Home /News /andhra-pradesh /

AP POLITICS SPECULATIONS ON AP CM YS JAGAN MOHAN REDDY DELHI TOUR FULL DETAILS HERE PRN GNT

Jagan Delhi Tour: సీఎం జగన్ ఢిల్లీ టూర్ లో కనిపించని ఉత్సాహం..? కారణాలు ఇవేనా..?

సీఎం వైఎస్ జగన్

సీఎం వైఎస్ జగన్

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన (AP CM YS Jagan Delhi Tour) ముగిసింది. రాష్ట్రానికి సంబందించిన రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, విభజన హామీలు తదితర అంశాలను సీఎం.. ప్రధాని మోదీ (PM Modi) తో పాటు పలువురు కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు.

ఇంకా చదవండి ...
    Anna Raghu, News18, Amaravati

    ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన (AP CM YS Jagan Delhi Tour) ముగిసింది. రాష్ట్రానికి సంబందించిన రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, విభజన హామీలు తదితర అంశాలను సీఎం.. ప్రధాని మోదీ (PM Modi) తో పాటు పలువురు కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఐతే జగన్ టూర్ సక్సెస్ అయిందా..? గతంలో ఢిల్లీ వెళ్లినప్పుడు ఉన్న జోష్ ఇప్పుడు లేదా..? నామామాత్రంగానే టూర్ ను మమా అనిపించారా..? అనే చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ఖరారు కాగానే ఓ ప్రత్యేకమైన బృందం ఢిల్లీ వెళ్లేది. అక్కడి కార్యకలాపాలు చక్కబెట్టేవారు. అయితే ఈ సారి అలాంటి బృందం ఏదీ లేనట్లుగా తెలుస్తోంది. జగన్ ఢిల్లీ వెళ్తున్నారంటే గతంలో కనిపించే హడావుడిలో ఇప్పుడు సగం కూడా లేదన్న భావన వ్యక్తమవుతోంది.

    సీఎం ఢిల్లీ వస్తున్నారంటే పెద్ద ఎత్తున రాజకీయ నేతలు.. పారిశ్రామికవేత్తలు కలవటానికి పోటీపడుతుండేవారు. కానీ ఈసారి మాత్రం అలాంటి సందడి లేదనే టాక్ వినిపిస్తోంది. ప్రధానితో భేటీ సందర్భంగా విభజన హామీల, పోలవరం నిధులు, ప్రత్యేక హోదా, విభజన చట్టం షెడ్యూల్ 10లోని సంస్థల విభజన, మూడు రాజధానులు వంటి అంశాలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై లెక్కలతో సహా వివరించినా చూస్తాం.. చేస్తామనేగానీ స్పష్టమైన హామీలు రాలేదని తెలుస్తోంది. జగన్ ప్రధానంగా డిమాండ్ చేస్తున్న ప్రత్యేక హోదాకు కేంద్రం సానుకూలంగా లేకపోవడం, మూడు రాజధానుల విషయంలోనూ మద్దతు లేకపోవడంతోనే జగన్ ఒకింత నిరాశతో ఉన్నారన్న టాక్ నడుస్తోంది. అలాగే ఉచిత పథకాల విషయంలో సీనియర్ అధికారులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ వ్యవహారం కూడా చర్చకు వచ్చే ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అలాగే రాష్ట్ర అర్ధిక పరిస్థితి, అప్పులు చేసి ఉచిత పథకాలివ్వడం వంటి అంశాలు.

    ఇది చదవండి: మంత్రులకు లాస్ట్ వర్కింగ్ డే.. సీఎం జగన్ నిర్ణయంపై సస్పెన్స్..


    ఇదిలా ఉంటే పెగాసస్ విషయంలో చంద్రబాబుపై సీబీఐ దర్యాప్తును కోరతారన్న ప్రచారం జోరుగా సాగింది. మరి ఆ విషయాన్ని జగన్ లెవనెత్తారా..? ఒకవేళ ప్రస్తావిస్తే మోదీ ఎలా స్పందించారనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఐతే ఇటీవల వైసీపీ మంత్రులు, నేతలు బీజేపీకి వ్యతిరేకంగా ఘాటు విమర్శలు చేయడం, ఆ పార్టీని టీడీపీకి బీ టీమ్ గా అభివర్ణించడం వంటి ఘటనలు ఢిల్లీలో సీఎంను ఒకింత ఇబ్బంది పెట్టి ఉండవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

    ఇది చదవండి: ఏపీలో మరోకొత్త జిల్లా..? సీం జగన్ ఆలోచన.. మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు..


    మరోవైపు టీడీపీ నేతలు మాత్రం సీబీఐ కేసులు, వివేకా హత్య కేసు, ఆర్ధిక అవకతవకలపై చర్చించేందుకే సీఎం ఢిల్లీ వెళ్లారని విమర్శిస్తున్నాయి. కేసుల కోసం ఏపీకి రావాల్సిన నిధుల విషయంలో వైసీపీ సర్కార్ కేంద్రాన్ని ప్రశ్నించలేకపోతోందని ఆరోపిస్తున్నాయి.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP Politics

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు