M Bala Krishna, News18, Hyderabad
టీడీపీ (TDP) నిర్వహించిన మహానాడు సూపర్ సక్సెస్ అవ్వడంతో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) త్వరలో నిర్వహించబోయే ప్లీనరీ ప్రతిపక్ష పార్టీ ఉహాకి అందని రీతిలో చేయాలని సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే అధికార పార్టీ ఏ కార్యక్రమం చేసినా ప్రజలు రావడం లేదని ప్రతిపక్ష పార్టీ సోషల్ మీడియా (Social Media) వేదికగా ప్రచారం చేస్తోంది. దీంతో ఈ ప్లీనరీని గ్రౌండ్ సక్సెస్ చేసి ప్రజల్లో తమ పార్టీకి ఆదరణ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించాలని పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా త్వరలో నిర్వహించబోయే ప్లీనరి గ్రాండ్ సక్సెస్ చేసే బాధ్యతను పార్టీలో కొంత మంది కీలక నేతలకు అప్పగించినట్లు సమాచారం. మరో వైపు ప్లీనరీ వేదికగా జగన్ కొన్ని కీలక ప్రకటనలు చేయబోతున్నట్లు సమాచారం.
వైఎస్ జగన్ (YS Jagan) అధికారంలోకి వచ్చినప్పటికి నుంచి ఇప్పటి వరకు ప్రతిపక్ష పార్టీ చేస్తున్న ప్రచారాలన్నింటికీ ఒక్క దెబ్బతో సమాధానం జగన్ చెప్పబోతున్నారని అంటున్నాయి పార్టీ వర్గాలు. మరోవైపు ఇప్పటికే ప్రజల్లో ఏ మాత్రం వ్యతిరేకత ఉన్నా ఈ ప్లీనరీ వేదికగా వాటిని తొలిగించడానికి జగన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే జగన్ ముందస్తుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారని నవంబర్ లో అసెంబ్లీని రద్దు ఎన్నికలకు వెళ్లబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే జగన్ ఇప్పటివరకు అన్నింట్లోనూ వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తూ వచ్చారని పార్టీ శ్రేణులంటున్నాయి.
ముందస్తు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే కొత్త జిల్లాల ఏర్పాటు, గడపగడపకు మన ప్రభుత్వం.., ఎమ్మెల్యేలకు, మంత్రులకు కొత్త బాధ్యతలు, దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీ వర్గాల బోగట్టా. అయితే త్వరలో జరగబోయే పార్టీ ప్లీనరీని కూడా ఇందుకే జగన్ ఉపయోగించుకోవాలని భావిస్తోన్నట్లు సమాచారం. ప్లీనరీ వేదికగా రాజకీయ వ్యాఖ్యలకు తక్కువ అవకాశం ఇచ్చి ఇప్పటివరకు ప్రభుత్వం చేసిన పనులు.., మళ్లీ అధికారంలోకి వస్తే రాబోయే కొత్త పథకాలకు సంబంధించి జగన్ కీలక ప్రకటనలు చేయనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఇప్పటికే అధికాపార్టీ నేతల్లో ఎవరిమీదైన స్థానికంగా వ్యతిరికత ఉందని భావిస్తే పబ్లిక్ గానే సదరు నేత లేదా ఎమ్మెల్యేకి క్లాస్ తీసుకుంటారని తెలుస్తోంది. అలాగే ఆయా నేతల స్థానంలో బరిలో దించబోయే కొత్త నేతలను కూడా ప్లనరీ వేదికగా ప్రకటిస్తారన్న చర్చ జరుగుతోంది. దీంతో పాటు అభివృద్దికి సంబంధించి ఇప్పటి వరకు వస్తోన్న విమర్శలకు కూడా జగన్ సమాధానం చెప్పబోతున్నట్లు తెలుస్తోంది.
అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి బరిలో ఉంటే వచ్చే పరిస్థితులు, పరిణామాలు కూడా జగన్ వివరించే ప్రయత్నం చేయబోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడానికి తనకు వీలుంటుందని రాబోయే కొత్త పథకాల వివరాలు ప్లీనరీలో వివరించే అవకాశం ఉందని అంటున్నారు పార్టీలో కొంత మంది నేతలు. దీంతో పాటు వచ్చే ఎన్ని కల్లో మీకు పని చేయని నేతలను నిర్దాక్షిణ్యంగా తీసేస్తానని ప్లీనరీలోనే జగన్ క్లారిటీ ఇవ్వబోతున్నట్లు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.