పాత ఫొటో)

సీఎం జగన్ (పాత ఫొటో)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party).. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సిద్ధమవుతోంది. కేబినెట్ పునర్వ్యవస్థీకరణే (AP Cabinet Reshuffle) ఇందుకు నిదర్శనం

  M Bala Krishna, News18, Hyderabad

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party).. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సిద్ధమవుతోంది. కేబినెట్ పునర్వ్యవస్థీకరణే (AP Cabinet Reshuffle) ఇందుకు నిదర్శనం. పూర్తిగా ఎలక్షన్స్ కోసం కొత్త టీమ్ ను ప్రకటించారు సీఎం జగన్ (AP CM YS Jagan). ఇప్పటి నుంచే పార్టీలో ఎవర్ని ఉంచాలి.. ఎవర్ని తప్పించాలనే దానిపైనా జగన్ కసకత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. సీఎంగా బాధ్య‌త‌లు తీసుకున్న‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీ లో నేత‌ల‌కు సంబంధించిన ప్రొగ్రెస్ రిపోర్ట్ ఎప్ప‌టిక‌ప్పుడు తెప్పించుకుంటున్నారు. ప్ర‌భుత్వం ఏర్ప‌డిన‌ప్పుడు మంత్రి ప‌ద‌వులు ఇచ్చిన పార్టీలో కొంత మంది నేత‌ల‌కు మంత్రి ప‌ద‌వులు ఇచ్చిన జ‌గ‌న్ త‌రువాత కేబినెట్ పునర్వ్యవస్థీకరణ పేరుతో చాలా మందిని ఇంటికి పంపించారు. అయితే తాజాగా జ‌గ‌న్ ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించిన క‌స‌ర‌త్తు ప్రారంభించిన‌ట్లు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

  వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు గుర్ర‌ల‌కు సంబంధించిన రిపోర్ట్ ను ఇప్ప‌టికే జ‌గ‌న్ సిద్ధం చేస్తోన్న‌ట్లు పార్టీ వ‌ర్గాలు స‌మాచారం. జ‌గ‌న్ ముంద‌స్తుకు వెళ్లే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రిని బ‌రిలో నిల‌పాల‌న్న దానిపై నియోక‌వ‌ర్గాలవారిగా క‌స‌రత్తు ఇప్ప‌టికే ప్రారంభించిన‌ట్లు తెలుస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో అవ‌కాశం పొందిన సిటింగ్ ల‌కు త‌ప్పించి కొత్త వారికి అవ‌కాశం ఇవ్వ‌లాని జ‌గ‌న్ ఆలోచిస్తోన్న‌ట్లు స‌మాచారం. అందులో భాగంగా దాదాపు 50 మంది సిటింగ్ ఎమ్మెల్యేల‌కు జ‌గ‌న్ టిక్కెట్ ఇవ్వ‌టం లేన‌ట్లు స‌మాచారం.

  ఇది చదవండి: ఏపీలో రూ.2వేల నోట్లు మాయం చేసింది వాళ్లే..! సీఎంపై టీడీపీ నేత సంచలన కామెంట్స్..


  ఇప్ప‌టికే ఈ స‌మాచారం అందుకున్న కొంద‌రు ఎమ్మెల్యేలు జ‌గ‌న్ చివ‌రి నిముషంలో హ్యండ్ ఇస్తే తాము సేఫ్ జోన్ లో ఉండే విదంగా కొంత మంది టీడీపీ, మ‌రికొంత మంది బీజేపీ వైపు చూస్తోన్న‌ట్లు తెలుస్తోంది. దాదాపు 50 మంది సిట్టింగ్ ల‌ను తీసేయాల‌న్న ఆలోచ‌న జ‌గ‌న్ కు ఎందుకొచ్చింద‌న్న‌పై ఇప్పుడు తీవ్ర స్థాయిలో చ‌ర్చ జ‌రుగుతుంది. ఇప్ప‌టికే ఈ అంశానికి సంబంధించి కొంత మంది ఎమ్మెల్యేల‌కు స్ప‌ష్ట‌మైన స‌మాచారం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

  ఇది చదవండి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు షాక్.. అలా చేయకుంటే జీతాలు కట్..?


  అయితే జ‌గ‌న్ ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం వెనుక వైసీపీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఉన్నార‌ని కొంద‌రు చెబుతున్నారు. పీకే జ‌గ‌న్ కు ఇచ్చిన నివేదిక ప్ర‌కారం ఆ 50 మంది ఎమ్మెల్యేల ప‌ట్లు ప్ర‌జ‌ల్లో చాలా వ్య‌తిరేక‌త ఉంద‌ని తెలుస్తోంది. దీన్ని ఆధారంగా చేసుకొని జ‌గ‌న్ ఈ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఒక వెళ వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్ ఇవ్వ‌క‌పోతే వీళ్లు రెబ‌ల్స్ గా మారింతే ఎన్నిక‌ల స‌మ‌యం నాటికి పార్టీకి ఎటువంటి డేమేజ్ కాకుండా ఉండే విధంగా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఇటు పార్టీలోనూ అటు ప్ర‌భుత్వంలోనూ ఆ 50 మంది ఎమ్మెల్యేలు ఎవ‌ర‌నే చ‌ర్చ జోరుగా జ‌రుగుతుంది.

  ఇది చదవండి: జగన్ గ్యాంబ్లింగ్ సీఎం.. వైఎస్ సేల్స్ మేన్.. ఏపీలో పవన్ ఎఫెక్ట్ గ్యారెంటీ.. మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు


  ఇప్ప‌టికే నియోక‌వ‌ర్గాల్లో వాళ్లు చేసిన అవినితి చిట్టాలు, చేసిన సెటిల్మెమెంట్స్ కు సంబంధించి అన్ని జ‌గ‌న్ దృష్టికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. మ‌రో వైపు దాదాపు 50 మంది సిటింగ్ ల‌కు టిక్కెట్ నిరాక‌రించ‌డం అంతా సుల‌వైన ప‌ని కాద‌ని అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. అయితే జ‌గ‌న్ ఒకవేళ అనుకుంటే త‌ప్ప‌కుండా చేస్తాడాని అంటున్నారు. మ‌రో వైపు తాజా కేబినేట్ విస్త‌ర‌ణ వ్య‌వహారాన్ని కూడా చాలా మంది గుర్తు చేసుకుంటున్నారు. వాస్త‌వానికి తొలిత జ‌గన్ కేబినెట్ లో మంత్రుల మొత్తాన్ని మార్చేస్తాన‌ని అన్నారు. కానీ త‌రువాత సీనియ‌ర్లు ఒత్తిడితో కొంత మందిని కొన‌సాగించాల్సి వ‌చ్చింది. దీంతో ఎన్నిక‌ల నాటికి ఎలాంటి ప‌రిణామాలు జ‌రిగిన ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేద‌ని అంటున్నారు రాజకీయ విశ్లేష‌కులు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP Politics, Ysrcp

  తదుపరి వార్తలు